Translate

  • Latest News

    25, జులై 2018, బుధవారం

    సాగునీటి ప్రాజెక్టులు తాకట్టా...హవ్వ..హవ్వ...


    సాగునీటి ప్రాజెక్టులు తాకట్టా...హవ్వ..హవ్వ... ఇంతకంటే సిగ్గుచేటు వ్యవహారం ఇంకేమైనా ఉందా... వీళ్ళను ఇలాగే వదిలేస్తే... మొత్తం దేశాన్నే తాకట్టు పెట్టేస్తారు... ఇలాంటి పాలకులు మాకొద్దు బాబోయ్...అంటూ రాష్ట్రంలో రైతాంగం గగ్గోలు పెడుతోంది. కేవలం 10 వేల కోట్ల  ఋణం కోసం.... మన రాష్ట్రం లోని 10 సాగునీటి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం తాకట్టు పెట్టదానికి పూనుకోవడం  ఘోరాతిఘోరం. రాష్ట్రంలోని పోలవరం, వెలిగొండ, చింతలపూడి, హంద్రీ నీవా, వంశధార ఫేజ్-2. గాలేరు, నగరి, శ్రీశైలం రైట్ కెనాల్, పురుషోత్తమ పట్నం ప్రాజెక్టులను తాకట్టు పెట్టడానికి రాష్ట్ర కాబినెట్ ఆమోదిస్తూ, దీనిపై సర్వాధికారాలు ఇరిగేషన్ డెవలప్ మెంట్  కార్పొరేషన్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం ఆత్మహత్యాసదృశ్యమే. ఇప్పుడు తాగు నీటి వాడకానికి మీటర్లు పెడతామంటున్నారు... సాగునీటి ప్రాజెక్టులు తాకట్టు పెడితే భవిష్యత్తులో సాగునీటి వాడకానికి కూడా మీటర్ లు పెట్టి బిల్లులు చేతికి ఇస్తారు. అప్పుడు ఇక రాష్ట్రంలో రైతు అనే వాడే ఉండడు. సాగు చేయడానికి ఎవరూ ముందుకు రారు. ఇది అత్యంత క్రూరమైన చర్య అని, అత్యంత ప్రమాదకరం అని రైతులు, రైతు సంఘ నాయకులు మండిపడుతున్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే డబ్బులు కావాలని, ఉన్న ప్రాజెక్టులు తనఖా పెడతామనడం అవివేకం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  సాగునీటి ప్రాజెక్ట్ అనేది లాభదాయక వ్యాపారం కాదని, రైతు సంక్షేమానికి సంబంధించిన  ప్రాజెక్ట్ అని, బ్యాంక్ లు లాభదాయకం కాని వాటి మీద ఋణం ఎలా ఇస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఋణం ఇస్తే తప్పకుండా సాగునీటికి మీటర్లు పెట్టి ఆ ప్రాజెక్టులతో వ్యాపారం చేయడం ఖాయమని రైతు నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇదిలావుంటే కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో విత్తనాలు, ఎరువులపై రాయితీలు పూర్తిగా రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాయితీకి బదులు గ్యాస్ కు ఇస్తున్నట్టు నగదు బదిలీ ప్రవేశపెట్టాలనే యోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇవన్నీ కూడా దేశంలో వ్యవసాయాన్ని విధ్వంసం చేసి, రైతాంగాన్ని సర్వనాశనం చేసే తప్పుడు ఆలోచనలే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల  విధానాలు ఇలాగె కొనసాగితే దేశంలో రైతాంగ విప్లవం రాక తప్పదు. ఇప్పటికే అది మహారాష్ట్రలో మొదలైనది. ఆ చిచ్చు దేశమంతా రాజుకునే ప్రమాదం ఉంది. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వాలదే... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సాగునీటి ప్రాజెక్టులు తాకట్టా...హవ్వ..హవ్వ... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top