Translate

  • Latest News

    18, జులై 2018, బుధవారం

    స్వామి అగ్నివేశ్ పై దాడిని ముక్తకంఠం తో ఖండిద్దాం


    స్వామి అగ్నివేశ్ పై దాడి హిందుత్వ వాదుల కిరాతకానికి తాజా ఉదాహరణ. మోడీ ప్రధానమంత్రి అయిన నాటి నుంచి మన దేశంలో హిందుత్వ వాదులు ఎక్కడో చోట...రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రశ్నించినందుకు చంపేస్తున్నారు. బీఫ్ తిన్నందుకు చంపేస్తున్నారు. తమ ఉనికి కోసం ప్రశ్నించిన నిమ్న జాతుల వారి గొంతు నులిమేస్తున్నారు. ఎదురుతిరిగిన యూనివర్సిటీ విద్యార్ధులను మానసికంగా హింసించి, ముప్పుతిప్పలు పెట్టి ఆత్మహత్యలకు పురికొల్పడం, లేదా అసలు మనుషులనే మాయం చేయడం..  వందే మాతరం అనక పోయినా... సినిమా ధియేటర్ లో జన గణ మన వచ్చినపుడు లేవకపోయినా దాడులు చేస్తున్నారు. అన్య మతాల వారికి గాని. హిందుత్వాన్ని విశ్వసించని నాస్తికులు, హేతువాదులకు గాని ఈ దేశంలో ఏ మాత్రం రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు 79 ఏళ్ల వయోవృద్ధుడు స్వామి అగ్నివేశ్ పై కూడా దాడికి తెగబడ్డారు. 


    స్వామీ అగ్నివేశ్... ఆయన పేరు లోనూ, కాషాయ వస్త్రధారణ లో మాత్రమే ఆ వాసనలు... ఆయన భావాలన్నీ విప్లవాత్మకమే... నిజానికి చెప్పాలంటే ఆయన విప్లవ స్వామీజీ. ఆయన పేరులోనే కాదు అగ్ని... ఆయన మాటల్లోనూ అగ్ని విరజిమ్ముతుంది. ఇంతకూ ఆయన అసలు పేరు ఏమిటో తెలుసా... వేపా శ్యాం రావు. అచ్చమైన తెలుగువాడు. మన సిక్కోలు లోనే పుట్టాడు. 

    వేపా శ్యాం రావు... అంటే ఎవరికీ తెలియదు. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వెనుకబడిన జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లాలో సనాతన హిందూ కుటుంబంలో 1939 సెప్టెంబర్ 21 న పుట్టిన శ్యాం రావుకు 4 వ ఏట తండ్రి చనిపోయాడు. ఛత్తీస్ గఢ్ లో ఉండే తాతయ్య (అమ్మ గారి నాన్నగారు) దగ్గర పెరిగాడు. న్యాయ శాస్త్రంలో, కామర్స్ లో పట్టభద్రుడు అయ్యాక కొలకత్తా లో సెయింట్ జేవియర్ కాలేజీ లో లెక్చరర్ గా కొద్ధికాలం పనిచేశారు. స్వామి దయానంద సరస్వతి 1875 లో స్థాపించిన ఆర్య సమాజ్ సిద్దాంతాలకు ప్రభావితుడై అందులో చేరి స్వామి అగ్నివేశ్ గా మారాడు. 1970 లో ఆర్య సభ పేరుతొ రాజకీయ పార్టీ స్థాపించాడు. 1977 లో హర్యానా నుంచి అసెంబ్లీ కి ఎన్నికయ్యాడు. ఆ రాష్ట్రంలో కేబినెట్ మినిస్టర్ గా కూడా పని చేసాడు. 1981 లో మంత్రి గా ఉండగానే బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్ స్థాపించి వెట్టిచాకిరి నిర్మూలనకు కృషి చేశాడు. 2004 నుంచి 2014 వరకు వరల్డ్ కౌన్సిల్ అఫ్ ఆర్యసమాజ్ కు అధ్యక్షుడిగా ఉన్నాడు. వెట్టి చాకిరి నిర్మూలనకు ఈయన చేసిన కృషిని జెనీవా లోని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం గుర్తించింది. 2011 లో జరిగిన అవినీతి వ్యతిరేకోద్యమంలో అన్నా హజారే టీమ్ లో ఈయన కూడా ఒకరు. 80 వ పడి లోకి పడబోతున్న ఈయన ఇప్పటికి సోషల్ వర్కర్ గా యాక్టీవ్ గా ఉన్నారు. అందులో భాగంగానే మంగళవారం జార్ఖండ్ లో అఖిల భారత ఆదిమ జన జాతీయ సమితి ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. బి.జె.పీ కి చెందిన యువజన, విద్యార్థి విభాగం నేతలు అక్కడికి వచ్చి హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. భారత్ లో బతకాలనుకునే వాడు వందే మాతరం అనాలసిందే... అంటూ ఆయన్ను కింద పడవేసి, పిడి గుద్దులు గుద్ది, చొక్కా చించివేసి, చెప్పులతో కొట్టి, అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ప్రజాస్వామ్య, లౌకిక శక్తులన్నీ ఇకనైనా ఏకం కండి. హిందుత్వ వాదుల దాడులపై సమర శంఖం పూరించండి... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: స్వామి అగ్నివేశ్ పై దాడిని ముక్తకంఠం తో ఖండిద్దాం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top