Translate

  • Latest News

    16, జూన్ 2018, శనివారం

    వారితో క‌లిసి అడుగువేద్దామా... ?


    ప్రపంచంలోని బాధ‌లు, క‌ష్టాలు, అప‌న్నుల క‌న్నీళ్లు వ్రాసే విలేక‌రుల క‌ష్టాలు తీర్చే నాధుడు క‌రువ‌య్యారు. ప్రభుత్వానికి , రాజ‌కీయ పార్టీల నాయ‌కుల‌కు జ‌ర్న‌లిస్టులు కావాలి. వారి క‌ష్టాలు, ఇబ్బందుల గురించి బ‌య‌ట ప్రపంచానికి తెలిసే వీలు లేదు. అటు ప్ర‌భుత్వం, జ‌ర్న‌లిస్టు సంఘాలు కాని, మ‌రో వైపు యాజ‌మాన్యం కాని వీరి స‌మ‌స్యల గురించి ప‌ట్టించుకోరు. ప్రపంచం బాధ వీరిదేకాని .. వీరి బాధ ప్ర‌పంచానిది కాదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో వీరి గురించి రాజ‌కీయ‌పార్టీలు హామీలు ఇస్తాయి. మీటింగుల‌కు వెళ్లిన‌ప్ప‌డు చిన్న గిప్ట్‌లు ఇచ్చి స‌రిపుచ్చుతాయి. ఈ ఉద్యోగం చేయ‌లేక‌. ఉన్న ఊబిలో నుంచి బ‌య‌ట‌కు రాలేక జ‌ర్న‌లిస్టు కుటుంబాలు వీధిన ప‌డుతుంటాయి. ఎక్క‌డ అన్యాయం జ‌రిగినా  బ‌య‌ట ప్రపంచానికి తెలియ‌జేసే వీరికి జ‌రిగే  అన్యాయం బ‌య‌ట‌కు రాదు. 

    గ‌తంలో ఇంత‌మంది విలేక‌ర్లు ఉండేవారుకాదు. ఈనాడు దిన ప‌త్రిక ఎప్ప‌డైతే స్థానిక స‌మ‌స్య‌ల‌కు ప్రాధాన్య‌త ఇచ్చి మండ‌ల స్థాయి విలేక‌రుల‌ను ఏర్పాటుచేసుకోవ‌టం, టాబ్లాయిడ్ లు వెల‌వ‌రించిందో అన్ని ప‌త్రిక‌లు ఇదే బాట ప్ర‌య‌ణించాయి. స్థానిక వార్త‌ల‌కు ప్రాధాన్య‌త పెరిగినా ,గ్రామీణ విలేక‌ర్ల‌కు జీతాలు ఇవ్వ‌టంతో అనేక ప‌త్రిక‌లు విఫ‌ల‌య్యాయి. ప‌త్రిక త‌రుపున ఒక గుర్తింపు కాదు మొహ‌న ప‌డ‌వేసి మీ బ్ర‌తుకు మీరు బ్ర‌త‌కండి అంటూ ప్రోత్స‌హించారో అప్ప‌టి నుంచి విలేక‌ర్ల‌లో మ‌రో వ‌ర్గం త‌యారైంది. ఇసుక‌, రేష‌న్ మాఫీయాతో ,ఇత‌ర పంచాయ‌తీల‌లో వీరి తెల్లార‌ల్సిందే. వారితో స‌త్సంబంధాలు ఉన్నంత వ‌ర‌కు తృణ‌మో, ప‌ణ‌మో తీసుకొంటు కాల‌క్షేపం చేయ‌టం ప‌రిపాటిగా మారింది. ఈ ద‌శ‌లోనే గ‌తానికి భిన్నంగా టాబ్ల‌యిడ్‌లు లేకుండా కొన్ని ప‌త్రిక‌లు నూత‌న ప్ర‌యోగానికి శ్రీ‌కారం చుట్టాయి. ఆంద్ర‌లో ఆంద్ర‌ప‌త్రిక ఇప్ప‌టికి ఇలాగే న‌డుస్తుండ‌గా తెలంగాణాలో విజ‌యకాంత్రి , నూత‌నంగా రానున్న మ‌రో ప‌త్రిక ఇదే సంప్ర‌దాయాన్ని కొన‌సాగించ‌నుంది. ఇందువ‌ల్ల మంచి ఉంది.. చెడు ఉంది.. గ్రామీణ ప్రాంతాల వార్త‌లు వెలుగులోకి రావు. మ‌రోవైపు మండ‌లస్థాయి విలేక‌రి వ్య‌వ‌స్థ లేకపోవ‌టంతో కొత్త‌వారు అసాంఘిక శ‌క్తులుగా త‌యార‌య్యే అవ‌కాశం లేదు.  

    క‌డుపు మండిన విలేక‌ర్లు ఉద్య‌మబాట ప‌డుతున్నారు.కోట్లాది రూపాయాలు యాడ్‌ల రూపేనా స‌హాయం పొందుతునే విలేక‌రుల‌కు జీతాలు ఇవ్వ‌ని తీరుపై ఆందోళ‌న‌కు సిద్ద‌మౌతున్నారు. గ‌తంలో కొన్ని టీవీ ఛాన‌ల్స్‌లో ఉద్యోగులు,సిబ్బంది ఆందోళ‌న‌కు దిగ‌టంతో విలేక‌రుల కోరిక‌లు తీరాయి.  తెలుగునాట ఒక ప‌త్రిక‌లో జ‌ర్న‌లిస్టులు వేత‌నాల కోసం స‌మ్మె బాట ఎంచుకున్నారు. స‌మాజంలో  అత్యంత కీల‌కంగా ఉన్న జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్యల‌పై ప్ర‌జ‌లు సైతం మ‌ద్ద‌తు ప‌ల‌కాల్సిన అవ‌స‌రం ఉంది. పెట్టుబ‌డిదారుల విష‌ప‌త్రిక‌ల‌లో నిర్లిప్త‌, నిర్జివ‌మైన జీవితాలు గడుపుతున్న జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల‌పై మ‌నం వారితో క‌లిసి అడుగువేద్దామా... ? 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: వారితో క‌లిసి అడుగువేద్దామా... ? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top