Translate

  • Latest News

    26, ఏప్రిల్ 2019, శుక్రవారం

    మే 23 తర్వాత టీడీపీ ముక్క చెక్కలు..?


    మే 23 తర్వాత టీడీపీ ముక్క చెక్కలు కానుందా ... ఏమో జరిగినా జరగవచ్చు...  ఇప్పటికే టీడీపీ సీనియర్ నాయకుల్లో అంతర్మథనం  మొదలైనది. నిన్న మొన్నటి వరకు తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలివితేటల మీద...ఆయన రాజకీయ చాణిక్యం మీద ప్రగాఢ విశ్వాసమున్న ఆ పార్టీ నేతల్లో క్రమేపీ ఆ విశ్వాసం సన్నగిల్లుతూ వస్తోంది. ఇటీవల కాలంలో చంద్రబాబు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో తీసుకుంటున్న వైఖరి, నిర్ణయాలు అన్నీ వరుసగా బెడిసికొడుతుండడం... నవ్వులపాలవుతుండడంతో అసలు చంద్రబాబుకు ఏమైంది... అని ఆలోచనలో పడ్డారు. 95 లక్షల మంది డ్వాక్రా మహిళలకు 10 వేల  చొప్పున ప్రభుత్వ సొమ్ము పంచిపెట్టినా... ఎన్నికలకు రెండు నెలల ముందు 45 లక్షల మంది వృద్ధుల  పింఛన్లు వెయ్యి నుంచి 2 వేలకు పెంచినా ఎన్నికల ఫలితాలపై  పార్టీ నాయకుల్లో ఏ ఒక్కరూ ధీమాగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు.
    బి.జె.పీ తో తెగతెంపులు చేసుకోవడమే చేసిన తప్పా... 
    జగన్ హోదా నినాదాన్ని భుజాన వేసుకుని బొక్కబోర్లా  చంద్రబాబు 
    అసలు పార్టీ ఇంతటి దౌర్భాగ్య పరిస్థితికి రావడానికి కారణం చంద్రబాబు అతి తెలివితేటలే  అని ఆ పార్టీ సీనియర్ నాయకులు విశ్లేషిస్తున్నారు. అదేమిటని ఆశ్చర్యపోతున్నారా... నిజమే... చంద్రబాబు బీజీపీ తో తెగతెంపులు చేసుకుని పెద్ద తప్పు చేశారని ఆ పార్టీ నాయకులు మధనపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు చేసినప్పుడు కూడా ఆ సలహా ఇచ్చింది నేనే అని చెప్పుకున్న చంద్రబాబు ఆ తర్వాత జగన్ ప్రత్యేక హోదా నినాదంతో ఎక్కడ ప్రజలకు దగ్గర అయిపోతాడో అని భయపడి తాను ప్రత్యేక హోదా నినాదాన్ని భుజాన వేసుకున్నారు... జగన్ విసిరిన వలలో పడ్డాడు. అదిగో... సరిగ్గా అప్పటినుంచే... చంద్రబాబు ఓటమికి పునాది పడింది. చంద్రబాబులో భయం ఎప్పుడు మొదలైనదో అప్పుడే ఆయన ఓటమి మొదలైనది. ఆ భయాన్ని పుట్టించిన వాడు జగన్... చంద్రబాబు హోదా కోసం కావాలని మోడీ కి దూరమయ్యారు. ఇక్కడే ఆయన తప్పులో కాలేశారు.
    40 ఏళ్ల అనుభవం తప్పులో కాలేసింది.. 
     ప్రతి ఐదేళ్లకు అప్పటి పరిస్థితులను బట్టి జనం మూడ్ ఎలా ఉందో  కనిపెట్టి పొత్తులు పెట్టుకుని లాభపడి, రాష్ట్రంలో తన ముఖ్యమంత్రి పదవికి ఢోకా లేకుండా చేసుకుని అపర చాణిక్యుడు అనిపించుకున్న చంద్రబాబు... ఈ సారి మాత్రం దేశ రాజకీయాలను అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యారు... మోడీకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పొరబడ్డారు... కానీ ఆయన ఊహించినంత వ్యతిరేకత లేదని... ఇటీవల వెల్లడైన అనేక సర్వేలు వెల్లడించాయి. కేంద్రంలో మళ్ళీ బీజీపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆ సర్వేలన్నీ స్పష్టం చేశాయి. అలాగే రాష్ట్రంలో జగన్ కు అనుకూలముగా సర్వేలు వచ్చాయి. తాను తన సొంత ఇంటెలిజెన్స్ వ్యవస్థతో  ఎన్నిసార్లు సర్వేలు చేయించుకున్నా టీడీపీకి 50, 60 సీట్లు కంటే ఎక్కువ రావని చెప్పడంతో  చంద్రబాబులో ఫ్రేస్టేషన్  మొదలైనది. అప్పటి నుంచి ఆయన మాటల్లో కూడా తేడా వచ్చింది. తన ఓటమి ఖాయమని తేలిపోయాక సాకులు వెదకడం మొదలెట్టారు. అందుకే మొదటినుంచి టెక్నాలజీ ని ప్రోత్సహించిన చంద్రబాబు ఇప్పుడు ఈవీఎం లను విమర్శించి నవ్వుల పాలయ్యారు.నిన్న ఆయన అనుంగు పచ్చ పత్రిక ఆంధ్రజ్యోతి రాయలసీమ, ఉత్తరాంధ్రలో బ్యాంకర్లు పసుపు, కుంకుమ చెక్కులు సరిగా పంచలేదని ఓ కధనం రాసి... రాయలసీమ, ఉత్తరాంధ్రలో సీట్లు తగ్గడానికి ముందుగానే ఓ కథ రెడీ చేసింది. టీడీపీ అధినేతకు, పచ్చ మీడియాకు తమ ఓటమి తేటతెల్లమై... రకరకాల సాకులు సిద్ధం చేసుకుంటున్నారు.
