Translate

  • Latest News

    9, ఏప్రిల్ 2019, మంగళవారం

    చేనేతకు ఎం.ఎల్.సి ప్రకటన సముచితం


    వై.ఎస్.ఆర్.సి.పీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మంగళగిరిలో జరిగిన బహిరంగ సభలో తాను  అధికారంలోకి రాగానే గుంటూరు జిల్లాలో మొట్టమొదటి ఎం.ఎల్.సి చేనేతలకే ఇస్తానని ప్రకటించడం హర్షణీయం. వాస్తవానికి మంగళగిరి ఎం.ఎల్.ఏ టికెట్ చేనేతలకే ఇవ్వవలసింది.  పైగా తెలుగుదేశం పార్టీ వారు గత ఎన్నికల్లో చేనేతలకు ఇచ్చిన టిక్కెట్ ఈ సారి వారికి ఇవ్వకుండా చంద్రబాబు తన కొడుకుకు ఇచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో వై.ఎస్.ఆర్.సి.పీ చేనేతలకు ఇచ్చివుంటే ఆ పార్టీకి చాలా ప్లస్ అయ్యేది. అలాంటి సువర్ణావకాశాన్ని వై.ఎస్.ఆర్.సి.పీ చేజేతులా జారవిడుచుకుంది. కానీ ఇక్కడ సిట్టింగ్ ఎం.ఎల్.ఏ, ఆ పార్టీకి చెందిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి కావడం...ఆయన రాజధానిలో రైతుల తరపున చేసిన పోరాటాలు, అంతేకాక పార్టీ తరపున ప్రభుత్వానికి చెందిన  అనేక కుంభకోణాలు వెలికితీయడంలో కీలకంగా వ్యవహరించి ఉండడం చేత జగన్ ఆయనకు తప్పనిసరి పరిస్థితుల్లో టిక్కెట్ ఇవ్వవలసి వచ్చింది. అందుకే ఆ లోటు పూడ్చుకోవడానికి ఈ రోజు జగన్ చేనేతలకు ఎం.ఎల్.సి ప్రకటించి తెలివైన పని చేశారు. కానీ ఎన్నికలకు కేవలం రెండు రోజుల ముందు ప్రకటించడం కన్నా...ఈ  విషయం చేనేతలకు చెందిన మాజీ ఎం.ఎల్.ఏ కాండ్రు కమల పార్టీలో చేరిన నాడే ప్రకటించి ఉంటే ఇంకొంచెం ఎక్కువ మేలు జరిగివుండేది.అలాగే మొన్న వై.ఎస్.ఆర్.సి.పీ అభ్యర్థి  ఆళ్ల రామకృష్ణా రెడ్డి 2024 ఎన్నికల్లో  మంగళగిరి అసెంబ్లీ   టిక్కెట్ చేనేతలకే ఇప్పిస్తానని చెప్పారు. ఈ విషయం కూడా ఇంకా చేనేత వర్గాల్లో పెద్దగా లోనికి చొచ్చుకుపోలేదు. అసలు ప్రస్తుత ఎన్నికల్లో ఆర్.కే తప్పుకుని టిక్కెట్ చేనేతలకు ఇప్పించి ఉంటె చాలా గౌరవంగా ఉండేది... వై.ఎస్.ఆర్.సి.పీ విజయానికి ఢోకా ఉండేది కాదు.   ఈ రోజు జగన్ ఎం.ఎల్.సి ప్రకటన కుడా రేపు ఒక్క రోజులో ఎంతమంది దానిని సానుకూలంగా రిసీవ్ చేసుకుంటారు.... తద్వారా ఎన్ని ఓట్లు అనుకూలంగా మార్చుకోగలుగుతారనేది చెప్పలేం. ఈ రెండు నిర్ణయాలు ఇంకాస్త ముందు ప్రకటించి ఉంటే ఇంకా బాగుండేది. ఏది ఏమైనా చేనేతలకు ఎం.ఎల్.సి ఇస్తానని జగన్ చేసిన ప్రకటన సముచితం... హర్షణీయం. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: చేనేతకు ఎం.ఎల్.సి ప్రకటన సముచితం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top