Translate

  • Latest News

    28, జూన్ 2018, గురువారం

    రాహుల్ గాంధీ నిజంగా మొద్దబ్బాయే...


    రాహుల్ గాంధీ ఈ మధ్య కాస్త రాటు దేలాడు అని అనుకున్నాం కానీ... అయన నేను నిజంగా మొద్దబ్బాయినే అని తన వ్యాఖ్యలు, చేష్టలు ద్వారా మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటున్నాడు. గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ, మోడీ కి గట్టి పోటీ ఇచ్చాడు. అలాగే కర్ణాటకలో బి.జె.పీ కంటే తక్కువ సీట్లు వచ్చినా జె.డి.ఎస్ కు ముఖ్యమంత్రి పదవి ఎర వేసి  బి.జె.పీ కి అధికారం అందకుండా చేసాడు. ఆహా ఏమి రాజనీతిజ్ఞత అనుకుని మురిసిపోయాం.. కానీ అంతా బాగానే ఉంది. ఆంధ్ర ప్రదేశ్ విషయం లోనే చంద్రబాబు మాయలో పడి రూట్ మార్చాడు.  ఇక్కడ అధికార పక్షముతో జత కట్టి. ప్రధాన ప్రతిపక్షమైన వై.ఎస్.ఆర్.సి.పీ యే  మా ప్రధాన శత్రువు అని ప్రకటించాడు. కాంగ్రెస్ వ్యతిరేకత తో పుట్టిన తెలుగు దేశం తో కుమ్మక్కై రాష్ట్రంలో వై.ఎస్.ఆర్.సి.పీ ని ఓడించడానికి వై.ఎస్.ఆర్.సి.పీ బలంగా ఉన్న చోట(చంద్రబాబు చెప్పిన చోటల్లా) కాంగ్రెస్ తరఫున బలమైన సీనియర్ నాయకులను నిలబెట్టి, సాధ్యమైనంతవరకు వై.ఎస్.ఆర్.సి.పీ ఓట్లను చీల్చాలనేది ఆ ప్లాన్. రాష్ట్రంలో తన పరిపాలన పై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో, తన సొంత బలంతో గెలవలెనని గ్రహించిన చంద్రబాబు, తన చాణక్య నీతిని అమలు చేస్తున్నాడు. ఇందులో భాగం గానే రాహుల్ గాంధీ తో...  వై.ఎస్.ఆర్.సి.పీ గెలిస్తే... ఇక్కడ కాంగ్రెస్ సమాధి అయిపోతుందని రాహుల్ ను  రెచ్చగొట్టి రాహుల్ తో వై.ఎస్.ఆర్.సి.పీ యే మా ప్రధాన శత్రువు అని ప్రకటింపచేసాడు. ఇందులో భాగంగానే మాజీ సి.ఎం, కిరణ్ కుమార్ రెడ్డి ని మళ్ళీ కాంగ్రెస్ క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకువచ్చి రాయలసీమలో వై.ఎస్.ఆర్.సి.పీ ఓట్లను చీల్చడానికి ప్లాన్ వేశారు. అంతే కాదు... పీ.సి.సి కి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని అధ్యక్షుడిగా పెట్టించి చంద్రబాబు రాష్ట్రంలో కాంగ్రెస్ ను తన సామంత పార్టీగా మార్చేసుకునే ప్లాన్ కూడా వేస్తున్నారు. చంద్రబాబు మాయలో పడి రాహుల్ తాను మొద్దబ్బాయిని అని నిరూపించుకున్నాడు. కాంగ్రెస్ నుంచి వెళ్లి పార్టీలు పెట్టిన శరద్ పవార్, మమతా లాంటి వాళ్ళతో కలసి పని చేస్తున్నపుడు వారితో లేని అభ్యంతరం జగన్ విషయంలోనే ఎందుకు..  బెంగాల్ లో కాంగ్రెస్ కు అడ్రస్ లేకుండా చేసిన మమతా తో కలసి పని చేస్తున్నప్పుడు జగన్ తో ఎందుకు కలవరు.. ఈ మాత్రం ఆలోచించకుండా చంద్రబాబు మాయలో పడి .. అయన చెప్పినట్టు చేస్తున్న రాహుల్ నిజంగా మొద్దబ్బాయే... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రాహుల్ గాంధీ నిజంగా మొద్దబ్బాయే... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top