Translate

  • Latest News

    23, ఏప్రిల్ 2019, మంగళవారం

    ఎవడ్రా...రాజధాని అభివృద్ధి కాలేదంది...


    ఎవ‌రు..మ‌న‌ రాజ‌ధాని అభివృద్ధి కాలేద‌ని చెప్పింది. బాబుగారివన్నీ బాహుబ‌లి రాజ‌ధాని గ్రాఫిక్ క‌థ‌లని, అమ‌రావ‌తిలో  ఒక్క శాశ్వత క‌ట్టడం  నిర్మితం కాలేద‌ని విమ‌ర్శించే ప్ర‌తిప‌క్షాల‌కు అభివృద్ధి క‌నిపించ‌టం లేదా..? అయినా భౌతికప‌ర‌మైన క‌ట్ట‌డాలు క‌డితేనేనా రాజ‌ధాని క‌ళ వ‌చ్చేది. ఒక‌ప్పుడు ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్‌లో ఉన్న అవ‌ల‌క్ష‌ణాలు వ‌చ్చాయా లేదా అన్న‌దే  ప్ర‌శ్న. అర్ధం కాలేదా ..ఈ క‌థ‌నం పూర్తిగా చ‌ద‌వండి. 

     రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం ప్ర‌భువుల‌ వారు  అర్జంటుగా రాజ‌దాని ప్రాంతం ఎక్క‌డ ఏర్పాటు చేయాలో ఆలోచించారు... చించి...చించి... చివరకు థేమ్స్ నది తీరంలో లండన్ నగరంలా  కృష్ణా నది తీరంలో  అమరావతి నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా త‌న అనుచ‌రుల‌కు లీకులు ఇచ్చి అమ‌రావ‌తి చుట్టుప‌క్క‌లా ఉన్న వారి భూములు చౌక‌గా కొని, ఎక్కువ  ధ‌ర‌ల‌కు అమ్ముకున్నారు. అంటే రియ‌ల్ ఎస్టేట్ రంగం ఈ ప్రాంతంలో అభివృద్ధి  చెందిన‌ట్లే క‌దా. రియ‌ల్ ఎస్టేట్ రంగం ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో ప‌క్క‌నే పేద‌ల భూములను లాక్కొని వెంచ‌ర్లు వేయ‌టంతో భూదందాలు పెరిగాయి క‌దా. రౌడీలు, సెటిల్‌మెంట్లు అబ్బో...  ఇంకా చెప్పాలంటే చాలా  ఉంది. ఈ క‌ల్చ‌ర్ చాల‌దా రాజ‌ధాని అభివృద్ధి చెందిందనడానికి...  తేరగా వచ్చిన సొమ్మును అలాగే ఖర్చు పెట్టాలి కదా... 

    మందుపార్టీలు, అమ్మాయిల‌తో ఆట‌పాట‌లు, రోజంతా ఖుషీగా ఎంజాయ్ చేయ‌టం ఈ క‌ల్చ‌ర్ రాజ‌ధానిది క‌దా. రేవ్‌ పార్టీలు, ముజ్రా పార్టీలకు  నగరంలోని కొన్ని రిసార్టులు.. అతిథి గృహాలు చిరునామాలుగా మారిపోవ‌టం,. శని, ఆదివారాలొస్తే చాలు...  హిందీ... తెలుగు.. తమిళ టీవీ ఛానెళ్లు... సినిమాల్లో కన్పించే కొందరు జూనియర్‌ ఆర్టిస్టులు, యువతులు అక్కడ సందడి చేయ‌టం దేనికి  సంకేతం... ‘స్ట్రిప్‌టీజ్‌ (ఒక్కొక్కటే వలువలు తీయడం)’ నృత్యాలతో హాజరైన వారికి కిర్రెక్కిస్తున్నారు.  అసభ్య నృత్యాలు, అనైతిక కార్యకలాపాలు నేరమని తెలిసినా ఆయా అతిథిగృహాలు, రిసార్ట్‌ల యజమానులు రేవ్‌పార్టీలు, ముజ్రా పార్టీలు నిర్వహించే వారికి అడ్డాగా మార‌టం రాజ‌ధాని క‌ల్చ‌రే క‌దా. మ‌త్తుమందులు, డ్ర‌గ్స్ వినియోగం పెరిగిపోవ‌టం, యువ‌తుల వ‌స్త్ర‌ధార‌ణ మారిపోవ‌టం ఇదంతా దేనికి సంకేతం... ఇటీవల సాగర తీరంలో... అదేనండి.. వైజాగ్ లో రేవ్ పార్టీ ల ఉదంతం బయట పడింది కదా... దొరికితేనే దొంగ...దొరకక పొతే దొర అన్నట్టుగా... వైజాగ్ లో దొరికారు...బెజవాడ, గుంటూరు జంట నగరాల్లో దొరకలేదు... అంతే ... ఇక్కడా అంతకంటే తక్కువేం కాదు.... ఇదంతా మన రాజధాని అభివృద్ధి చెందిందనడానికి నిదర్శనం కాదా... సో.. జయహో...అమరావతి... జయహో... 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఎవడ్రా...రాజధాని అభివృద్ధి కాలేదంది... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top