Translate

  • Latest News

    8, ఏప్రిల్ 2019, సోమవారం

    క్విట్ తెలుగుదేశం... క్విట్ చంద్రబాబు..



    మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తా... మీరు ఎన్టీ ఆర్ అభిమానా ... లేక చంద్రబాబు అభిమానా ... మీరు ఎన్ టీ ఆర్ ను ఆరాధిస్తూ... చంద్రబాబు ను అభిమానిస్తున్నారా... లేక ఎన్ టీ ఆర్ ను ద్వేషిస్తూ చంద్రబాబు ను అభిమానిస్తున్నారా.. మీరు ఆనాడు... కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఎన్ టీ ఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరారా... మరిప్పుడు కాంగ్రెస్ తో కలసి పనిచేస్తున్న తెలుగుదేశంలో ఎలా ఇమడగలుగుతున్నారు... సరే... వీటన్నిటికీ కూడా మీరు చంద్రబాబు ఇచ్చిన వివరణలతో సంతృప్తి చెంది ఆ పార్టీలో కొనసాగుతున్నారనుకుందాం.. అయితే మీకు ఎన్. టీ ఆర్ అంటే అభిమానం ఉందా... లేక ఎన్ టీ ఆర్ ను ద్వేషిస్తున్నారా... మీకు ఎన్ టీ ఆర్ అంటే ఏ మాత్రం అభిమానం ఉన్నా సోషల్ మీడియా లో చంద్రబాబు, ఏ.బీ.ఎన్ రాధాకృష్ణ ఆంతరంగిక సంభాషణల వీడియో ఒక్కసారి వినండి... ఆ సంభాషణల్లో ఎన్ టీ  ఆర్ ఆరోగ్యశ్రీ కి ఆ పేరు తీసేయాలని వాళ్లిద్దరూ ఎలా కుట్రపూరితంగా మాట్లాడుకున్నారో వినండి... ఎన్ టీ  ఆర్ ను చంద్రబాబు వాడు...వీడు.. అంటూ ఎంత నీచాతి నీచంగా మాట్లాడాడో వినండి... తాగుబోతోడు సిట్టింగ్ లలో నిజాలు కక్కినట్టు... ఆనాడు వైస్రాయ్ కుట్రలో చంద్రబాబుకు కుడి భుజం లా నిలిచిన ఆయన అనుంగు దోస్త్ వేమూరు రాధాకృష్ణ పర్సనల్ గా కలసినప్పుడు వారి నిజ స్వరూపాలు ఎట్టా బయట పెట్టుకున్నారో చూడండి. ఆ తర్వాత కూడా ఇంకా మీరు ఆ పార్టీలోనే  కొనసాగాలనుకుంటే... ఇక మీ ఇష్టం... మాకు ఎటువంటి అభ్యంతరం లేదు... కానీ ఇకపై మీరు  ఎన్. టీ ఆర్ ఊసెత్తవద్దు. ఆయన పేరు తలవకుండా మీ పని మీరు చేసుకోండి. ఎన్ టీ ఆర్ విగ్రహాలకు దయచేసి మీరు దండలు వేయవద్దు... ఆయన మీద దొంగ భక్తి ప్రదర్శించవద్దు... ఆయన జయంతులు...వర్ధంతులు మీరు జరపవద్దు... కోట్లాది ఎన్. టీ ఆర్ అభిమానుల మనోభావాలు దెబ్బతీయవద్దు . ఇది ఒక ఎన్ టీ ఆర్ అభిమానిగా నా ప్రార్ధన...నిజమైన ఎన్ టీ .ఆర్ అభిమానులైతే మాత్రం తక్షణమే  క్విట్ తెలుగుదేశం..  క్విట్ చంద్రబాబు.
    ఇట్లు 
    ఓ ఎన్ టీ ఆర్ అభిమాని 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: క్విట్ తెలుగుదేశం... క్విట్ చంద్రబాబు.. Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top