Translate

  • Latest News

    20, జులై 2018, శుక్రవారం

    నాగార్జున కుర్ర హీరో పాత్రలకు ఇక స్వస్తి పలికినట్టేనా..?


    నాగార్జున కుర్ర హీరో పాత్రలకు ఇక స్వస్తి పలికినట్టేనా..?  నిజమే... నాగార్జున కూడా అమితాబ్ లాగా వయసుకు తగ్గ పాత్రలు వేస్తేనే బాగుంటుందేమో... అందుకే ఆయన కూడా ఆ దిశగా అడుగు వేయబోతున్నారా... ఈ అనుమానం ఎందుకు వచ్చిందంటే... కళ్యాణి జ్యుయలర్స్ కు ఇటీవల ఆయన చేసిన యాడ్... అందులో ఆయన పింఛను కోసం మనవరాలితో బ్యాంకు కు వెళ్లే తాతయ్యగా నటించాడు. నిజంగా ఆ పాత్రలో చాలా చక్కగా నటించాడు. ఇంతకుముందు   కళ్యాణి జ్యుయలర్స్ యాడ్స్ లో సూటు, బూటు వేసుకుని, టిప్ టాప్ గా కనపడిన నాగార్జున ఇలా ఒక్కసారి వృద్ధుడిగా కనపడడం చూసి ఆయన అభిమానులు కంగుతిన్నారు. అయితే నటుడన్న వాడు అన్ని పాత్రలు చేయాలి కదా... సినిమాల్లోనూ ఇంతకు ముందు మాంచి ఊపులో ఉన్నప్పుడే, అన్నమయ్య, రామదాసు చేయలేదా... ఇది అంతే అని సరిపెట్టుకున్నారు. అయితే నాగ్ కుమారులు చైతన్య, అఖిల్ ఇద్దరూ  ఓ పక్క హీరోలుగా వచ్చేశాక ఇంకా ఈయన హీరో వేషాలు వేస్తూ ఉంటే బాగుండదు కదా... అందుకే వయసుకు తగ్గ పాత్రలు వేస్తేనే బాగుంటుందిలే అని మరి కొంతమంది అభిమానులు అనుకుంటున్నారు. హిందీలో అమితాబ్ లాగా వయసుకు తగ్గ పాత్రలు వేసుకుంటూ పొతే...ఆయన లాగే 70 ఏళ్ళు దాటినా ఇండస్ట్రీ లో ఒక రేంజ్ లో చెలామణి అవ్వచ్చు అని ఇంకొంతమంది శ్రేయోభిలాషుల సలహా... దానికి తగ్గట్టు గానే తాజాగా నాగ్ ఇప్పుడు నాని తో కలసి చేస్తున్న ఓ సినిమాలో డాన్ గా నటిస్తున్నాడు. ముందు ముందు కూడా ఇలాగే నాగ్ మల్టీ హీరోల సినిమాల్లో నటిస్తూ, తనకు తగ్గ పాత్రలు చేసుకుంటూ ముందుకు పోతాడేమో చూద్దాం... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నాగార్జున కుర్ర హీరో పాత్రలకు ఇక స్వస్తి పలికినట్టేనా..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top