Translate

  • Latest News

    1, జులై 2018, ఆదివారం

    బయోపిక్ లకు మంచి రోజులు


    ప్రస్తుతం వెండి తెరపై బయోపిక్ లకు రోజులు బాగున్నాయి. నిన్న గాక మొన్న తెలుగులో సావిత్రి పై వచ్చిన మహానటి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు హిందీలో సంజయ్ దత్ పై వచ్చిన సంజు కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. హిందీలో ఇంతకుముందే దంగల్, భాగ్ మిల్కా భాగ్, డర్టీ పిక్చర్, మేరీ కామ్, ఎం.ఎస్.ధోని, సచిన్ ఎ  బిలియన్ డ్రీమ్స్ వంటి బయోపిక్స్ సూపర్ హిట్ అయ్యాయి. తెలుగులో 1985 లో డ్యాన్సర్ సుధ పై తీసిన మయూరి, 1991 లో రన్నర్ అశ్వని నాచప్ప పై తీసిన అశ్వని హిట్ అయ్యాయి. వీటన్నికంటే ఇంకా ముందు అల్లూరి సీతారామ రాజు, ప్రకాశం పంతులు పై తీసిన ఆంధ్రకేసరి కూడా హిట్ అయ్యాయి. బయోపిక్ లు తీయడం కట్టి మీద సామే అయినా...  సరైన దర్శకుడి చేతిలో పడితే బయోపిక్ లు కూడా సూపర్ హిట్ లు అవుతాయని మనకు ఇటీవల మహానటి నిరూపించింది. త్వరలో తెలుగులో స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పై మెగా స్టార్ చిరంజీవి సినిమా సైరా నరసింహా రెడ్డి రాబోతుంది. ఈ సినిమా దర్శకుడు సురేంద్రరెడ్డి. రేసుగుర్రం లాంటి సూపర్ హిట్  తీసిన సురేంద్ర రెడ్డి ఈ బయోపిక్ కు ఎంతవరకు న్యాయం చేస్తాడో చూడాలి. ఈ సినిమా 2019 సంక్రాంతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నట రత్న, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పై ఆయన తనయుడు బాలకృష్ణ తో దర్శకుడు క్రిష్ తీస్తున్న ఎన్.టీ.ఆర్ బయోపిక్ కూడా వచ్చే సంక్రాంతి కి వస్తుందంటున్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి తో ఆల్ రెడీ తన ప్రతిభను నిరూపించుకున్న క్రిష్ ఈ బయోపిక్ ను కూడా విజయవంతంగా తీయగలదని అందరూ ఆశిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం బయోపిక్ లకు మంచి రోజులు నడుస్తున్నాయి. అల్ ది బెస్ట్... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బయోపిక్ లకు మంచి రోజులు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top