Translate

  • Latest News

    22, జులై 2018, ఆదివారం

    వైశ్య ఉప కులానికి చెందిన మోడీ బి.సి ఎలా అయ్యాడు...


    గుజరాత్ లో సంపన్న వర్గానికి చెందిన వైశ్య కులంలో సబ్ కాస్ట్ అయిన మోద్-ఘంచి కులానికి చెందిన నరేంద్ర మోడీ తాను బి.సి. అని చెప్పుకోవడమే పెద్ద హాస్యాస్పదం. తాను  ముఖ్యమంత్రి అయ్యాక అధికారంతో  తన కులాన్ని దొడ్డి దారిలో ఓ.బి.సి జాబితా లోకి చేర్చుకున్న  మోడీ... 2014 లో ఆ బి.సి. సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకునే అధికారం లోకి వచ్చాడు. బ్రాహ్మణ వాద పార్టీగా ముద్రపడ్డ బి.జె.పీ తరపున ఒక నాన్ బ్రాహ్మిన్ అయిన  మోడీ ప్రధానమంత్రి అయ్యాడు. 2001 అక్టోబర్ 7 న గుజరాత్ ముఖ్యమంత్రి అయిన మోడీ ఆ తరువాత నాలుగు నెలలకే 2002 జనవరి 1 న తన కులాన్ని ఓ.బి.సి. జాబితాలో  చేర్చాడు. అయితే రికార్డుల్లో మాత్రం 1994 జులై 25 న గుజరాత్ సాంఘిక సంక్షేమ శాఖ మోద్-ఘంచి కులాన్ని ఓ.బి.సి లో చేర్చి జి.ఓ జారీ చేసినట్టుగా దొంగ రికార్డు పుట్టించాడు. తాను బి.సి అని, చాయ్ వాలా అని, చెప్పి గత ఎన్నికల్లో దేశ ప్రజలను నమ్మించి ప్రధానమంత్రి అయ్యాడు. వాస్తవాలు ఇలా ఉండగా మొన్న కూడా  పార్లమెంట్ లో నేను బి.సి ని అని కులాన్ని చెప్పుకోవడం, బి.సి ఎం.పీ లతో మనం మనం బి.సి. లం అని అనడం... చూస్తుంటే... మళ్ళీ రాబోయే ఎన్నికలలో బి.సి ఓట్లకు గాలం వేయడానికే... సో.. హిందువుల్లో ఉన్న బి.సి., ఎస్.సి, ఎస్.టి, మైనార్టీ మిత్రులారా... బీ. అలెర్ట్... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: వైశ్య ఉప కులానికి చెందిన మోడీ బి.సి ఎలా అయ్యాడు... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top