Translate

  • Latest News

    6, జూన్ 2018, బుధవారం

    కొత్త పాట పాడుతున్న చంద్రబాబు


    40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న చంద్రబాబు ఇప్పుడు కొత్త రాగం ఆలపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం లోకి రాడని బల్ల గుద్ది మరి చెబుతున్నారు. ఈ సారి నేను చెప్పిన వారే ప్రధాన మంత్రి అవుతారని, కేంద్రంలో మళ్ళీ నేను చక్రం తిప్పుతానని డంబాలు పలుకుతున్నారు. 2014 ఎన్నికల ముందు కూడా ప్రజలు ఈ మాటలు వినే బోల్తా పడ్డారు. ఇక్కడ చంద్రబాబు, అక్కడ మోడీ వస్తే మన పనులు బాగా జరుగుతాయని, నిధులు బాగా వస్తాయని, మన బాబు గారు ఎంతంటే మోడీ అంత అని పాపం జనం నమ్మారు. తాడి దన్నే వాడి తల దన్నే వాడుంటాడన్నట్టు ఎన్నికలయ్యాక మోడీ పాపం మన బాబును అస్సలు పట్టించుకోనేలేదు. మరి హీనంగా వెంట్రుక ముక్క కింద తీసి పారేసాడు. ఢిల్లీ వెళితే  కనీసం అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. చక్రం తిప్పుదామనుకున్న చంద్రబాబు చక్రానికి పదును పెట్టుకుంటూ నాలుగేళ్లు గడిపేశాడు. ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో మోడీ గెలవడని, ప్రాంతీయ పార్టీలదే హవా అని, మళ్ళీ నేనే చక్రం తిప్పుతానని, నేను చెప్పిన వారే ప్రధాన మంత్రి అవుతారని అంటున్నాడు. మళ్ళీ ఈయన గారి మాటలు నమ్మి మోసపోతే మళ్లీ  ఇంకో ఐదేళ్లు ఆంధ్రా జనం అష్ట కస్టాలు పడాలసిందే. ఎందుకంటే మన బాబు గారు ఇదివరకులా చక్రం తిప్పే పరిస్థితులు లేవు. 20 ఏళ్ళ కిందట పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు దేశంలో ఇన్ని ప్రాంతీయ పార్టీలు బలంగా లేవు. ఇప్పుడు ఎక్కడి కక్కడే ప్రాంతీయ పార్టీలు బలంగా వేళ్లూనుకుని పోయాయి. ఎవరికి వారే కింగ్ లు... ఎవరికి వారే మోనార్క్ లు. దక్షిణాది నుంచి వచ్చిన బాబు గారు నిల్చోమంటే నిల్చుని, కూర్చోమంటే కూర్చునే స్థితిలో ఎవరు లేరు. మాయావతి మాయావతే .. మమతా బెనర్జీ మమతా బెనర్జీయే.. కె.సి.ఆర్ ఏమి తక్కువ తినలేదు. వీళ్ళందరూ మన బాబు గారి పెద్దరికాన్ని గౌరవించి ఈయనకు పెత్తనం ఇస్తారని గ్యారంటీ ఏమి లేదు. అసలు ప్రతి సభ లోను ఈయనకు ఈయన నాది 40 ఏళ్ళ రాజకియ అనుభవం అని చెప్పుకుంటున్నాడు కానీ. అది ఈయన చెప్పుకోకూడదు... ఎదుటి వాళ్ళు గుర్తించి చెప్పాలి. అలా ఈయ‌న్ని గుర్తించి పెత్త‌నం అప్ప‌గించే ప‌రిస్థితి అయితే ఇప్పుడు క‌న‌బ‌డ‌టం లేదు. ఇంకా ఈయ‌న నేను చక్రం తిప్పుతానూ అంటే న‌మ్మేంత వెర్రివాళ్లు కాదు ప్ర‌జ‌లు. బాబుగారు మాత్రం పాడిందే పాడ‌రా... పాచిప‌ళ్ల దాస‌రి అన్న‌ట్లు మ‌ళ్లీ అదే పాత పాట‌ను కొత్త రాగంలో పాడుతున్నారు. 





    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కొత్త పాట పాడుతున్న చంద్రబాబు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top