Translate

  • Latest News

    3, ఏప్రిల్ 2019, బుధవారం

    పైకి మేకపోతు గాంభీర్యం... లోలోన భయం...భయం...


    మరో ఎనిమిది  రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నాయకులు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ... లోలోన భయం..భయంగానే... ఉంటున్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీల్లో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. గత రెండు నెలలుగా వివిధ సంస్థలు విడుదల చేసిన సర్వే ఫలితాలు... జగన్, షర్మిల, విజయమ్మల సభలకు వస్తున్న జనాల్ని చూసి ఆ పార్టీ నాయకులు ఈసారి ఖాయంగా  విజయం  మనదే అని  సంబర పడుతున్నారు. అయితే పైకి ఆలా చెబుతున్నప్పటికీ లోలోన వాళ్లకు గుండెల్లో భయం ఉండనే ఉంది.ఇకపోతే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. గెలుపుపై ఆ పార్టీ అధినాయకుడైన చంద్రబాబుకే ఆశలు సన్నగిల్లాయి. నిన్న ఓ సభలో మాట్లాడుతూ... నాకు పదవి పోయినా ఏం బాధలే... మా మిస్సెస్ ఉంది. కొడుకు ఉన్నాడు.కోడలు ఉంది. మనవడు కూడా ఉన్నాడు... అన్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. అంటే చంద్రబాబు తాను ఇంటెలిజెన్సు డిపార్ట్మెంట్ ద్వారా ఎన్నిసార్లు సర్వే చేయించుకున్నా 45-50 కి మించి సీట్లు చూపించకపోడంతో తన భవిష్యత్తు తనకు క్లియర్ గా అర్ధమై నోటివెంట అన్యాపదేశంగా ఆ మాటలు వచ్చి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
    లోకేష్ కు పాపం... అడుగడుగునా నిలదీతలే...
    చంద్రబాబు తనయుడు లోకేష్ బాబును  మంగళగిరిలో ఎన్నికల ప్రచారంలో రోజూ ఎక్కడో ఒకచోట ప్రజలు  నిలదీస్తున్నారు. ఓవరాల్ గా రాష్ట్రం మొత్తం దాదాపుగా ఇదే సీన్ కనపడుతున్న నేపథ్యంలో అపర చాణిక్యుడైన చంద్రబాబు చివరి సెకను వరకు గెలుపుపై ఆశ వదులుకోకుండా ఓ పోరాట యోధుడిలా పోరాడుతాడన్న సంగతి అందరికీ తెలిసిందే. చంద్రబాబు కూడా లోపల లోపల ఎంత ఆందోళన ఉన్నా పైకి మేకపోతు గాంభీర్యంతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఐ.సి.యూ లో ఉంది. దాదాపుగా చనిపోయినా, బతికేవుందని నమ్మించడానికి డాక్టర్లు...(అభినేత, నాయకులు) శతవిధాలా ప్రయత్నిస్తున్నారు... ఎందుకంటే వెంటనే చనిపోయినట్టు ప్రకటిస్తే కుటుంబ సభ్యులు(పార్టీ కేడర్) తట్టుకోలేదనే భయంతో... కానీ డాక్టర్లు ఎంత దాచిపెట్టినా... ఈ నెల 11 న ప్రజలు నిర్ధారించేస్తారు. అధికారికంగా మే 23న ప్రకటిస్తారు. అయితే..  తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఎంత వ్యతిరేకత ఉన్నా మా నాయకుడి ఎత్తులు..పై ఎత్తులతో, పోల్ మేనేజిమెంట్ కళతో చివరకు గెలిచేది మేమే అని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. అదే వై.ఎస్.ఆర్.సి.పీ కార్యకర్తల్లో ఆ రకమైన ధీమా లేదు... కేవలం జగన్ కు వస్తున్న జనాల్ని చూసి చంకలు గుద్దుకోవడం తప్ప. చంద్రబాబు మాత్రం శవం పాడె  మీద ఎక్కించి.. శ్మశానం కు తీసుకు వెళ్లే లోపు కూడా దారిలో కనీసం మూడు సార్లయినా దింపుడు కళ్లెం ఆశతో పాడె  మీద నుంచి శవం లేచి వస్తుందనే ఆశ తోనే పోరాడతాడు. చివరకు చెప్పొచ్చేదేమిటంటే... వై.ఎస్.ఆర్ సి.పీ వాళ్ళు కూడా చంద్రబాబు అంటే ఎంత నచ్చక పోయినా... ఆయనలో ఉన్న పోరాట లక్షణాన్ని మాత్రం అలవర్చుకుని అతి విశ్వాసంతో... చంకలు గుద్దుకోకుండా... చివరివరకు అవిశ్రాంతంగా పోరాడితే ఘన విజయం ఖాయం... లేదంటే చరిత్ర మరోసారి పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త... 
    • Blogger Comments
    • Facebook Comments

    1 comments:

    1. చాలా బాగుంది బసు గారు ...ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బహు చక్కగా విశ్లేషించారు.

      రిప్లయితొలగించండి

    Item Reviewed: పైకి మేకపోతు గాంభీర్యం... లోలోన భయం...భయం... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top