Translate

  • Latest News

    18, ఏప్రిల్ 2019, గురువారం

    చంద్ర‌బాబు చెప్పిందే రాజ్యాంగం... చేసిందే విధానం


    చంద్ర‌బాబుకు సీఎం సీటు అంత త్వ‌ర‌గా ఖాళీ చేసి వెళ్లాల‌ని లేన‌ట్లుంది. ఒక్క రోజు పెరిగినా ఆ సీట్లో కూర్చొని అధికారం చెలాయించాల‌ని త‌ప‌న‌ప‌డుతున్నారు. ఇందుకు ఆయ‌న వ‌క్ర‌భ్యాషాలు చెబుతున్నారు. భార‌త రాజ్యాంగం ద్వారా గ‌ద్దె ఎక్కిన పెద్ద మ‌నిషి , అమెరికా రాజ్యాంగం గురించి చెబుతున్నారు.
     ఈ ఏడాది జూన్‌ 8వ తేదీ వరకు తానే ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. 2014లో అదే తేదీన తాను ప్రమాణ స్వీకారం చేశానని, అందువల్ల ఈ ఏడాది అప్పటి వరకు తనకు సమయం ఉందని ఆయన వివరించారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకూ ఈ ప్రభుత్వం ఉంటుందని, అమెరికాలో అయితే ఎన్నికలు పూర్తయిన ఎనిమిది వారాలు పాత ప్రభుత్వమే కొనసాగుతుందని తెలిపారు.
    జూన్ 8వ‌ర‌కు ఆయ‌న సీఎంగా ఎలా కొన‌సాగుతారని అధికారులు, అటు రాజ్యాంగ నిపుణ‌లు జుట్టుపీక్కుంటున్నారు. మే 23 ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌తాయి. ఒక‌టి రెండు రోజులు, లేదా ముహుర్తం కోసం, ఇత‌ర కార‌ణాల కోసం వారం ప‌డుతుంది. కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటౌతుంది. అంతే కాని జూన్ 8వ‌ర‌కు చంద్ర‌బాబు సీఎంగా ఎలా ఉంటారో అన్న‌ది అర్ధంకాని మిలియ‌న్ డాల‌ర్ ప్ర‌శ్న‌. 
     ఎన్నిక‌ల ఘ‌ట్టం ప్రారంభ‌మైన వెంట‌నే ప‌రిపాల‌న వ్య‌వ‌స్థ అంతా ఎన్నిక‌ల సంఘం ఆధీనంలోకి వెలుతుంది. కొత్త‌గా ప్ర‌భుత్వం ఏర్పాటు కు వ‌చ్చిన సీట్ల సంఖ్య‌ను బ‌ట్టి గ‌వ‌ర్న‌ర్ మోజార్టీ ఉన్న నాయ‌కుడ్ని ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌ని ఆహ్వానిస్తారు. ఎన్నిక‌లు మొద‌లు .. కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటు   మ‌ధ్య కాలంలో గ‌తంలో ఉన్న ముఖ్య‌మంత్రి ఆప‌ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తాడు.
     ఒక‌వేళ తెలంగాణాలో మాదిరి ముంద‌స్తుగా ఎన్నిక‌ల‌కు వెళితే గ‌వ‌ర్న‌ర్ అసెంబ్లీ ర‌ద్దుచేస్తారు. అసెంబ్లీ రద్దయిన  ఎమ్మెల్యేలు సభ్యత్వం కోల్పోతారు. ముఖ్యమంత్రి, మంత్రివర్గ సహచరులు మాత్రం యధావిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆపధర్మ ప్రభుత్వానికి అధికారాలు ఉండవు. వీరి జీతభత్యాల్లో మార్పుండదు. ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడేదాకా మంత్రులు అధికారిక పర్యటనలతో పాటు ప్రభుత్వ అతిథి గృహాల్లో బస చేయవచ్చు. ఐతే.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే దాకా ఆపధర్మ మంత్రిమండలిగా కొనసాగాలని గవర్నర్‌ తన నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. 
    అప‌ధ‌ర్మ‌ముఖ్య‌మంత్రి గా ఏం చేయ‌వ‌చ్చు...

    రాజ్యాంగంలో ఆప‌ధ‌ర్మ‌ముఖ్య‌మంత్రి విధుల గురించి నేరుగా ఎటువంటి ప్ర‌స్తావ‌న లేదు. పార్ల‌మెంటు సాంప్ర‌దాయాల ప్ర‌కారం విధులు నిర్వ‌హించాల్సిఉంటుంది. కొత్త ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యే దాక ఉన్న అప‌ధ‌ర్మ ముఖ్య‌మంత్రి రోజువారి పారిపాల‌న య‌ధావిదిగా కొన‌సాగించ‌వ‌చ్చు. తాగునీరు, అత్య‌వ‌స‌ర సేవ‌లు, శాంతిభ‌ద్ర‌త‌ల విషయంలో స‌మీక్ష‌లు నిర్వ‌హించ‌వ‌చ్చు. అంతే కాని కొత్త విధానాల‌ను ప్ర‌క‌టించ‌కూడ‌దు. కొత్త ప‌నులు ప్రారంభించ‌టంకాని,  బ‌డ్జెట్ కేటాయింపులు జ‌ర‌ప‌రాదు. కొత్త నియామ‌కాల‌ను చేప‌ట్ట‌రాదు. వీటిని అతిక్ర‌మిస్తే కోర్టులు వాటిని కొట్టివేస్తాయి. గ‌తంలో త‌మిళ‌నాడులో జాన‌కిరామ‌చంద్ర‌న్ అప‌ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు జారీ చేసిన జీవోల‌ను కోర్టులు కొట్టివేసిన విష‌యం ఈ సంద‌ర్బంగా ప్ర‌స్తావించ‌వ‌చ్చు. ఇదంతా ఓకే.. చంద్ర‌బాబుతోనే  ఇక్క‌డ పేచీ. తాను చెప్పిందే రాజ్యాంగం, తాను అనుస‌రించిందే విధానం అన్న విధంగా ఉన్న ఆయ‌నతో రానున్న రోజుల్లో ఎన్ని క‌ష్టాలు వ‌స్తాయో అని ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు. 



    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: చంద్ర‌బాబు చెప్పిందే రాజ్యాంగం... చేసిందే విధానం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top