Translate

  • Latest News

    9, అక్టోబర్ 2018, మంగళవారం

    దసరావళి ధమాకాలు


    మార్కెట్ తన అవసరాల రీత్యా... తన వ్యాపారాన్ని విస్తృతం చేసుకునే ఎత్తుగడల్లో భాగంగా మన పండుగలకు సరికొత్త పేర్లు పెడుతోంది. రెండు పెద్ద పండుగలను కలిపేసి ఓ సరికొత్త పండుగను సృష్టిస్తోంది. కొన్ని కొత్త కొత్త పండుగలను కూడా సృష్టిస్తోంది. ఆయా పండుగలను పురస్కరించుకుని భారీ ఆఫర్లు ప్రకటించి... వినియోగదారులను వలలో వేసుకుంటోంది.  మనకు అతి పెద్ద పండుగలైన దసరా, దీపావళి పండుగలు ప్రతి ఏడాది 20 రోజుల వ్యవధిలో వస్తాయి. ఈ పాయింట్ ను మార్కెట్ క్యాచ్ చేసి కాష్ చేసుకుంటోంది. ఈ రెండు పండుగల  వ్యవధిని తమ  మార్కెట్ గ్రాండ్ సేల్ డేట్స్ గా ప్రకటించడమే కాకుండా రెండు పండగలను కలిపేసి మనకే తెలియకుండా దసరావళి అని ఓ సరికొత్త పేరు పెట్టేసింది. పేరు పెట్టటమే కాదు ఓ రెండు మూడేళ్ళుగా ఈ పేరుతొ ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదార్లను బుట్టలో పడేయడమే కాకుండా... మళ్లీ దసరావళి ఎప్పుడొస్తుందా అని వినియోగదారులు ఎదురుచూసేలా బ్రహ్మాండమైన ఆఫర్లు ఇస్తోంది. ఈ ఏడాది దసరావళి పండుగ రానే వచ్చింది. అక్టోబర్ 10 నుంచి 15 మధ్యలో ఆన్ లైన్ మార్కెటింగ్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు ఈ తేదీల మధ్యే తమ ఆఫర్లు ప్రకటించాయి. హైఎండ్ స్మార్ట్ ఫోన్లపై దాదాపు 5 వేలు తగ్గింపును ప్రకటించాయి. అది కాక పాత ఫోన్ ఎక్స్చేంజి మీద మరో మూడు వేలు, బ్యాంకు కార్డు మీద 10 శాతం డిస్కౌంట్ అన్ని కలిపి 10 వేలు దాకా  తగ్గే అవకాశాలు ఉన్నాయి. అది వినియోగదారుడికి నిజంగా పండగే. స్నాప్ డీల్ కూడా తన స్థాయిలో తానూ వరాలు ప్రకటించింది. వీరికి  పేటీయం కూడా తోడయింది. కాష్ బ్యాక్ ఆఫర్లు ఇస్తోంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు ఈసారి కేవలం మొబైల్స్ మీదే కాకుండా ఏ.సి లు, రిఫ్రిజిరేటర్లు పై కూడా ఆఫర్లు ప్రకటించడం విశేషం. వినియోగదారులకు ఇక పండగే పండగ... 
    అయితే ఇదంతా సమాజంలో కాస్తంత నాలుగు వేళ్ళు నోట్లోకెళ్ళి రెండు పూటలా కడుపునిండా  భోజనం చేయగలిగిన వారికే... కానీ నిత్యం బతుకు పోరాటం చేసే...  దారిద్ర రేఖకు అట్టడుగున ఉన్న కోట్లాదిమంది ప్రజల గురించి ఎవరూ ఆలోచించరు. మధ్య తరగతి ప్రజలు తాము ఇంకా ఉన్నత స్థానానికి ఎలా ఎగబాకాలా అనే ఆలోచనతోనే జీవితాంతం గడిపేస్తుంటారు. ఈ క్రమంలో పేదవాళ్ళకు కాస్తంత సాయం చేయకపోగా... వారిని అసహ్యించుకుంటారు. తమ ఎదుగుదలకు పేదవాళ్లు అవరోధం అన్న ఫీలింగ్ ఇస్తుంటారు. రాజకీయ నాయకులు ఎలాగు పట్టించుకోరు. కాకపొతే ఎన్నికల ముందు మాత్రం వారికి రకరకాల ప్రలోభాలు చూపి ఓట్లు వేయించుకుంటారు. మరి ఆ బడుగుల  జీవితాల్లో పండగ ఎప్పుడో... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: దసరావళి ధమాకాలు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top