Translate

  • Latest News

    26, జూన్ 2018, మంగళవారం

    శిఖండి కాంగ్రెస్ తో జగన్ పై చంద్రబాబు దొంగ దెబ్బ..?


    ముసుగులు తొలగిపోతున్నాయి... అసలు రూపాలు బయటకు వస్తున్నాయి. నాలుగేళ్ల పాటు రకరకాల ముసుగులు వేసుకుని రాజకీయ రంగస్థలంపై ఎన్నో రకాల  వేషాలు వేసిన రాజకీయ నాయకులు తమ తమ ముసుగులు తొలగించి, అసలు రూపాలను నగ్నంగా ప్రదర్శిస్తున్నారు. ఇప్పటిదాకా అధికార పక్షము పై ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలసి పోరాడిన పార్టీలు కొన్ని అధికార పక్షంతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నారు. వారి స్వరాలూ మారిపోతున్నాయి. నిరసనలు మాని సరసాలు ఆడుతున్నారు. మరి కొన్ని ప్రతిపక్షాలు అధికార పక్షం;వై ఇప్పటిదాకా అన్ని ప్రతిపక్షాలతో కలసి సమైక్య పోరాటాలు చేసి కూడా,,, ఇప్పుడు స్వరం మార్చి అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం రెండింటికి మేము సమాన దూరం పాటిస్తాం అని నొక్కి వక్కాణిస్తున్నాయి.
     కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కన్నా జగనే మాకు ప్రధాన శత్రువు అని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ మనసులో మాటను నగ్నంగా బయట పెట్టేసాడు. అంతేకాదు... వై.ఎస్.ఆర్.సి.పీ, బి.జె.పీ లోకి వెళ్లిన కాంగ్రెస్ నాయకులను వెనక్కి రప్పించడానికి ఒక ప్రత్యక వ్యూహాన్ని రూపొందించాడు. తప్పు లేదు... ఆయన పార్టీ వాళ్ళను ఆయన వెనక్కు తెచ్చుకోవడంలో తప్పు లేదు. కానీ కాంగ్రెస్ మాటలు, చర్యలన్నీ పరోక్షంగా చంద్రబాబుకు దోహదపడేవే... వై.ఎస్.ఆర్.సి.పీ ని బలహీనపరిచే ప్రతి చర్య... పరోక్షంగా చంద్రబాబు కు మేలు చేసేదే కానీ... రాష్ర్టంలో కాంగ్రెస్ ను ఎకాఎకిన అధికారం లోకి తెచ్చేదో... కనీసం ప్రధాన ప్రతిపక్షంగా నిలబెట్టేదో కాదు. ఈ వాస్తవాన్ని గాలికి వదిలేసి జగన్ ను ప్రధాన శత్రువు గా ప్రకటించి చంద్రబాబు కు మేలు చేసేందుకే ఈ కమ్మని కుట్ర వెనుక ఉన్న రహస్యం. అంతేకాదు.  రాయలసీమ లో తెలుగుదేశం పప్పులు ఉడకవు కాబట్టి అక్కడ కాంగ్రెస్ ను శిఖండి లా అడ్డం పెట్టి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడానికి చంద్రబాబు రాహుల్ గాంధీ ద్వారా మరో పెద్ద ప్రణాళిక వేసాడు. అదేమిటంటే నంద్యాల నుంచి రాహుల్ గాంధీ ని ఎం.పీ గా పోటీ చేయించడం. అక్కడ తెలుగుదేశం పోటీ పెట్టినా ఎవరో ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టి పరోక్షంగా కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తుంది. రాహుల్ ను సీమలో నిలబెట్టడం ద్వారా సీమలో వై.ఎస్.ఆర్.సి.పీ లో ఉన్న పాత కాంగ్రెస్ వాదులను అందరిని మళ్ళీ ఆకర్షించి, వై.ఎస్.ఆర్.సి.పీ ని బలహీన పరచాలనేది ఆ కుట్ర. కోస్తాలో ఉండవల్లిని మళ్ళీ ప్రధాన స్రవంతి లోకి తీసుకువచ్చే బాధ్యత కె.వి.పీ కి అప్పగించారు. వై.ఎస్.ఆర్. సి.పీ బలంగా ఉన్నచోట కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టి , అవసరమైతే వారికి ఆర్ధిక సహాయం కూడా చేయడానికి చంద్రబాబు, రాహుల్ గాంధీ ల మధ్య అవగాహన కుదిరింది.  రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్, టి.డి.పీ ల మధ్య ఈ రకమైన ఒక స్పష్టమైన అవగాహన అంతర్గతంగా నడుస్తుంది. కురుక్షేత్రంలో శిఖండిని అడ్డుపెట్టి భీష్ముడిని పడగొట్టినట్టు... చంద్రబాబు ఇక్కడ కాంగ్రెస్ ను శిఖండి లా వాడుకోబోతున్నారు. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: శిఖండి కాంగ్రెస్ తో జగన్ పై చంద్రబాబు దొంగ దెబ్బ..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top