Translate

  • Latest News

    29, మార్చి 2019, శుక్రవారం

    ఆఖరికి ప్రకటనలలోనూ విషం చిమ్ముతోంది


    తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన అనుంగు శిష్యులు నిత్యం ప్రతిపక్ష వై.ఎస్.ఆర్.సి.పీ మీద దుమ్మెత్తి పోస్తుంది చాలక చివరాఖరికి తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన ప్రకటనల్లో సైతం పచ్చి అవాస్తవాలు, ప్రతిపక్ష పార్టీపై  దుష్ప్రచారం చేస్తోంది. ఒక ప్రకటనలో ఒక రైతు గత ప్రభుత్వంలో పొలాలకు నీళ్లు లేక ఆత్మహత్య చేసుకున్న తన కొడుకు ఫొటోకు ఇప్పుడు చంద్రబాబు పుణ్యమా అని... పట్టిసీమ నీళ్లు రాయలసీమకు పొంగి పొర్లుకుంటూ వచ్చాయని చూపిస్తూ చేసిన యాడ్ క్వాలిటీ పరంగా, నటుల అభినయం పరంగా చూస్తే బ్రహ్మాండంగా ఉంది కానీ...  అందులో చూపించినవన్నీ అవాస్తవాలే అంటూ ఓ యువకుడు స్వయంగా యాడ్ లో చూపించిన ప్రదేశానికి వెళ్లి లైవ్ వీడియో తీసి జనాలకు అసలు నిజం చూపించిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక పొతే మరో యాడ్ చూస్తే మరీ దుర్మార్గం. తెలుగుదేశం పార్టీ తన గురించి తాను  చెప్పుకోవాలి గాని ఎదుటి పార్టీ మీద బురద చల్లగూడదు. అది ప్రకటనల్లో నైతిక సూత్రాలకు విరుద్ధం


    . కానీ తెలుగుదేశం ప్రకటనల్లో సైతం తమ బుద్ధి బయట పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ ఒక ప్రకటనలో ఒక ఇంటికి ప్రతిపక్ష పార్టీ కార్యకర్త వచ్చి మా అన్న సభ ఉంది... అందరూ రండి. మీకు ఇవ్వాల్సింది ఇస్తారులే అని అంటాడు. ఆ ఇంట్లో మహిళ  బయటకు వచ్చి మేము రాము అంటుంది. దానికి ప్రతిపక్ష పార్టీ కార్యకర్త ... రేపు మా అన్న అధికారంలోకి వస్తాడు... అప్పుడు చెబుతాం నీ పని అని బెదిరిస్తాడు. ఆ మహిళ  అతన్ని చొక్కా పట్టుకు లాగి ఇంట్లో కింద పడేసి తంతుంది. ఇదీ... ఆ ప్రకటన... తెలుగుదేశం తన గురించి చెప్పుకోవాలి గాని ఎదుటి పార్టీ మీద ఈ విధంగా దుష్ప్రచారం చేస్తోంది. వై.ఎస్.ఆర్.సి.పీ ఇంకా ఈ విషయం మీద దృష్టి సారించలేదు. ఆ పార్టీ నాయకుల చూపు అంతా  ఇప్పుడు ఏ.బీ వెంకటేశ్వర రావు మీదే ఉంది. ఏది ఏమైనా... తెలుగుదేశం పార్టీ ఎన్ని రకాల కుట్రలు చేసినా జనంలో ఒక వేవ్ వచ్చిందనేది నిన్న జరిగిన జగన్ సభల్లో స్పష్టమైనది. నిన్న గుంటూరు జిల్లా వినుకొండ సభకు వచ్చిన జనాలను చూసి అక్కడి వారు ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడో 40 ఏళ్ల కిందట వినుకొండకు ఇందిరా గాంధీ వచ్చినపుడు చూశాం... మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం ఇంతమంది జనాల్ని అని వినుకొండకు చెందిన వృద్ధులు నిన్న అక్కడ వ్యాఖ్యానించడం జగన్ ప్రభంజనాన్ని చెప్పకనే చెబుతోంది. అదేవిధంగా నిన్న వెస్ట్ గోదావరి జిల్లా చింతలపూడి (ఎస్సి రిజర్వుడ్) నియోజకవర్గంలో మిట్ట మధ్యాహ్నం ఒంటిగంటకు వేలాదిమంది జనం రోడ్డుమీద జగన్ కోసం వచ్చారు. చుట్టుపక్కల లంబాడి తండాల్లో జనం స్వచ్ఛందంగా తరలి వచ్చారు... వారిదంతా ఒకటే మాట ఈ సారి జగన్ కి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం.. ఇదండీ సంగతి... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఆఖరికి ప్రకటనలలోనూ విషం చిమ్ముతోంది Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top