Translate

  • Latest News

    17, సెప్టెంబర్ 2018, సోమవారం

    తప్పెవరిది..?


    మనమంతా సమాజంలో వేల ఏళ్లుగా వేళ్లూనుకుపోయిన కుల, మత  భావజాలం తాలూకు పునాదులపై నిర్మితమైన పేకమేడల్లో నివశిస్తున్నాం.  ఆ కులం కంపులో నుంచే ఉద్భవించినవే ఈ పరువు హత్యలు...  మారుతీ రావు  అనే వ్యక్తి పరువు కోసం తన కుమార్తె పెళ్లి చేసుకున్న ప్రణయ్ అనే వ్యక్తిని పట్టపగలు నడిరోడ్డుపై హత్య చేయడం వెనుక వేల ఏళ్ల భావజాలం ఉంది. ఇలాంటి మారుతి రావులు సమాజంలో ప్రతి చోటా ఉన్నారు. కులమే కిరీటంగా భావిస్తూ సమాజాన్ని విషతుల్యం చేస్తున్నారు. ఆయా సంఘటనల్లో మారుతి రావో... మరొక తండ్రో నేరస్తుడు కావచ్చు... కానీ అసలు నేరస్తులు అటువంటి భావజాలాన్ని పెంచి పోషిస్తున్న వారు... కుల, మత  విశ్వాసాల్ని సమర్ధించే పెద్దలు... వారు గొప్పవిగా భావించే పుక్కిటి పురాణాలు, ఇతర మత  గ్రంధాలు. 24 గంటలు అటువంటి వాటిని పెంచి పోషిస్తున్న మీడియా కూడా... అన్ని టి.వి. చానళ్లలో రోజూ మూఢవిశ్వాసాల్ని ప్రేరేపించే  భావజాలాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహిస్తూ... ఇప్పుడు గొంతు చించుకుంటే ఏం లాభం. సో.. తప్పు ఒక్క మారుతి రావు దే  కాదు... మనందరిది... అందుకే వ్యక్తులు కాదు వ్యవస్థ మారాలి. అయితే వ్యవస్థ మారాలంటే... ముందు అది వ్యక్తి నుంచే మొదలవ్వాలి. కుల, మతాల కతీతంగా మానవత్వమే మతంగా భావించే మానవ సమాజాన్ని మనం నిర్మించుకోవాలి. అందుకు అనుగుణంగా నడుచుకుంటామని  ప్రతి ఒక్కరు శపధం చేయాలి. కుల, మత ప్రసక్తి లేని మరో ప్రపంచాన్ని మనం రూపొందించుకోవాలి. అప్పుడే ఇటువంటి హత్యలకు ఫుల్ స్టాప్ పడేది. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: తప్పెవరిది..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top