Translate

  • Latest News

    26, జులై 2018, గురువారం

    జనసేనకూ ఓ పత్రిక..?


    ప్రస్తుతం రాజకీయాల్లో నిలబడాలంటే... ప్రత్యక్షంగానో... పరోక్షంగానో ప్రతి రాజకీయ నాయకుడికి ఓ పత్రిక చేతిలో ఉండాల్సిన తప్పనిసరి అవసరం అయింది. మీడియాను మేనేజ్ చేయడంలో అగ్రగణ్యుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు కు నేరుగా తన సొంత పత్రిక అంటూ ఒక్కటి కూడా లేకపోయినా... అంతకంటే ఎక్కువగానే భజన చేసే పత్రికలూ, చానళ్లు చాలానే ఉన్నాయి. 1982 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్ని శాసిస్తున్న ఈనాడు తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి వెన్నుదన్నుగా నిలుస్తోంది. మామను వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఆ తర్వాత 1999 ఎన్నికల్లో బి.జె.పీ కార్గిల్ ఊపులో ఉండగా... ఆ పార్టీతో జత కట్టి... తన ముఖ్యమంత్రి పదవికి ప్రజామోదం ఉందనిపించుకున్నారు. అయితే ఈనాడు రామోజీతో పాటు  తన కంటూ ఒక సొంత పత్రిక లాంటిది మరొకటి ఉండాలన్న ఉద్దేశంతో   2002 లో ఆంధ్రజ్యోతి ని తన బినామీ అయిన వేమూరి రాధాకృష్ణ ద్వారా టేకోవర్ చేయించాడు... అప్పటి నుంచి తెలుగుదేశం భజన పత్రికలు రెండు అయ్యాయి. వీటి భజన పరాకాష్టకు చేరి 2004 లో చంద్రబాబు ఓడిపోయి, రాజశేఖర రెడ్డి సర్వజనామోదంతో ముఖ్యమంత్రి అయినా... వీరు ఆయనపై కారాలు... మిరియాలు.. నూరుతూ.. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తుండడంతో... వై.ఎస్. అసెంబ్లీ లోనే పలుమార్లు ఆ రెండు పత్రికలూ... అంటూ ప్రస్తావించిన సంగతి తెలిసిందే... ఈ నేపథ్యంలో సొంత పత్రిక అవసరాన్ని గుర్తించిన వై.ఎస్. చంద్రబాబు లాగా దొంగచాటుగా బినామీతో పత్రిక పెట్టించకుండా... బెంగళూర్ లో బిజినెస్ చేసుకుంటున్న తన కొడుకు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి తో సాక్షి పత్రిక పెట్టించాడు. సాక్షి పత్రిక అండతోనే 2009 లో ప్రతిపక్షాలన్నీ మహాకూటమి గా కలసి పోటీచేసినా, తాను  ఒంటరిగా పోటీచేసి విజయం సాధించి, రెండోసారి ముఖ్యమంత్రి  అయ్యాడు. అయితే దురదృష్టవశాత్తు ఆ  తర్వాత ఐదు నెలలకే వై.ఎస్ ప్రమాదంలో చనిపోవడం... ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ అందరకూ తెలిసినవే...
    ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన పార్టీ పెట్టిన హీరో పవన్ కళ్యాణ్ కూడా మీడియా అవసరాన్ని గుర్తించాడు. 2009 లో తన అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి, 18 మంది ఎం.ఎల్.ఏ లను గెలిపించుకున్నా పార్టీ ని నడిపించలేక కాంగ్రెస్ లో విలీనం చేయడానికి దారితీసిన పరిస్థితుల్లో మీడియా సహకారం లేకపోగా.... పూర్తిగా నెగటివ్ గా ప్రచారం చేయడం ఒక ప్రధాన కారణం. అందుకే ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ మళ్ళి అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఇప్పటికే రెండు చానళ్లు తీసుకున్నాడు. సి.పీ.ఐ వారి 99 ఛానల్ పూర్తిగా హాండోవర్ చేసుకోగా, సి.పీ.ఎం వారి 10 టి.వి లో 60 శాతం వాటా కొనుక్కున్నారు. చిరంజీవి, అల్లు అరవింద్, నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్  కలసి గతంలో మా టి.వి భాగస్వాములుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ కలసి  10 టి.వి లో వాటాలు కొన్నారు. రెండు చానళ్లు చేతికి వచ్చినా   ప్రింట్ మీడియా కూడా ఒకటి ఉండాలనే ఉద్దేశంతో జనసేన తరపున ఒక పత్రికను త్వరలో తీసుకురావడానికి ముమ్మరంగా యత్నాలు జరుగుతున్నాయి. చిరంజీవి కోడలు తాత గారు,  అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప రెడ్డి సారధ్యంలో పత్రిక వస్తోందని తెలుస్తోంది. జనసేన పొలిటికల్ సెక్రటరీ, మీడియా ఇంచార్జ్ హరిప్రసాద్ దీనికి ఎడిటర్ గా వ్యవహరిస్తారని తెలుస్తోంది. హరిప్రసాద్ ఈనాడు లో చాలాకాలం డెస్క్ లో పనిచేశారు. ఆ తర్వాత మా టి.వి న్యూస్ విభాగం హెడ్ గా పనిచేసారు. జనసేన పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కు మీడియా సలహాదారుగా ఉంటున్నారు. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: జనసేనకూ ఓ పత్రిక..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top