Translate

  • Latest News

    2, జులై 2018, సోమవారం

    బి.జె.పే పాలనలోనే అత్యధికంగా నల్లధనం


    గత ఎన్నికల ప్రచారంలో ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ స్విస్ బ్యాంకు లో భారతీయులు దాచుకున్న నల్లధనం వెలికి తీసుకువచ్చి. దేశంలో పేదలు అందరి బ్యాంకు అకౌంట్లలో తలా 15 వేల రూపాయలు వేస్తానని చెప్పాడు. ఆ తర్వాత ప్రధానమంత్రి అయ్యాక పేదలు అందరితో జన్ ధన్ అకౌంట్లు తెరిపించాడు. దేశంలో పేదలంతా మోడీ నిజంగానే మనందరి అకౌంట్లలో తలా 15 వేలు వేస్తాడని ఆశపడ్డారు. ఆ తర్వాత గాని తెలియలేదు అయ్యగారి అసలు రూపం... ఆయన గారు మాటల మోడీ యే గాని చేతల మోడీ కాదని. ఆయన ఏదన్న చేసినా అంతా అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్లకు ఉపయోగపడే పనులే చేస్తాడు గాని, పేదలను ఉద్ధరించే పనులేమీ చేయడని.  మోడీ గారి పాలనలో స్విస్ బ్యాంకు లో భారతీయులు దాచిన నల్ల ధనం వెనక్కి తీసుకురాకపోగా గత ఏడాది  భారత్ కు చెందిన సంపన్న పెట్టుబడిదారుల నల్లధనం మరింత పెరిగింది. ప్రధాన మంత్రి మోడీ నల్లధనం సంగతి ఎత్తకుండా మిగిలిన కాకమ్మ కబుర్లు ఎన్నయినా చెబుతారు. స్విస్ నేషనల్ బ్యాంకు తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో 2017 లో వివిధ దేశాలు జమ చేసిన సొమ్ము ఆధారంగా చేసిన గణనలో భారత్ 73 వ స్థానంలో నిలిచింది. 2016 తో  పోల్చితే 2017 లో భారత్ నుంచి జమ అయిన సొమ్ము 50 శాతం కన్నా అధికంగా (7000 కోట్లు) ఉండడం గమనార్హం. 1996 నుంచి 2007 వరకు భారత్ మొదటి 50 స్థానాల్లో ఉంది. 2004 లో అయితే ఏకంగా 37 వ ర్యాంక్ లభించడం గమనార్హం. 1996 నుంచి 2004 వరకు దేశంలో హెచ్.డి.దేవెగౌడ (1996-97), ఐ.కె.గుజ్రాల్(1997-98), అటల్ బిహారీ వాజపేయి(1998-2004) కాంగ్రెసేతర ప్రధాన మంత్రులే  పరిపాలనలో ఉన్నారు. మరి వీరి హయాంలోనే ఇండియా నుంచి అత్యధికంగా నల్లధనం విదేశాలకు తరలివెళ్లడం గమనార్హం. 
    అదే సమయంలో (1996-2004) ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. చంద్రబాబు కూడా ఆ సమయంలో స్విస్ బ్యాంక్లో నల్లధనం దాచుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు స్విట్జర్లాండ్ లో హోటల్ వ్యాపారం కూడా చేసాడని ఆరోపణలు ఉన్నాయి. అందుకేనేమో బి.జె.పీ నేతలతో ఆయనది విడదీయలేని దోస్తీ.. ఇప్పుడు విడిపోయామని పైకి చెబుతున్నా...అంతర్లీనంగా ఆ దోస్తీ కొనసాగుతూనే ఉంది. దానికి అనేక ఉదాహరణాలు మనకు కనపడుతూనే ఉన్నాయి. కేంద్రంతో కటీఫ్ అన్నాక కూడా టి.టి.డి బోర్డులో మహారాష్ట్ర కు చెందిన ఒక మంత్రి గారి భార్యను మెంబర్ గా తీసుకోవాల్సిన అగత్యమేమిటో... నారా వారే చెప్పాలి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ పై సోషల్ మీడియా లో విమర్శలు వెల్లువెత్తాక, ప్రతిపక్ష నాయకుడు జగన్ విమర్శించాకే గత్యంతరం లేక రాజీనామా చేయించారు. ప్రతిదానికి కాంగ్రెస్ పాలనపై నిందలేసి పబ్బం గడుపుకొనే మోడీ  స్విస్ బ్యాంకు విడుదల చేసిన ఈ తాజా గణాంకాలకు   సమాధానం చెప్పాలి. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బి.జె.పే పాలనలోనే అత్యధికంగా నల్లధనం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top