    టీడీపీ సీనియర్లలో అంతర్మథనం
    నాలుగు రోజుల కిందట  ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉదయం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులతో నిర్వహించిన ఆంతరంగిక సమావేశంలో ప్రతి ఒక్కరితో మాట్లాడి... వారి...వారి విజయావకాశాలపై గుచ్చి గుచ్చి అడగడం... గెలుస్తారా...లేదా... అని ప్రశ్నించడం... మూడొంతుల మంది గెలుపుపై ధీమా వ్యక్తం చేయకపోవడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడులో గత కొద్ధికాలంగా ఉన్న ఫ్రేస్టేషన్ మరింత ఎక్కువైనది.  ఈ నేపథ్యంలోనే టీడీపీ సీనియర్ నాయకుల్లో కూడా అంతర్మథనం మొదలైనది. ఒక వేళ మే 23 న ఫలితాలు తెలుగుదేశంకు వ్యతిరేకంగా వస్తే... రాష్ట్రంలో జగన్, కేంద్రంలో మోడీ అధికారంలోకి వస్తే... అప్పుడు చంద్రబాబు పరిస్థితి ఏమిటి... చంద్రబాబు అక్రమాస్తులపై 2005 లో లక్ష్మీపార్వతి వేసిన కేసులో గత 14 ఏళ్లుగా ఉన్న స్టే పొడిగింపు లేకపోవడంతో ఏ సీ బీ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. తదుపరి విచారణ మే 13 కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై ఉన్న 18 కేసుల్లో స్టే లు అన్నీ  కొట్టివేసి ఒక్కొక్కటి విచారణకు వచ్చే అవకాశం ఉంది. జగన్, మోడీ కలసి చంద్రబాబు పాత కేసులన్నీ దుమ్ము దులిపి జైలుకు పంపితే... ఇటీవల కాలంలో చంద్రబాబే పలుమార్లు బహిరంగంగానే చెప్పాడు కదా మోడీ నన్ను జైల్లో పెట్టాలనుకుంటున్నాడు... ప్రజలే నన్ను కాపాడుకోవాలి అని... చంద్రబాబు ఊహించినట్టే జరిగితే... అప్పుడు పార్టీ పరిస్థితి ఏమిటి... ఈ విషయమే ఆ పార్టీ సీనియర్ నాయకుల్లో అంతర్మథనం మొదలైనది. లోకేష్ సరుకేమిటో ఈ పాటికే రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలిసిపోయింది. జగన్ జైల్లో ఉంటే విజయమ్మ, షర్మిల పార్టీని నడిపినట్టు... భువనేశ్వరమ్మ, బ్రహ్మణి పార్టీని నడిపించగలరా... పోనీ జగన్ పార్టీలోకి వెళదామంటే ఆయన రాజీనామా చేసి రమ్మంటాడు... రాజీనామా చేస్తే మళ్ళీ పోటీచేసి గెలుస్తామనే ధీమా లేదు.  ఇదే అదనుగా బీజీపీ టీడీపీ తరపున గెలిచిన ఎం.ఎల్.ఏ లకు గాలం వేసే అవకాశం ఉంది. నాలుగేళ్లు బి.జె.పీ తో సహవాసం చేసిన ఆ పార్టీ నాయకుల్లో కొందరు బీజేపీ లోకి వెళ్లే అవకాశం ఉంది. బీజేపీ లోకి వెళ్లడం ఇష్టం లేకపోతే... మరికొందరు ఇటీవల సహవాసం చేస్తున్న కాంగ్రెస్ లో చేరవచ్చు. ఇంకొందరు జనసేనలోకి వెళ్ళవచ్చు.  ఈ విధంగా టీడీపీ తరపున గెలిచే సుమారు  50 మందిలో ఓ 20, 25 మంది ఆలా వెళ్ళిపోతే... ఇక చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు, ఆయన అవినీతిలో భాగస్వామ్యులైన నారాయణ, గంటా లాంటి ఇతర కులాల వారు మాత్రమే  ఆ పార్టీలో మిగిలే అవకాశం ఉంది. ఇదండీ సంగతి... తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కళ్ళ ముందు కనపడుతోంది కదా... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మే 23 తర్వాత టీడీపీ ముక్క చెక్కలు..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top