Translate

  • Latest News

    5, జులై 2018, గురువారం

    ముద్దుగుమ్మల పాలిట యముడు రాచపుండు


    వారు అందంలో అప్సరసలు... కోట్లాదిమందికి కలల రాణులు... తమ మేని విరుపులతో. ఒంపుసొంపులతో కుర్రకారుకు ఎన్నో నిద్ర లేని రాత్రులను చేసి.. మత్తెక్కించిన మదాలసలు... వయసు కాస్త నాలుగు పదుల్లోకి వచ్చేసరికి రాచపుండు బారిన పడి  చావు అంచుల్లోకి వెళ్లి వస్తున్నారు. పదేళ్ల కిందట మనీషా కొయిరాలా కి కాన్సర్ అన్న మాట విని కోట్లాది హృదయాలు తల్లడిల్లాయి. ఆ తరవాత గౌతమీ, మమతా మోహన్ దాస్ లు కూడా కాన్సర్ బారిన పడి ఎలాగోలా బతికి బయటపడ్డారు. వారి అభిమానులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మరో పిడుగు లాంటి వార్త . మురారి, ఇంద్ర, ఖడ్గం, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, మన్మధుడు లాంటి సినిమాలతో యువత గుండెల్లో చెరగని ముద్ర వేసిన సోనాలి బింద్రే కు కాన్సర్ అన్న వార్త కోట్లాదిమందిని షేక్ చేసింది. ఐదేళ్ల కిందట నిర్మాత గోల్డి బేహ్ల్ ను వివాహం చేసుకుని సినిమాలకు స్వస్తి చెప్పిన సోనాలి బింద్రే కు ఇటీవల తరచుగా పొత్తి  కడుపులో నొప్పి వస్తుండడంతో వైద్యులను సంప్రదించగా పరీక్షలు చేసి హై గ్రేడ్ కాన్సర్ గా గుర్తించారు. పైగా అది ఇప్పటికే సీవియర్ స్టేజి కి వెళ్లిపోయిందని, శరీరంలో ఇతర భాగాలకు కూడా వ్యాపించిందని చెప్పారు. దీంతో సోనాలి న్యూయార్క్ లో కాన్సర్ కు చికిత్స చేయించుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల అండతో కాన్సర్ పై పోరాడుతున్నారు. సో... అభిమానులూ... సోనాలి బింద్రే త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం...  
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ముద్దుగుమ్మల పాలిట యముడు రాచపుండు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top