Translate

  • Latest News

    17, జులై 2018, మంగళవారం

    గౌరీ లంకేశ్ లాగే సంధ్యను కూడా చంపేస్తారా..?


    ఇక్కడ ప్రశ్నలు నిషేధం. ప్రశ్నిస్తే... నగర బహిష్కరణ...ఇంకా మాట వినకపోతే...కాల్చివేత... హిందుత్వ రాజ్యంలో అమల్లో ఉన్న అనధికార నిషేధాజ్ఞలు ఇవి. మొన్న కర్ణాటకలో ఎం.ఎం.కల్బుర్గిని, గౌరీ లంకేశ్ ను అందుకే చంపేశారు. అంతకుముందు మహారాష్ట్రలో గోవింద్  పన్సారే, .నరేంద్ర దబోల్కర్ లను అలాగే హత్య చేసారు. ఇప్పుడు త్రిశూలాల కన్ను తెలుగు రాష్ట్రాల మీద పడింది. రాముడిని తిట్టాడని కత్తి మహేష్ పై హిందుత్వ వాదులు కారాలు, మిరియాలు నూరుతున్నారు. పరిపూర్ణానంద స్వామి అగ్గి మీద గుగ్గిలమై పోయారు. .ఉద్యమం లోంచి అధికారం లోకి వచ్చిన కే.సి.ఆర్ ఎందరో ఉద్యమ కారుల మనోభావాలకు వ్యతిరేకంగా కత్తి మహేష్ ను నగర బహిష్కరణ చేయించాడు. దానిపై దళితులు, అభ్యుదయ వాదుల నుంచి వచ్చిన నిరసనతో బాలన్స్ చేసుకోవడానికి తర్వాత పరిపూర్ణానంద స్వామిని కూడా నగర బహిష్కరణ అన్నారు. ఇప్పుడు దాంతో సమస్య చల్లారింది అనుకున్నారా... అగ్గి రాజేయడమే హిందుత్వ వాదుల పని. వచ్చే ఎన్నికల దాకా ఈ అగ్గి రాజేస్తూనే ఉంటారు. శవాల మీద విసిరేసిన పైసలు ఏరుకునే రకం. కాదు..కాదు... ఓట్లు ఏరుకునే రకాలు. దళితులు, మహిళలు, నాస్తికులు, హేతువాదులపై నిత్యం దాడులు చేస్తూనే ఉంటారు/ ఇది వారికి నిత్య యజ్ఞం. ఆ యజ్ఞ ఫలాల నుంచే వాళ్ళు వచ్చే ఎన్నికల్లో ఓట్లు ఏరుకుంటారు. అది వారి ప్రణాళిక. అందుకే ఇప్పుడు గత నాలుగయిదు రోజులుగా వారు పీ.ఓ.డబ్ల్యూ సంధ్య పై సోషల్ మీడియా లో అసభ్యకరమైన మెసేజ్ లు పెడుతున్నారు. రేపే చేస్తామని, చంపేస్తామని, సంధ్య కుటుంబ సభ్యులని కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారు. బాబు గోగినేని పై కేసు పెట్టడాన్ని వ్యతిరేకించడం ఆమె చేసిన తప్పు అట, కత్తి మహేష్ పై నగర బహిష్కరణ ను ఖండించడం తప్పట. అందుకే ఈ బెదిరింపులు. అవునులే ...అది  మీ తప్పు కాదు.  మీ మనువాదం మీకు నేర్పింది అదే కదా...మీ మతం మీకు బోధించింది అదే కదా... అందుకే మీ   పిచ్చి ప్రేలాపనలు...మతోన్మాదంలో వాడుతున్న పిచ్చి వాగుడులు.
     సంధ్య అంటే ఒక వ్యక్తి కాదు.. మహా శక్తి... 40 ఏళ్ల ఉద్యమ చరిత్ర...  మహిళలకు కొండంత అండ... అభాగ్యుల కోసం కదలివచ్చిన కనక దుర్గ... కలకత్తా కాళిక నాలుక. మీ మంచి కోసమే చెబుతున్నా... దయచేసి  ఆమె జోలికి వెళ్లొద్దు... ఆపై... ఇక మీ ఇష్టం. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: గౌరీ లంకేశ్ లాగే సంధ్యను కూడా చంపేస్తారా..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top