Translate

  • Latest News

    5, జూన్ 2018, మంగళవారం

    మందు తాగని వాళ్ళంతా మంచోళ్లేనా..?


    మందు తాగని  వాళ్ళంతా మంచోళ్ళు...మందు తాగే వాళ్ళంతా చెడ్డోళ్ళా... మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సోమవారం విజయనగరం జిల్లా శృంగవరపు కోట లో నవనిర్మాణ దీక్ష సభలో మాట్లాడుతూ.... నేనెప్పుడూ అమ్మాయిలతో తిరగలేదు...  మందు కొట్టలేదు... సిగరెట్ కాల్చలేదు.... నా చేతికి వాచీ, ఉంగరం లేదు... నా జేబులో డబ్బులు లేవు... అంటూ తనను తాను పొగుడుకుంటూ..    పరోక్షముగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై  వ్యంగ్యాస్త్రాలు సంధించారు... అంటే మందు తాగని  వాళ్ళంతా మంచోళ్ళు...మందు తాగే వాళ్ళంతా చెడ్డోళ్ళా...
    రోజులు మారాయి... మనుషుల వేష భాషలు, ఆలోచనా సరళులు మారాయి. వెనకటి రోజుల్లో సినిమాల్లో విలన్లు అంటే గళ్ళ లుంగి., ముఖంపై గాటు, బుగ్గన నల్ల చుక్క, చేతిలో సారా చుక్క, పక్కలో చక్కని చుక్క... ఇలా దర్శనమిచ్చేవారు... ఇప్పుడు సినిమాల్లో విలన్లు అంతా వైట్ కాలర్ నేరస్థులే... వారు మన లాగానే ఉంటారు... మన పక్కింటి అంకుల్ లానే ఉంటారు. చూడ్డానికి హీరోల్లా ఉంటారు... చేసే పనులన్నీ దారుణాతి దారుణం... కావాలంటే ఒక్కసారి ఇటీవల వచ్చిన ఓ పది సినిమాలల్లో విలన్ పాత్రలు చూడండి మీకే తెలుస్తుంది... 20 ఏళ్ల కిందట హీరోలుగా వెలుగొందిన అరవింద్ స్వామీ, అర్జున్ లు ఇప్పుడు వైట్ ఫాంట్, వైట్ షర్ట్ వేసుకుని, ఫుల్ వైట్ కౌట్ లో ఎంచక్కా ఎలా వైట్ కాలర్ నేరాలు చేస్తున్నారో చూడండి...మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో హీరో లాగా వెలిగిపోయారు... సెకండ్ ఇన్నింగ్స్ లోనే అన్నీ విలన్ పనులు చేస్తున్నారు... అవి కప్పిపుచ్చుకోవడానికి ఎంత సేపు తన గొప్పలు తానూ చెప్పుకుంటున్నారు... 
    సార్.... చంద్రబాబు గారు... మరి మీ మాట ప్రకారమే వస్తే... మీ సుపుత్రుడు లోకేష్ బాబు మందు కొడుతూ...అమ్మాయిలతో బీచ్ లో సందడి చేసిన ఫోటోలు ప్రపంచమంతా చెక్కర్లు కొట్టాయి.. మరి దానికేమంటారు బాబు గారు... మీ థియరీ ప్రకారం మీ అబ్బాయి చెడ్డోడని ఒప్పుకుంటారా... తెల్లగా ఉన్నవన్నీ పాలు కాదు... అని సామెత ఉంది... అలాగే మందు తాగే వాళ్ళంతా చెడ్డోళ్లు కాదు... తాగని  వాళ్ళంతా మంచోళ్ళు కాదు... మీ చేతికి వాచీ, ఉంగరం లేకపోతే, మీ జేబులో డబ్బులు లేకపోతే మీరు పేదోళ్ళని అందర్నీ నమ్మ మంటారా... అయ్యా... చంద్రబాబు గారు.... మా చెవిలో పువ్వులు పెట్టుకుంటాం... చెప్పండి... ఇంకెన్ని నీతులు చెబుతారో మీ ఇష్టం... అందుకే మీ మీద ఈనాడో ఓ సుప్రసిద్ధమైన జోక్ మన వాళ్లు రూపొందించారు. చెప్పేవాడు చంద్రబాబు అయితే... వినేవాడు ఓటరు అని... 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మందు తాగని వాళ్ళంతా మంచోళ్లేనా..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top