Translate

  • Latest News

    24, జూన్ 2018, ఆదివారం

    బి.సి ల వైపు వై.ఎస్.ఆర్.సి.పీ చూపు


    ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్ లో కానీ, వచ్చే ఏడాది జనవరి లో కాని జరగడం ఖాయమని తెలుస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు మానసికంగా ఎన్నికలకు సిద్ధం అయిపోయాయి. చంద్రబాబు శనివారం కృష్ణ, గుంటూరు జిల్లాల అంగన్వాడీ టీచర్ లను విజయవాడ కు పిలిపించి, ఓ స్టార్ హోటల్ లో మీటింగ్ పెట్టి, హైక్లాస్ భోజనాలు పెట్టి, మీరు అడగకుండానే మీకు జీతాలు పెంచాను... మీరంతా నాకు అనుకూలంగా ప్రచారం చేయండి అని ఆదేశించారు. ఇక ప్రతిపక్ష పార్టీ వై.ఎస్.ఆర్.సి.పీ పాదయాత్ర ద్వారా ఏడాది ముందుగానే ఎన్నికల సమర శంఖం పూరించింది. ఓ పక్క పాదయాత్ర చేస్తూనే జగన్ పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ ఈ సారి బి.సి ల వైపు దృష్టి సారించింది. వై.ఎస్.ఆర్.సి.పీ కి మొదటి నుంచి ఎస్.సిలు, క్రిస్టియనులు, ముస్లిం  మైనార్టీలలో మంచి పట్టు ఉంది. ఇక ఆ పార్టీ సామాజిక వర్గం అయిన  రెడ్డి కులస్తుల సపోర్ట్ ఎలాగూ ఉంటుంది. అయితే జనాభా లో 50 శాతం ఉన్న బి.సి లు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కి బలమైన ఓటు బ్యాంక్ గా ఉన్నారు.  టి.డి.పీ గెలుపు లో వీరే క్రియాశీలక పాత్ర వహిస్తూ వస్తున్నారు. లేదంటే కేవలం 3 శాతం ఉన్న కమ్మ సామాజికవర్గం పెత్తనం సాగేది కాదు. ఈ వాస్తవాన్ని గ్రహించిన జగన్ ఈ సారి బి.సి ల వైపు దృష్టి సారించారు. గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎం.ఎల్.ఏ జంగా కృష్ణమూర్తి కి బి.సి రాష్ర్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. బి.సి ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా  బి.సి లలో ఉన్న వివిధ వృత్తిదారులతో వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. బి.సి ల్లో వందకు పైగా కులాలు ఉన్నాయి. అయితే వీరిలో ప్రధానంగా అయిదారు కులాలే సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించారు. ఈ అయిదారు కులాలు ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంక్ గా ఉన్నారు. అయితే బి.సి. లు అంటే ఆ అయిదారు కులాలే కాదు.. మరో వంద కులాలు ఉన్నాయి. వీరంతా ఇప్పటికి అన్ని విధాలా వెనుకబడి ఉన్నారు. కుల వృత్తులు చేసుకుంటూ, దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారు. వీరిలో మెజార్టీ ప్రజలను ఆకర్షించడంతో పాటు, ఆ అయిదారు కులాల్లో కూడా కనీసం 30 శాతాన్ని తన వైపు తిప్పుకోగలిగితే వై.ఎస్.ఆర్.సి.పీ విజయం ఖాయం. ఈ దిశగానే ఆ పార్టీ అడుగులు వేస్తోంది. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బి.సి ల వైపు వై.ఎస్.ఆర్.సి.పీ చూపు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top