
తెలంగాణలో మహాకూటమిగా ఏర్పడ్డ కాంగ్రెస్, తెలుగుదేశం, కోదండరాం పార్టీ, సి.పీ.ఐ ల మధ్య పొత్తులు సామరస్యంగా కుదిరితే... కూటమి తొలి పరీక్షలో నెగ్గినట్టే... పొత్తులే ప్రధాన సమస్య కానుంది. ముఖ్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఎవరికీ వారే ఆయా స్థానాల్లో తమకే గట్టి బలం ఉందని, అక్కడ తమ అభ్యర్థినే పోటీలో పెట్టాలని పట్టుబట్టే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో పొత్తులే విచ్చు కత్తులు కానున్నాయి. అధికారంలో ఉన్న టి.ఆర్.ఎస్ పార్టీకి ఈ సమస్య లేదు. అందుకే వారు అందరికంటే ముందుగా అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముగ్గురితో ఒక స్క్రీనింగ్ కమిటీ నియమించారు. పార్టీ వ్యూహం ఖరారు చేసేందుకు 38 మంది తెలంగాణ నాయకులతో 3 గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీ లో రాహుల్ పార్టీ నాయకులకు ఒక విషయం స్పష్టం చేసారు. మనకు బలమున్న స్థానాల్లో పొత్తుల కోసం ఇతర పార్టీలకు ఆ స్థానాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. సో.. దీనిని బట్టి పొత్తులే విచ్చుకత్తులు కానున్నాయా అనే అనుమానం వస్తుంది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి