Translate

  • Latest News

    30, జూన్ 2018, శనివారం

    నిస్సిగ్గు రాతలు... నిలువెల్లా అబద్ధాలు...


    అంబేడ్కర్ బాటలో చంద్రబాబు అనే శీర్షికతో ఈ రోజు ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజీలో దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బంగి సుదర్శన్ పేరుతొ ఒక వ్యాసం వచ్చింది. చంద్రబాబును దాదాపుగా అభినవ అంబేడ్కర్ గా ఆకాశానికి ఎత్తేసారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఎంగిలి ఇస్తరాకులకు ఆశపడే కొందరు కక్కుర్తి జర్నలిస్టులతో తనకు అనుకూలంగా వ్యాసాలు రాయించుకోవడం మొదలెట్టారు. ఇందులో భాగంగానే  దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బంగి సుదర్శన్ ముసుగులో  ఒక సీనియర్ జర్నలిస్ట్ రాసిన నిస్సిగ్గు రాతలు ఇవి. తెలుగుదేశం పార్టీని కాపాడుకోవలసిన అవసరం ప్రతి దళితుడి మీద ఉందట... దళిత వ్యతిరేక శక్తి అయిన బి.జె.పీ, దానితో అంటకాగుతున్న పార్టీలకు  ఓటేస్తే మన వేలితో మన కంటిని మనమే పొడుచుకున్న వాళ్ళం అవుతామని ఆయన గారు సూత్రీకరించేశారు. బి.జె.పీ పాలనలో దేశమంతా దళితులపై దాడులు జరుగుతుంటే... చంద్రబాబు గారి పాలనలో దళితులు సురక్షితంగా ఉన్నారట... ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో దళితులపై ఒక్క దాడి, దౌర్జన్యం కూడా జరగలేదట... ఇదంతా దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బంగి సుదర్శన్ అభిప్రాయం అని, తమకు  సంబంధం లేదని ఆంధ్రజ్యోతి తప్పుకోవచ్చు. కానీ ఇదంతా పెద్ద కుట్ర.. 
    పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు లో దళితుల సాంఘిక బహిష్కరణ సంగతేమిటి... ప్రకాశం జిల్లా దేవరపల్లిలో 20 దళిత కుటుంబాలకు చెందిన భూమిని తెలుగుదేశం నాయకులు ఆక్రమించుకున్న విషయం నిజం కాదా... గుంటూరు జిల్లా ప్రత్తిపాడు లో నూతన సంవత్సరం వేడుకల్లో జరిగిన చిన్న ఘటన సాకుగా తీసుకుని దళితులపై అగ్రవర్ణాలు దాడులు చేయలేదా... రాష్ట్రంలో అడుగడుగునా దళిత వర్గాలకు చెందిన బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు... ఈ ఘటనలు అన్నిటిలో తెలుగుదేశం ప్రభుత్వం దళితులకు ఎంతవరకు న్యాయం చేసింది.... ఈ వాస్తవాలన్నిటిని ఎక్కడా  కనీసం ప్రస్తావించకుండా.... చంద్రబాబు విసిరే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి రాసే ఇలాంటి చెత్త రాతలను నమ్మే స్థితిలో రాష్ర్టంలో ఏ దళితుడు లేరు. పత్రికల రాతలను నమ్మడం ఎప్పుడో మానేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్యవంతులవుతున్నారు. చంద్రబాబు & కో ... ఇక మీ ఆటలు సాగవు... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నిస్సిగ్గు రాతలు... నిలువెల్లా అబద్ధాలు... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top