Translate

  • Latest News

    28, మార్చి 2019, గురువారం

    థాన్క్యూ వెరీ మచ్ పవన్ కళ్యాణ్


    థాన్క్యూ వెరీ మచ్ పవన్ కళ్యాణ్... వెరీ వెరీ థాన్క్యూ. నాలుగేళ్లుగా నువ్వు  ఎన్ని నాటకాలాడినా... ఎన్ని వేషాలు వేసినా...నీ మీద గుడ్డి నమ్మకంతో... పిచ్చి అభిమానంతో నువ్వు చెప్పినవన్నీ నమ్మాము. ప్రశ్నిస్తానంటే ముచ్చట పడిపోయాం. స్టేజి మీద మాకు తెలియని ఎవరో గుంటూరు శేషేంద్ర శర్మ అంట... ఆయన కవితలు చదివి పూనకం వచ్చిన వాడిలా నువ్వు ఊగిపోతుంటే... ఆహా... ఓహో అంటూ మా పవన్ మేధావి... పుస్తకాలు తెగ చదివేస్తాడు...అని తెగ సంబరపడిపోయాం... నీ వెనకాల చేగువేరా బొమ్మ పెట్టుకుంటే... అయన ఎవరో మాకు తెలియకపోయినా... ఎవరో గొప్ప విప్లవ వీరుడంటా.. మా పవన్ కు ఆయనే ఆదర్శం...అయన లాగే పవన్ కూడా విప్లవం వర్ధిల్లాలి అంటాడని జిందాబాద్ లు కొట్టాం... మీ అన్నయ్య కంటే నువ్వు ఇంకా నిప్పు, నిక్కచ్చి... మాట మీద నిలబడే మనిషివి... పోరాట యోధుడివి అని, నీ బాటలో నడిచి నీతి, నిజాయితి గల నిష్కల్మష రాజకీయాలకు నాంది పలుకుదామని సంబరపడ్డాం. నువ్వు ప్యాకేజీల నాయకుడివని ప్రత్యర్థి పార్టీలు ఎన్ని చెప్పినా మేము నమ్మలేదు... నీ నిజాయితీ మీద కొండంత విశ్వాసంతో ఉన్నాం. నువ్వే మా వెలుగు బాట... మాకు దిక్సూచి అనుకున్నాం... నీ బాటలో నడవడానికి, నీ అడుగులో అడుగు వేయడానికి సిద్ధమయ్యాం...
    తీరా ఎన్నికల ఘట్టం మొదలు కాగానే  నువ్వు ఒక్కొక్క ముసుగు తీసి నీ అసలు స్వరూపం   బయటపెట్టి మా కళ్ళు తెరిపించావు...  పవన్ బాబూ...అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నా...  థాన్క్యూ వెరీ మచ్...
    అసలు నీ వెనకాల  నాదెండ్ల మనోహర్ చేరినప్పుడే మేము గ్రహించాల్సింది.. ఆయన, నువ్వు కలసి నాగార్జున యూనివర్సిటీ దగ్గర గుళ్లో దూరి చంద్రబాబుతో మంతనాలు ఆడినప్పుడే మేము గ్రహించాల్సింది.. మొద్దు బుర్రలం... పిచ్చిగా నువ్వేం చెప్పినా తలలు ఊపుతూ ఉన్నాం. పైగా నీ మైకంలో ఉన్నామయ్యే... నువ్వు ఏం చేసినా... మాకది కరెక్టుగానే తోచింది. ఇప్పటికయినా ఎన్నికలకు ముందే నీ నిజరూప దర్శనం కావించి మాకు కమ్మిన మైకాన్ని ఒక్క దెబ్బతో వదలగొట్టావు...
    నీ కంటే మీ అన్నయ్య చిరంజీవి వెయ్యి రెట్లు నయం... ఆయన 2009 లో ఎవరితో పొత్తు పెట్టుకోకుండా (డైరెక్ట్ గా గాని, ఇండైరెక్ట్  గా గాని) పోటీ చేసి.. కాంగ్రెస్, టీడీపీ లను ఎదుర్కొని 70 లక్షలకు పైగా ఓట్లు సాధించి, 18 ఎం.ఎల్.ఏ సీట్లు గెలుచుకున్నాడు.. ఆ తర్వాత వై.ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ పుణ్యమా అని గెలిచిన  ఆ కొద్దిమంది అధికార పార్టీలో చేరిపోతే... దిక్కుతోచని స్థితిలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేశాడు. నీలాగా కాదు. నువ్వు పోయిన ఎలక్షన్ కు ముందు తెలుగుదేశంతో డైరెక్టుగా పొత్తు పెట్టుకున్నావు...ఈసారి... చంద్రబాబు డైరెక్షన్ మేరకే విడిగా పోటీ చేస్తూ ఇండైరెక్ట్ గా   పొత్తు పెట్టుకున్నావు... నువ్వు ఎంత గొప్ప నటుడి వైనా... ఇక్కడ నువ్వు నీ నటనలో ఫెయిల్  అయ్యావు... అభ్యర్థుల ఎంపిక లోనే నీ గుట్టు బయటపడి పోయింది. మీ అన్నయ్య చిరంజీవి పదేళ్ల కిందట 18 ఎం.ఎల్.ఏ లను గెలుచుకున్నాడు కదా... నువ్వు అందులో సగం కూడా  గెలుచుకోలేవు... నువ్వు నిప్పు కాదు... తుప్పు అని మాకు బాగా అర్ధమైపోయింది. ముఖ్యంగా నువ్వు, ఆ వంగవీటి రాధా... మీ ఇద్దరూ కలసి కాపులకు జ్ఞానోదయం చేశారు... ఇన్నాళ్లు మీరు కాపు కులాన్ని ఉద్ధరిస్తారనుకుని పిచ్చ భ్రమల్లో బతికిన కాపులు... పౌరుషానికి మారుపేరైన కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం చూసి... ఇన్నాళ్లు నీ వెనకాల పడి తిరిగినందుకు లెంపలు వేసుకుంటున్నారు... ఎనీ హౌ.. మేము ముందే మేల్కొన్నాం ... ఇప్పుడు మాకు దిశా, దశ స్పష్టంగా ఉంది. మేము  ఎవరిని గెలిపించాలో వారినే గెలిపిస్తాం. కుట్ర రాజకీయాలకు చరమ గీతం పాడుతాం...
    ఇట్లు 
    ఓ పవన్ అభిమాని 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: థాన్క్యూ వెరీ మచ్ పవన్ కళ్యాణ్ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top