Translate

  • Latest News

    19, జులై 2018, గురువారం

    హోదా ఉద్యమాన్ని హైజాక్ చేసిన చంద్రబాబు



    అపర చాణిక్యుడు అయిన నారా చంద్రబాబు నాయుడు తన అపార రాజకీయానుభవంతో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని హైజాక్ చేసేశాడు. హోదా వద్దు...ప్యాకేజీ యే ముద్దు అని వాదించిన చంద్రబాబు ప్రతిపక్షాలు హోదా ఉద్యమాన్ని తలకెత్తుకునే సరికి తాను ఎక్కడ వెనుకబడతానో అని యూ టర్న్ తీసుకుని... నేను సైతం... హోదా ఉద్యమానికి సమిధనొక్కటి ఆహుతిస్తాను...అన్నాడు.. మళ్ళీ వెంటనే రెండో రోజే... నేను సైతం.... కాదు... నేను మాత్రమే... పోరాడుతాను...అని మాట మార్చాడు. తన పోరాటమే నిజమైన పోరాటం... మిగతా వాళ్ళు చేసేదంతా దొంగ నాటకం అన్నాడు. వై.సి.పీ గతంలో పార్లమెంటులో ఎన్నిసార్లు అవిశ్వాసం పెట్టినా... కనీసం దానిని చర్చకు ఒక్కసారి కూడా అనుమతించలేదు. నిరసనగా వై.సి.పీ ఎం.పీ లు రాజీనామాలు చేసి మాజీ లు అయ్యాక తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో టి.డి.పీ అవిశ్వాసం పెట్టగానే... బి.జె.పీ వెంటనే చర్చకు ఆమోదం తెలపడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వై.సి.పీ ఆరోపిస్తున్నట్టు నిజంగానే బి.జె.పీ. టి.డి.పీ ల మధ్య లోపాయికారిగా మైత్రి కొనసాగుతోందా అనే అనుమానం బలపడుతోంది. 
    టి.టి.డీ లో మహారాష్ట్ర మంత్రి భార్యను మెంబర్ గా తీసుకోవడం, ఇటీవల హైదరాబాద్ వచ్చిన బి.జె.పీ అధ్యక్షుడు అమిత్ షా ఈనాడు రామోజీతో భేటీ కావడం. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి చంద్రబాబు కాంగ్రెస్ మాజీ ఎం.పీ ఉండవల్లి ని అమరావతి కి పిలుపించుకుని మరీ సలహా అడగడం.. ఆ వెంటనే జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో టి.డి.పీ అవిశ్వాసం పెట్టడం, బి.జె.పీ వెంటనే ఆమోదించడం...ఇవన్నీ ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగినట్టుగా అనిపిస్తోంది. 
    బి.జె.పీ, టి.డి.పీ ఇద్దరూ కలసి హోదా ఉద్యమాన్ని మరోసారి అటక ఎక్కించడానికి ఆడుతున్న నాటకం ఇది. ఇందులో భాగంగానే హోదా ఉద్యమం వై.సి.పీ, జనసేన చేతుల్లోకి వెళ్లకుండా దాన్ని హైజాక్ చేయడంలో చంద్రబాబు కృతకృత్యుడయ్యాడు. వై.సి.పీ రాజీనామాలు చేస్తే... ఉప ఎన్నికలకు ఆస్కారం లేకుండా వాటిపై నిర్ణయాన్ని కావాలని తాత్సారం చేయించడంలో కూడా చంద్రబాబు హస్తముంది. ఇప్పుడు ఉప ఎన్నికలు రాకపోవడంతో వచ్చే ఎన్నికల దాకా పబ్లిక్ లో మొర పెట్టుకోవడమే తప్ప.. పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం వై.సి.పీ కి లేకుండా... వై.సి.పీ ని ప్రేక్షక పాత్రకు పరిమితం చేయడం బి.జె.పీ, టి.డి.పీ ల సంయుక్త రాజకీయ కుట్రలో భాగమే... ఎన్నికల దాకా హోదా కోసం తాను మాత్రమే నిజాయితీ గా పోరాడుతున్నట్టు టి.డి.పీ ప్రజల్లో షో చేసి, ఎన్నికల్లో ఎలాగోలా... గట్టెక్కితే... అప్పడు మళ్ళీ హోదా అంశాన్ని భూస్థాపితం చేసి, ప్యాకేజీ మూటను మళ్ళీ విప్పి కమిషన్లు పంచుకోవడం ఖాయం. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: హోదా ఉద్యమాన్ని హైజాక్ చేసిన చంద్రబాబు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top