Translate

  • Latest News

    22, జూన్ 2018, శుక్రవారం

    పాత సినిమాల టైటిల్స్ ఇప్పుడు కొత్త ఫ్యాషన్


    కొత్త సినిమాలకు ఒకప్పటి హిట్ సినిమాల పేర్లు పెట్టడం ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త ఫ్యాషన్ అయిపోయింది. అయితే పేరు తప్ప పాత సినిమాలకు... కొత్త సినిమాలకు కథతో అసలు సంబంధమే ఉండకపోవడం విశేషం.  ఆ మధ్య హీరో నితిన్ ఈ సంప్రదాయం మొదలెట్టాడు. 1978 లో మరో చరిత్ర సృష్టించిన  కమల హాసన్ మరోచరిత్ర ను ఎంచక్కా వాడేసుకున్నాడు. కాకపోతే సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తరవాత 1979 లో వచ్చిన సంగీత ప్రధాన చిత్రం శంకరాభరణం ను వాడేసుకున్నాడు. ఇదీ అంతంత మాత్రమే... ఆ తర్వాత వరుణ్ తేజ్ తన బాబాయి సినిమా తొలిప్రేమ టైటిల్ ను వాడుకుని ఆ టైటిల్ కు  ఉన్న వాల్యూ నిలబెట్టాడు.    ఒక మంచి ప్రేమ కథను మనకు అందించాడు. ఇప్పుడు కొత్తగా మరో రెండు సినిమాలు ఈ కోవలోకి చేరాయి.  జంబలకడి పంబ... ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను ఉర్రుతలూగించిన సినిమా.. పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వించిన  సినిమా. ఇప్పుడు ఆ టైటిల్ తో ఓ కొత్త సినిమా విడుదలైనది. అయితే ఆ కధ మొత్తం సమాజాన్ని తలకిందులు చేస్తే ఈ కధలో కేవలం ఒక జంట ను ప్రాతిపదికగా తీసుకుని తయారుచేసిన కధ. అలాగే 1981 లో భారతీరాజా డైరెక్టన్ లో వచ్చిన  కమలహాసన్ సంచలన చిత్రం టిక్..టిక్..టిక్ పేరుతొ మళ్ళీ ఇప్పుడు ఓ కొత్త చిత్రం విడుదలయింది. అయితే ఈ కధే వేరు. ఈ సినిమా కధ అంతరిక్షానికి సంబంధించినది. అయితే మొత్తం మీద పాత హిట్ సినిమా టైటిళ్లు వాడుకుంటున్న వాటిలో హిట్ శాతం మాత్రం చాలా తక్కువగా ఉంటుండడం గమనార్హం. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పాత సినిమాల టైటిల్స్ ఇప్పుడు కొత్త ఫ్యాషన్ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top