Translate

  • Latest News

    12, అక్టోబర్ 2018, శుక్రవారం

    వంచకులను తరిమికొట్టండి


    వంచన పటాపంచలు అయింది. ఇన్నాళ్లు ఏ బూచి చూపించి మనల్ని మోసం చేశారో అదంతా ఒట్టిదేనని తేలిపోయింది. అటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మనల్ని ఎలా వెర్రివాళ్లను చేశారో తేటతెల్లమైనది. ప్రత్యేక హోదా కు 14 వ ఆర్ధిక సంఘం అడ్డంకి అని ఇన్నాళ్లు మనలను నమ్మించి వంచించారు. ఇప్పుడు 15 వ ఆర్ధిక సంఘం చైర్మన్ నందకిషోర్ సింగ్ అసలు నిజం చెప్పాడు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి, ఆర్ధిక సంఘానికి ఎటువంటి సంబంధం లేదని రాష్ట్రాల ప్రత్యేక హోదా అంశం తమ పరిధిలోది కాదని స్పష్టం చేశారు. అది జాతీయ అభివృద్ధి మండలి పరిధిలోనిదని కూడా ఆయన తేల్చి చెప్పారు. హోదాను అమలు చేసే బాధ్యత ప్రణాళిక మండలి తీసుకుంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను ఇవ్వకుండా 14 వ ఆర్ధిక సంఘం ఆటంకంగా నిలిచిందని చెప్పడం పూర్తిగా అవాస్తవమన్నారు. పైగా ఆయన 14 వ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదా అంశం క్షుణ్ణంగా అధ్యయనం చేసిందని తాను భావించడం లేదని కూడా అన్నారు. రాష్ట్ర  విభజన ఏ పరిస్థితుల్లో జరిగింది, రాష్ట్రం ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటోంది తదితర అంశాలన్నిటినీ పరిగణన లోకి తీసుకుని 15 వ ఆర్ధిక సంఘం సానుకూల దృక్పధంతో వ్యవహరిస్తుందని కూడా చెప్పారు. సో... ఇన్నాళ్లు 14 వ ఆర్ధిక సంఘాన్ని బూచీగా చూపించి అటు బి.జె.పీ. ఇటు తెలుగుదేశం పార్టీలు రెండూ రాష్ట్ర ప్రజలను వంచించాయని క్లియర్ గా అర్ధమవుతోంది. సో... రానున్న ఎన్నికల్లో ఆ వంచకులను తరిమి కొట్టాల్సిన బాధ్యత ఓటరు మహాశయులపైనే ఉంది.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: వంచకులను తరిమికొట్టండి Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top