Translate

  • Latest News

    19, సెప్టెంబర్ 2018, బుధవారం

    సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న వై.ఎస్.ఆర్.సి.పీ..?


    అంతా బాగుంది...ఇండియా టుడే సర్వే కూడా వై.ఎస్.జగన్ గెలుపు ఖాయం అన్న సందేశాన్ని ఇచ్చింది. పార్టీ కార్యకర్తలు అందరూ మంచి జోష్ మీద ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ గెలుపు ఖాయం అన్నట్టుగా పరిస్థితులు అన్నీ అనుకూలముగా ఉన్నాయి...  అనుకుంటున్న తరుణంలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుంటోంది. 2014 ఎన్నికల ముందు కూడా జగన్ గెలుపు గ్యారంటీ అని అందరూ అనుకున్నారు. కానీ కొంతమందికి ఇచ్చిన మాట ప్రకారం వారు ఓడిపోతారని తెలిసినా జగన్ వారికే టికెట్ లు ఇచ్చారు. తన గాలిలో గెలిచిపోతారులే అనుకున్నారు. కానీ ఫలితం తారుమారు అయింది. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో కూడా జగన్ నోరు జారీ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి. పాదయాత్రతో రాష్ట్రం మొత్తం జగన్ కు అనుకూలంగా ఉంది. ఈ తరుణంలో రాష్ట్ర రాజధాని నగరమైన విజయవాడలో సెంట్రల్ సీటు విషయంలో బ్రాహ్మణులకు మాట ఇచ్చానని చెప్పి వంగవీటి రాధను కాదని మల్లాది విష్ణు కు టికెట్ కేటాయించేటట్టుగా లీకులు ఇచ్చి కొరివితో తల  గోక్కున్నారు. రాధను ఒక వ్యక్తిగా చూస్తే అది చాలా చారిత్రక తప్పిదం. రాధ ఒక వ్యక్తి కాదు. ఒక బలమైన సామాజిక వర్గానికి ప్రతినిధి. అతను పార్టీని వీడితే ఆ ప్రభావం మొత్తం ఐదారు జిల్లాల్లో ఉంటుంది. అన్నీ తెలిసి కూడా అంబటి లాంటి వారు  సెంట్రల్ సీట్ రాధకు ఇవ్వడం కుదరదు అని చెప్పడం... పార్టీ అధికార ప్రతినిధి గా ఆయన చెప్పాడు అంటే అది జగన్ మాట గానే తీసుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో రాధ పార్టీ ని వీడితే చేజేతులారా జగన్ మళ్ళీ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టే. మళ్ళీ ప్రతిపక్ష స్థానానికి పరిమితం అయ్యే ప్రమాదం ఉందనేది పార్టీ అభిమానుల ఆవేదన. అయితే వంగవీటి రాధా కు ఎక్కడ సీటు ఇచ్చినా అది గ్యారంటీ గా ఓడిపోయే సీటే అని. ఆయన జనాలతో కలవడు. ఎవరికీ పనులు చేయడు. మల్లాది విష్ణు గత 30 ఏళ్లుగా జనాల్లో ఉంటూ రాజకీయాల్లో తిరుగుతున్న మనిషి అని సెంట్రల్ లో రాధా కు వాళ్ళ నాన్న పేరును బట్టి తప్ప రాధా పేరు చెబితే ఓట్లు పడవని, అదే విష్ణు కు అయితే వేస్తారని, పార్టీ క్షుణ్ణంగా సర్వే చేయించుకునే ఈ నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాల వారి భోగట్టా.. చూద్దాం మరి ఏం జరుగుతుందో... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న వై.ఎస్.ఆర్.సి.పీ..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top