ఎవరీ వేమూరు హరిప్రసాద్... సడన్ గా వార్తల్లో వ్యక్తి అయ్యాడు... చంద్రబాబేమో ఆయన మా సాంకేతిక సలహాదారు అంటున్నారు.... ఎన్నికల కమిషన్ ఏమో ఆయన ఈవీఎంల దొంగ అంటోంది... ఇంతకీ అసలు ఈ హరిప్రసాద్ ఎవరు... ఎక్కడ నుంచి వచ్చాడు...
చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వేమూరి హరి కృష్ణ ప్రసాద్ ఎలియాస్ వేమూరి హరిప్రసాద్ హైదరాబాద్ రైల్వే బాయ్స్ హైస్కూల్ లో హైస్కూల్ విద్య పూర్తి చేసిన అనంతరం చిక్కడపల్లి రాంనగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న రాంభద్ర జూనియర్ కాలేజీ లో ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. అనంతరం ఇనిస్ట్యూట్ అఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 2000 వ సంవత్సరంలో నెట్.ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ స్థాపించి దానికి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉంటున్నారు. 2017 సెప్టెంబర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా ఉంటున్నారు. ఈవీఎం వ్యవస్థలో లోపాలపై పరిశోధన చేసినందుకు ఈయన 2010 లో పయనీర్ అవార్డు అందుకున్నారు. హరిప్రసాద్ నేతృత్వంలో అలెక్స్ హాల్డర్ మాన్, రాప్ గాంగ్రిజిప్ బృందం ఈవీఎం ల పై పరిశోధన చేసింది. ఈవీఎం సెక్యూరిటీపై హరిప్రసాద్ చేసిన పరిశోధనకు శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రముఖ పౌర హక్కుల సంస్థ ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్ (ఈ.ఎఫ్.ఎఫ్) ఈ అవార్డు ను ప్రకటించింది.
ఈవీఎం ల పరిశోధకుడు దొంగ ఎలా అయ్యాడు..?

బాబు భజన మీడియా వత్తాసు...
ఈవీఎంలపై చంద్రబాబు అండ్ కో టీమ్ వివాదం ఇలా కొనసాగుతుండగానే బాబు భజన మీడియా తన పని తాము చేసుకుంటూ పోయాయి. ఆంద్రజ్యోతి బాబు డిల్లీ పర్యటనకు ప్రాముఖ్యత ఇచ్చి, ఈవీఎంలపై ప్రత్యేక కథనాలు వెలువరిస్తే, ఈనాడైతే మరో ముండడుగు వేసి ఏకంగా హరిప్రసాద్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ వెలువరించింది. బాబు, విపక్షాలు ఎంత గొడవ చేసినా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఈవీఎం స్థానే బ్యాలెట్ ఓటు రావటం అసాధ్యం. ఏ ఓటు వేసినా మోడికే వెళుతుందని వాదించి ప్రజల మైండ్ సెట్‌తో ఆడుకుంటున్న వారు ఆశిస్తుందేమిటి..? ఈవీఎంతో ఎన్నికలంటే ఇక మోడి ఎలాగు గెలుస్తాడని ప్రజలను ఎన్నికలకు దూరం చేయటమా.. ? ఇతర రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో విపక్షాలు ముందుగానే కాడి పడవేయటమా...? ఏది నిజం.. !
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి