Translate

  • Latest News

    3, జులై 2018, మంగళవారం

    మెక్సికో లో ఒబ్రాడర్ విజయం ట్రంప్ కు చెంపదెబ్బ


    మెక్సికోలో వామపక్ష అభ్యర్థి  లోపెజ్ ఒబ్రాడర్ బంపర్ మెజార్టీతో విజయం సాధించాడు. అయితే మనకేంటి... మెక్సికో గొడవ మనకెందుకు అని మీరు అనుకోవచ్చు. ప్రస్తుతం మనం  ప్రపంచీకరణ యుగంలో ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగినా దాని ప్రభావం మన మీద కూడా తప్పకుండా ఉండి  తీరుతుంది. ముఖ్యంగా అది అమెరికాకు రిలేటెడ్ అయినది అయితే 100% మన మీద దాని ప్రభావం ఉంటుంది. మెక్సికో అమెరికాకు సరిహద్దు లో ఉన్న లాటిన్ అమెరికా దేశం. దాని జనాభా మొత్తం 13 కోట్లు. మొత్తం 32 రాష్ట్రాలతో కూడుకున్న ఆ దేశంలో ఒక్క మెక్సికో లోనే దాదాపు కోటి మంది జనాభా ఉంటారు. ఆ దేశంలో ఆదివారం  జరిగిన ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి లోపెజ్ ఒబ్రాడర్ తన సమీప ప్రత్యర్థి కంటే రెట్టింపు ఓట్లు సంపాదించి తిరుగులేని మెజార్టీతో మెక్సికో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మెక్సికో మాజీ మేయర్ అయినా లోపెజ్ 53 శాతం ఓట్లు పొందారు. ఓట్ల లెక్కింపు పూర్తిగా అవకముందే, తుది ఫలితం ప్రకటించకముందే ఆయన ప్రత్యర్ధులు ఇద్దరూ తమ ఓటమిని అంగీకరించారు. ఈ ఎన్నికలు అత్యంత హింసాత్మకంగా జరిగాయి. 130 మందికి పైగా రాజకీయ పార్టీల అభ్యర్థులు, వివిధ పార్టీల కార్యకర్తలు చనిపోయారు. మెక్సికన్ ల విషయంలో ట్రంప్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన లోపెజ్ కు ప్రజలు పట్టం కట్టారు. విశేషమేమిటంటే... లోపెజ్ విజయం అధికారికంగా ఇంకా ప్రకటించకముందే ట్రంప్ ట్విట్టర్ ద్వారా లోపెజ్ ను అభినందించారు. 64 ఏళ్ల లోపెజ్ గతంలో రెండు సార్లు అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారు. 
    ట్రంప్ వైఖరే లోపెజ్ ను గెలిపించింది... కాబట్టి మెక్సికో లో  ఒబ్రాడర్   విజయం ట్రంప్ కు చెంపదెబ్బ అని చెప్పవచ్చు. 
    మెక్సికో అమెరికాకు సరిహద్దు దేశం ప్రపంచ పటంలో చూస్తే అమెరికా కు కింద తోకలా వేలాడుతున్నట్టుగా ఉంటుంది. వలసల విషయంలో ట్రంప్ ఇటీవల కఠిన వైఖరి అవలంబించాడు. అమెరికా, మెక్సికో సరిహద్దు వెంట గోడ కూడా నిర్మిస్తానని చెబుతున్నాడు. గత అక్టోబర్ నుంచి మే లోపు మెక్సికో నుంచి అమెరికా లోకి అనుమతులు లేకుండా ప్రవేశించిన 2000 కుటుంబాలని నిర్బంధించి తల్లిదండ్రులను, పిల్లలను వేరు చేసాడు. ఈ చర్యపై  ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. ఆఖరికి ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ కూడా పిల్లలను తల్లిదండ్రుల నుంచి విడదీయడం సరి కాదని భర్త చర్యను ఖండించడం గమనార్హం. ట్రంప్ అవలంబించిన ఈ వైఖరే మెక్సికో ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపించింది. లోపెజ్ ఒబ్రాడర్ ను బంపర్ మెజార్టీతో గెలిపించింది. ప్రస్తుతం అమెరికా భారతీయుల వీసాలపై రోజురోజుకు పెడుతున్న ఆంక్షల నేపథ్యంలో మనం మెక్సికో పరిణామాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇండియా లో కూడా మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అమెరికా విషయంలో మన రాజకీయ పార్టీల వైఖరులను మనం అధ్యయనం చేయాలి. ట్రంప్ కు గులాములను కాకుండా  మన వారికి మేలు  చేకూర్చే వారికే మనం ఓటు వేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మెక్సికో లో ఒబ్రాడర్ విజయం ట్రంప్ కు చెంపదెబ్బ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top