Translate

  • Latest News

    10, జూన్ 2019, సోమవారం

    ఏమి సేతురా లింగా.. ఏమి సేతు ..?


    రోజులు ఒకేలా ఉండ‌వు. ఒక్క‌ప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌గా జ‌గ‌న్‌కు ప్ర‌ధాని మోడీ అపాయింట్‌మెంట్ ఇస్తేనే కొంప‌లు మునిగి పోయిన‌ట్లు, దేశం అంతా అవిప‌విత్ర‌మైన‌ట్లు నానా హంగామా చేసిన టీడీపీ నేత‌లు, మాజీ సీఎం చంద్ర‌బాబుకు ఇప్పుడు నోట మాట రావ‌టం లేదు. ఈ స‌మ‌యంలో కూడా  సీఎంగా చంద్ర‌బాబు ఉండి ఉంటే ఈ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉండేది. బీజేపీతో స్నేహం పెటాకులై పోయాక త‌ప్పులు మీద త‌ప్పులు  చేసిన టీడీపీ అధినేత‌లో అభ‌ద్ర‌తా భావం పెరిగి పోయింది. కేంద్రం ఏదో చేయ‌బోతుంది.. త‌న‌ను, త‌న స‌న్నిహితులపై దాడి చేయ‌బోతుంద‌ని, ప్ర‌జ‌లు త‌న‌కు క‌వ‌చంలా నిల‌బ‌డి కాపాడుకోవాల‌ని ఆర్ధించిన చంద్ర‌బాబు ఇప్పుడు సైలంట్ అయ్యారు. తాను తా అంటే  తానా అంటూ భ‌జ‌న చేసిన బాబు భ‌జ‌న పత్రికలు  కూడా చంద్ర‌బాబుకు సంబంధించిన వార్త ఒక్క‌టి కూడా లేకుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్నాయి. అస‌లెం జ‌రుగుతోంది..? 

    ఎన్నిక‌ల ముందు కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం  చంద్ర‌బాబు అండ్ కో కోట‌రి మీద సీబీఐ దాడులు చేయిస్తార‌ని , త‌మ ఆర్ధిక మూలాలు స‌మూలంగా పెక‌లించి వేస్తార‌ని తెలుగు త‌మ్ముళ్లు తెగ మ‌ధన‌ప‌డ్డారు. అధినేత చంద్ర‌బాబు అయితే ఒక అడుగు ముందుకేసి రాష్ట్ర ప్ర‌భుత్వ అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్ట‌కూడ‌దంటూ జీవో కూడా విడుద‌ల చేశారు. కాని కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఎందుక‌నో టీడీపీ నాయ‌కులు అశించిన‌ట్లు చంద్ర‌బాబు మూలాల పై దాడులు చేయ‌లేదు. ఏవో కొంత‌మంది బాబు బినామి మంత్రుల‌పై నామమాత్రపు దాడులు చేయించి క‌థ ముగిసింద‌నుకున్నారు. అయితే ప్ర‌ధాని మోడీ ఆలోచ‌న మ‌రోలా ఉండ‌వ‌చ్చు. ఎన్నిక‌ల సమ‌యంలో బాబును కెలక‌టం వ‌ల్ల  ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో సానుభూతి క‌లిగించ‌టం స‌రికాద‌నుకున్నారు. ఈ ప్ర‌భావం ఎన్నిక‌లపై ప‌డే అవ‌కాశం ఉంద‌ని చంద్ర‌బాబు జోలికి వెళ్ల‌లేదు. అయితే బాబు త‌ప్పుల‌న్ని శిశుపాలుడి త‌ప్పులు లెక్కించిన‌ట్లు సాక్ష్యాధారాల‌తో కేంద్రం వ‌ద్ద రెడీగానే ఉన్నాయి. 
    మ‌రోసారి కేంద్రంలో తిరుగులేని మెజార్టీతో న‌రేంద్ర‌మోడీ ప్ర‌ధాని అయ్యారు. మోడీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి బాబు అండ్‌కో టీమ్‌లో భ‌యం మ‌రింత‌గా పెరిగింది. ఈ భ‌యం జ‌గ‌న్‌- మోడీ ఎప్పుడు భేటి అయితే అప్పుడు మ‌రింత‌గా పెరిగిపోతోంది. జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసినా, ప‌క్క రాష్ట్ర సీఎం కేసీఆర్‌ను క‌లిసినా టీడీపీ నేత‌లు ఉలిక్కి ప‌డుతున్నారు. ఏదో జ‌రుగుతుంద‌న్న అనుమానం వారిని కుంగదీస్తుంది. దీనికి తోడు జ‌గ‌న్ సుస్ప‌ష్టంగా గ‌త ప్ర‌భుత్వ అవినీతిని స‌మీక్షిస్తామ‌న‌టం, మాజీ స్పీక‌ర్ కోడెల కుటుంబ స‌భ్యుల‌పై రోజురోజుకు కేసుల ప‌రంప‌ర కొన‌సాగ‌టం బాబు టీమ్‌లో అల‌జ‌డి మొద‌లైంది. ఈ క్ర‌మంలో ఈ విప‌త్క‌ర ప‌రిస్థితి నుంచి బ‌య‌ట ప‌డ‌టానికి  ఏమి సేతురా లింగా, ఏమీ సేతు ..అంటూ బాబు త‌ల‌ప‌ట్టుకొని కూర్చొన్నార‌ట‌. 




    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఏమి సేతురా లింగా.. ఏమి సేతు ..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top