Translate

  • Latest News

    19, ఏప్రిల్ 2019, శుక్రవారం

    న‌ట‌న నేర్చుకోవాలంటే విప్పాల్సిందేనా?




    సినిమా అంటేనే రంగురంగుల మాయా ప్ర‌పంచం. దూరపు కొండలు నునుపు అన్న సామెత సినిమా రంగానికి సరిగ్గా వర్తుస్తుంది. షార్ట్ క‌ట్ లో ఎద‌గాల‌నుకొన్న‌వారికి ఇది స్వర్గ ధామం లాగ అనిపిస్తుంది. కానీ  లోనికి ప్ర‌వేశించాకే అస‌లు నిజం బ‌యట‌ప‌డుతుంది. నరక కూపం అన్న సంగతి వెల్లడవుతుంది. తీరా ఆ నిజం తెలిసిన తర్వాత బయట పడాలన్నా పడలేరు. ఎందుకంటే అదొక ఊబి.. ఆ ఊబి లో నుంచి బయటపడడం అసాధ్యం. పూల‌పాన్పు అనుకొన్న ఫీల్డ్‌లో ముళ్ల‌దారి ప్ర‌యాణం  మొద‌లౌతుంది. బ‌య‌ట‌కు వెళ్ల‌లేక‌... లోప‌ల ఉండ‌లేక స‌త‌మాతమౌతుంటారు. అన్ని రంగాల్లో మాదిరి కాకుండా...  ఇక్క‌డ అద‌నంగా లైంగిక దాడికి గురి అయ్యేది స్త్రీలే. ఈ విష‌యం శ్రీ‌రెడ్డి ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చిన క్యాస్టింగ్ కౌచ్ (ఆఫర్ల కోసం పడక గదిలోకి) పెను  సంచ‌ల‌నం సృష్టించిన సంగతి తెలిసిందే.  ఇది న‌ట‌న ద్వారా సినిమాలో అడుగు పెట్టేవారి సంగ‌తి.. అయితే ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చిన విషయం  న‌ట‌న  నేర్పే ఇనిస్టిట్యూట్ల లోనే లైంగిక దోపిడీ. నటన నేర్చుకుందామ‌ని వ‌చ్చిన వారికి ఆదిలోనే   చుక్క‌లు చూపించాడు ఓ ప్ర‌బుద్దుడు. న‌ట‌న నేర్పిస్తామ‌ని చెప్పి డ‌బ్బులు గుంజి, తీరా వచ్చాక న‌ట‌న నేర్చుకోవాలంటే బట్టలు విప్పాల్సిందే అంటూ కండిష‌న్ పెట్టాడు. మిగతా వారు అందుకు  ఓకే అన్నా ఒక యువ‌తి మాత్రం తిరస్కరించి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇన్నాళ్లు సినిమాల్లో అవకాశాల కోసం బట్టలు విప్పిస్తారని తెలుసు కానీ...  యాక్టింగ్ నేర్చుకోవడానికి వచ్చిన వారు   కూడా బట్టలు విప్పాల్సి వస్తుందన్న నగ్న సత్యం ఒక్కసారిగా సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 

    వినయ్ వర్మ... సినిమాలు చూసేవాళ్లకి ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు కానీ సినిమాల్లో నటించాలని ఆరాటపడేవాళ్లకు మాత్రం కచ్ఛితంగా తెలిసే ఉంటుంది. థియేటర్ ఆర్టిస్ట్‌గా పాపులారిటీ సంపాదించిన వినయ్ వర్మ... హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఓ యాక్టింగ్ స్కూల్‌ కూడా పెట్టుకున్నాడు.  సినిమాల్లోకి రావాలనుకునేవారికి ట్రైనింగ్ ఇచ్చే ఈ యాక్టింగ్ గురు... ఇప్పుడు చిక్కుల్లో ఇరుక్కున్నాడు. తన దగ్గరకు నటన నేర్చుకోవడానికి వచ్చిన యువతులను నగ్నంగా నిల్చుంటే గానీ... శిక్షణ ఇవ్వనని వేధించడమే ఇందుకు కారణం. హిమాయత్‌నగర్‌లో ‘సూత్రధార’ పేరుతో ఓ వర్క్ షాప్ స్థాపించాడు వినయ్ వర్మ. ఈ స్కూల్‌కు వచ్చిన యువతులను గదిలో బంధించి, వారితో అసభ్యంగా ప్రవర్తించడం ఇతనికి అలవాటు. తన కోచింగ్‌ సెంటర్‌కు యాక్టింగ్ నేర్చుకుందామని వచ్చిన యువతుల దగ్గర్నుంచి రూ.25,000 ఫీజు వసూలు చేసే వినయ్ వర్మ... ట్రైనింగ్ పేరుతో వారిపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు. నగ్నంగా నిలబడితేనే కోచింగ్ ఇస్తానని చెప్పి, తనను ఓ గదిలో బంధించి వేధించాడంటూ ఓ యువతి... హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. 

    ఇది ఒక్క విజ‌య‌వ‌ర్మ పైత్య‌మే అనుకుంటే పొర‌పాటే. ఇంకా ఇలాంటి సంస్థలు ఎన్ని ఉన్నాయో...తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సినిమాల్లో కాస్టింగ్ కౌచ్ పై ఓ కమిటీ ని నియమించింది. ఆ కమిటీపై ఇప్పుడు గురుతర బాధ్యత ఉంది. కేవలం సినిమా రంగంలోనే కాకుండా... ఇలాంటి యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ ల పైన కూడా ఓ కన్ను వేయాల్సిన అవసరం ఉంది.  ప్ర‌స్తుత‌ స‌మాజంలో స్త్రీ అంగ‌డి వ‌స్తువుగా మారింది. అన్ని రంగాల్లో లైంగిక దాడులు కొన‌సాగుతునే ఉన్నాయి. కాక‌పోతే సినీ మాయా ప్రపంచంలో ఇది కాస్త ఎక్కువ‌. ఇలాంటి వారిని గుర్తించి  క‌ఠినంగా శిక్షించ‌టం, స్త్రీల హ‌క్కుల‌ను కాపాడ‌టానికి తెలంగాణ ప్ర‌భుత్వం క‌మిటి ఏర్పాటు చేసింది. ఈ క‌మిటి ఎంత త్వ‌ర‌గా ప‌ని ప్రారంభిస్తే అంత మంచిది. ఈ దిశ‌గా అడుగులు వేయాల‌ని కోరుకుందాం.. 



    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: న‌ట‌న నేర్చుకోవాలంటే విప్పాల్సిందేనా? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top