Translate

  • Latest News

    4, జూన్ 2018, సోమవారం

    నంద్యాల ఫార్ములా ధైర్యం తోనే చంద్రబాబు సవాల్


    ప్రస్తుతం చంద్రబాబుకు రాష్ర్టంలో ఎదురుగాలి బలంగా వీస్తోంది. ఏడాది కిందట ఇదే పరిస్థితిలో ఉన్నప్పుడు నంద్యాల గెలుపు ఆయనకు ఆక్సిజన్ లా ప్రాణం పోసింది. అయితే ఆ ఆక్సిజన్ ఎంతో కాలం పనిచేయలేదు. ఆ సిలిండర్ అయిపోగానే మళ్ళీ సంకట స్థితి ఏర్పడింది. అదే తరుణంలో జగన్ పాదయాత్ర మొదలెట్టడం, పవన్ ఎదురు తిరగడం, బి.జె.పీ తో బెడిసికొట్టడం ఇవన్నీ ఒక దాని వెంట ఒకటి చుట్టుముట్టడంతో చంద్రబాబు మైనస్ లో పడ్డారు. ఈ దశలో మళ్ళీ నెగటివ్ లొంచి పాజిటివ్ వేవ్స్ లోకి రావాలంటే తెలుగుదేశం పార్టీకి మళ్ళీ నంద్యాల లాంటి ఓ గెలుపు అవసరం. ఉప ఎన్నికలు వస్తే... అధికార యంత్రాగం ను ఉపయోగించి, సామ, దాన, భేద, దండోపాయాల్ని ఉపయోగించి గెలుపు సాధించడంలో చంద్రబాబు ను మించిన వాడు ఈ భూ ప్రపంచంలో ఇంకెవడూ లేడు... అందుకే ఇప్పుడు చంద్రబాబు... ఆ ధైర్యం  తోనే ప్రతిపక్షానికి సవాల్ విసిరాడు.
     ఏడాది లోపే సాధారణ ఎన్నికలు రానున్న తరుణంలో ఉప ఎన్నికలు వస్తే... ఆ అయిదు స్థానాలు గెలవడం ద్వారా ప్రజలు నా వైపే ఉన్నారని చెప్పుకోవడానికి,,, తెలుగుదేశం పార్టీకి పాజిటివ్ వేవ్స్ ఉన్నాయని చెప్పుకోవడానికి అవకాశం దొరుకుతుంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న చంద్రబాబు.... ఈ ఆలోచనతోనే 40 ఏళ్ల వయసున్న జగన్ కు సవాల్ విసిరాడు. అదన్న మాట...అసలు సంగతి. లోక్ సభ స్పీకర్ జూన్ 5 న చెప్పే డెసిషన్ కోసం చంద్రబాబు అందుకే ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. ఉప ఎన్నికల్లో గెలిచి చూపించి మరోసారి తన సత్తా చూపించాలని ఆరాటపడుతున్నాడు. నంద్యాల ఫార్ములాను మరోసారి విజయవంతంగా ప్రయోగించాలని ఉబలాటపడుతున్నాడు. ఉప ఎన్నికలు వస్తే రాష్ట్ర రాజకీయాల్లో ఇక ఎన్నికల వాతావరణం వచ్చేసినట్టే... ఆ వేడి వచ్చే సాధారణ ఎన్నికల వరకు కొనసాగుతుంది. ఇక సందడే...సందడి. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నంద్యాల ఫార్ములా ధైర్యం తోనే చంద్రబాబు సవాల్ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top