Translate

  • Latest News

    29, ఏప్రిల్ 2019, సోమవారం

    వృద్ధ వేశ్యా పతివ్రత...


    చెడిపోవడానికి అవకాశాలు లేనప్పుడు అందరూ మంచిగానే ఉంటారు. చెడిపోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉండి, అన్ని ద్వారాలు తెరిచివున్నప్పుడు కూడా అటు వైపు వెళ్లకుండా నీతికి నిలబడిన వాడే గొప్పవాడు. అలాంటి వ్యక్తులు ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు. ఎక్కువమంది  జీవిత కాలమంతా అనైతిక, అవినీతి కార్యకలాపాలకు పాల్పడి... వయసుడిగినాక నీతి బోధలు వల్లిస్తుంటారు.. ఇలాంటి వారిని  వృద్ధ వేశ్యా పతివ్రత... అని అంటారు. రాష్ట్రంలో అత్యంత వివాదాస్పద రాజకీయ నాయకుడైన జె.సి. దివాకర రెడ్డి కూడా ఇప్పుడు ఈ జాబితాలో చేరారు. క్రియాశీల రాజకీయాల్లో నుంచి రిటైర్ అయ్యాక  నీతి వాక్యాలు వల్లిస్తూ...అదేమని అడిగితే వేరే వాళ్ళు విమర్శించక ముందే... తనను తానె వృద్ధ వేశ్యా పతివ్రత... అని విమర్సించుకున్నారు... 
    ఎన్నికల్లో వ్యయం అదుపు లేకుండా పెరిగిపోయిందని, దీనికి అడ్డుకట్ట వేయాలని, దీనికి  జస్టిస్ చలమేశ్వర్ లాంటి పెద్దలు పూనుకోవాలని దివాకర రెడ్డి ఇప్పుడు  కోరుతున్నారు. తాను 1979లో సమితి ప్రెసిడెంట్ గా పోటీ చేసినప్పుడు ఓటుకు ఒక్క రూపాయి ఇచ్చానని, మొన్న ఎన్నికల్లో చాలా చోట్ల ఓటుకు 2 వేలు, 2,500 చొప్పున ఇచ్చారని చెప్పారు. రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాల్లో కలిపి మొన్నటి ఎన్నికల్లో 10 వేల కోట్ల నల్ల డబ్బు ఖర్చు పెట్టారని, వీరంతా గెలిచాక దానికి పదిరెట్లు సంపాదించుకోవడానికే పని చేస్తారు తప్ప, ప్రజల కోసం పనిచేయరని ఆవేదన వ్యక్తం చేశారు. దివాకర రెడ్డి మొన్నటి ఎన్నికల్లో అస్త్ర సన్యాసం చేశారు. ఆయనకు బదులుగా ఆయన కుమారుడు పవన్ కుమార్ రెడ్డి అనంతపురం నుంచి ఎం.పీ గా పోటీ చేశారు. ఈ నేపథ్యంలో దివాకర్ రెడ్డికి ఇప్పుడే జ్జ్ఞానోదయం అయినట్టు... ఎన్నికల సంస్కరణల గురించి మాట్లాడుతున్నారు. ఇదేమిటీ సారూ... అని అడిగేతే...అవునండి... నేనే చెబుతున్నాగా... వేశ్య వయసయి పోయాక... వళ్ళంతా రోగాల పుట్ట అయిపోయాక వ్యభిచారం మానేసి పతివ్రత అయినట్టు... నేను ఇప్పుడు చెబుతున్నా... అని  ఎదుటి వారు విమర్శించక ముందే... తనను తానె విమర్సించుకున్నారు... ఇంకేమంటాం... చెప్పండి...
    మళ్ళి చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారట...
    ప్రజలకు ఎంత మంచి చేసినా అప్పటికప్పుడే మర్చిపోయారని, ఎప్పటికప్పుడు మాకేంటి... అనే ధోరణికి వచేశారని దివాకర రెడ్డి అన్నారు. ఇందులో ఏ ఒక్కరిది తప్పు కాదని, ప్రజలు, రాజకీయ నాయకులు, అధికారులు అందరి బాధ్యత ఉందని అన్నారు. ఐదేళ్లలో ఎన్ని మంచి పనులు చేసినా ప్రజలకు గుర్తు ఉండడం లేదని, పోలవరం, పట్టిసీమ, సి.ఎం రిలీఫ్ ఫండ్, ఎన్.టీ .ఆర్ వైద్య సేవ , చంద్రన్న కానుకలు అన్ని మర్చిపోయారని, ఎన్నికల ముందు ఇచ్చిన పసుపు, కుంకుమ ఒక్కటే గుర్తుపెట్టుకున్నారని, ఇప్పుడు అదే తెలుగుదేశాన్ని మళ్ళీ గెలిపిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. చూద్దాం... మరి... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: వృద్ధ వేశ్యా పతివ్రత... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top