
జూలై నెల జూలియస్ సీజర్ పేరు మీద వచ్చింది అని అంటారు. ఈ నెలలో 4వ తేదికి చాలా ప్రాముఖ్యత ఉంది. 1776 లో ఇదే రోజు బ్రిటిష్ వలస పాలన నుంచి అమెరికా స్వాతంత్రం పొందిన రోజు. ప్రస్తుతం ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్న అమెరికా బ్రిటిష్ గుప్పెట్లో నుంచి బయటపడిన రోజు.
అదే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన మన తెలుగు బిడ్డ అల్లూరి సీతారామరాజు పుట్టిన రోజు. (1897)
ఆంధ్రప్రదేశ్ లో తెల్ల దొరలూ పోయి నల్ల దొరలూ వచ్చాక కోస్తాలో ప్రధానంగా కమ్మ సామాజికవర్గం బ్రిటిష్ వారిలాగా వ్యాపార మనస్తత్వం కలిగినవారు కావడంతో ప్రపంచమంతా విస్తరించారు. బాగా డబ్బు గడించారు. ఆ తర్వాత రాజ్యాధికారం వైపు వీరి దృష్టి మళ్లింది. 1983 లో తెలుగుదేశం పార్టీ వీరికి ఆయుధంగా మారింది. రాజకీయ పదవుల్లో చేరి మిగిలిన అన్ని కులాల్ని అణగదొక్కుతున్న రోజుల్లో విజయవాడ కేంద్రంగా మిగతా అల్ప సంఖ్యాక వర్గాలన్నిటిని కలుపుకుని, వారిపై తిరుగుబాటు చేసి వారి గుండెల్లో నిద్రపోయిన వంగవీటి మోహన రంగారావు పుట్టిన రోజు కూడా ఇదే. (1947)
సమాజంలో పేద, ధనిక తారతమ్యం పెరిగి అసమానతలు విపరీతంగా పెరిగిపోయి.. అంతటా అశాంతి అలుముకున్న పరిస్థితుల్లో కవులు ప్రజా విప్లవ పంధా అనుసరించాలని చెప్పి విప్లవ రచయితల సంఘం ఏర్పాటైన రోజు కూడా ఇదే.. (1970)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి