Translate

  • Latest News

    29, జూన్ 2018, శుక్రవారం

    పైకి పోటీలు...లోలోన కుమ్మక్కులు...


    ఏ.పీ లో బహుముఖ పోటీ తప్పేటట్టు లేదు. ఎన్నికల్లో ఎవరికీ వారే...యమునా తీరే... అన్నట్టుగా పోటీకి సై అంటున్నారు. అయితే పైకి బహుముఖ పోటీ జరుగుతున్నా...అంతర్లీనంగా కుమ్మక్కు కుట్రలు జోరుగా సాగుతున్నాయి.  వై.ఎస్.ఆర్.సి.పీ, తెలుగుదేశం, కాంగ్రెస్, బీ.జె.పీ, జనసేన పార్టీలు అన్నీ ఎవరికీ వారు తాము అన్ని సీట్లకు పోటీ చేస్తామని చెబుతున్నాయి. ఇక  కమ్యూనిస్టులు మొన్నటి దాకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోక పట్టుకుని తిరిగారు. ఇప్పుడు ఆయనేమో... నేను 175 సీట్లకు పోటీ చేస్తానంటున్నాడు. మరి కమ్యూనిస్టులు విడిగా పోటీ చేస్తారా... లేదా లోక్ సత్తా లాంటి మరో చిన్నా, చితకా పార్టీతో జత కడతాయా అనేది వేచిచూడాలి. బి.జె.పీ ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉంది. వీలైతే అక్టోబర్ లోనే పెట్టాలనుకుంటోంది. అయితే అందుకు అన్ని రాష్ట్రాలు అంగీకరించాలి. ఒకవేళ రాష్ట్రాలు అంగీకరించకపోయినా సాధారణ ఎన్నికలకు 6 నెలల ముందు జరిపే హక్కు ఉంటుంది కాబట్టి. అక్టోబర్లో కాకపోయినా జనవరిలో ఎన్నికలు ఖాయం. బి.జె.పీ ఇందుకు అల్ రెడీ సమాయత్తమైపోయింది. అందులో భాగంగా విశిష్ట సంపర్క్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి జిల్లా లోనూ ఏ పార్టీ కి చెందని తటస్థులను, మేధావులను, వ్యాపారులను బి.జె.పీ అగ్ర నాయకులు కలుస్తున్నారు. వారికి కేంద్ర ప్రభుత్వం రాష్ర్టం కోసం చేసిన మేళ్లు, పధకాలు, ఇచ్చిన నిధుల గురించి  వివరిస్తున్నారు. ఇక తెలుగుదేశం సాధికార మిత్ర వ్యవస్థను ప్రవేశపెట్టింది. ప్రతి 35 కుటుంబాలకు ఒక సాధికార మిత్రాను పెట్టారు. వీరు ప్రభుత్వ జీతాలతో పార్టీ పని చేస్తారు. తమకు కేటాయించిన 35 కుటుంబాలపై డేగ కన్ను వేసి ఉంచుతారు. వారిలో జగన్ కు అనుకూలముగా ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ పధకాలు కేటాయించి, రుణాలు ఇచ్చి, ప్రలోభ పెడతారు. నంద్యాల ఎన్నికల్లో అదే చేసారు. ఇప్పుడు నంద్యాల ఫార్ములా రాష్ర్టం అంతటా అమలు చేయడానికే సాధికార మిత్ర వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇక వై.ఎస్.ఆర్.సి.పీ బూత్ లెవెల్ కోఆర్డినేటర్లుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ గతంలో తమ పార్టీ నుంచి వెళ్లిపోయిన ప్రముఖ నాయకులు అందరిని మళ్ళీ వెనక్కు రప్పించే పనిలో పడ్డారు. అయితే కాంగ్రెస్, తెలుగుదేశం మధ్య గత ఎన్నికల్లో లాగానే, ఈసారి కూడా రహస్యం ఒప్పందం కొనసాగుతుంది. అది ప్రధానంగా వై.ఎస్.ఆర్.సి.పీ అభ్యర్థులను దెబ్బతీసే లక్ష్యంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. జనసేన మాత్రం ఇంకా ఒక స్పష్టమైన యంత్రాగం ఏర్పాటుచేసుకోలేదు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమతుల్యత కోసం పోటీ చేస్తాం అని చెప్పారు. సమతుల్యత అంటే ఏమిటో వివరించలేదు. జనసేన పోటీ ఎవరికి లాభం అనేది వెయ్యి డాలర్ల  ప్రశ్న.  ఏదేమైనా అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లో పడిపోయాయన్నది వాస్తవం.  

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పైకి పోటీలు...లోలోన కుమ్మక్కులు... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top