Translate

  • Latest News

    20, అక్టోబర్ 2018, శనివారం

    ఓటమి భయం పట్టుకున్న చంద్రబాబు


    తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఇకనుంచి రోజులో సగం సమయం పార్టీకి కేటాయిస్తానంటున్నాడు. నేను చంద్రబాబు నాయుడిని మాట్లాడుతున్నా అని ప్రభుత్వ పథకాలపై టెలిఫోనిక్ సర్వేలు ఎన్ని చేసినా ప్రజలు కూడా తెలివిమీరిపోయారు కాబట్టి అడిగిన ప్రశ్నలకు నో చెబితే ఎక్కడ వచ్చే పధకాలు కట్ చేస్తారో అన్న భయంతో అన్నిటికి ఎస్ లు చెబుతున్నారు... దీంతో పాపం పిచ్చి బాబు నా ప్రభుత్వంపై పూర్తి సంతృప్తి ఉందని మురిసిపోయాడు. తీరా ప్రజల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ గురించి అడిగితే జనంలో నుంచి అసలు నిజాలు  బయటకు వచ్చి అధినేతకు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ప్రభుత్వంపై వ్యక్తం చేసిన  సంతృప్తి అంతా తన ఘనత అని, పార్టీపై వ్యక్తం అవుతున్న అసంతృప్తి అంతా పార్టీ నాయకుల వైఫల్యమని భావిస్తూ పార్టీని లైన్లో పెట్టడానికి ప్రతి రోజు సగం సమయం కేటాయిస్తానని ప్రకటించాడు. రాష్ట్ర ప్రభుత్వంపై 76 శాతం సంతృప్తి ప్రకటిస్తే... ఆ మేరకు పార్టీపై సంతృప్తి శాతం ఎందుకు పెరగడం లేదని పార్టీ నాయకులపై చిర్రుబుర్రులాడుతున్నాడు. ఇక టి.డి.పీ మిషన్ 2019 ఎన్నికలు అని ప్రకటించాడు. 45,920 బూత్  కన్వీనర్లపై దృష్టి పెట్టారు. ఇక తన టక్కు టమారా విద్యలన్నీ చూపించి ఎలాగయినా 2019 ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కడానికి శాయశక్తులా కృషి చేస్తారన్న మాట.  మొత్తానికి తనకు తిరుగులేదంటూ ఇన్నాళ్లూ డాంబికాలు పలికిన చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకున్నట్టు కనిపిస్తోంది. సో... వై.ఎస్.ఆర్.సి.పీ చంద్రబాబు ఎత్తుగడలతో జాగ్రత్తగా ఉండాలి మరి. పాదయాత్రలకు వస్తున్న జనాల్ని చూసి అతి విశ్వాసం పొతే మళ్ళి 2014 రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్త... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఓటమి భయం పట్టుకున్న చంద్రబాబు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top