Translate

  • Latest News

    22, జులై 2019, సోమవారం

    హిమోన్నత శిఖరం హిమదాస్


    ప్రపంచ స్థాయిలో ఒక్క స్వర్ణం గెలిస్తేనే.... మన వాళ్ళు ఆహా...ఓహో... అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు... పత్రికల్లో పతాక శీర్షికల్లో అచ్చేస్తారు... ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ప్రత్యేక ట్వీట్లు ట్వీటేస్తారు... కోట్లలో నగదు బహుమతులు, భూములు వరమిచ్చేస్తారు... కొందరికి అయితే అర్హతలతో నిమిత్తం లేకుండా ఐ.ఏ.ఎస్ స్థాయి ఉద్యోగం ఇచ్చేస్తారు... కానీ ఇది అందరికీ కాదు... కొందరికే... మన సమాజంలో వేళ్లూనుకుపోయిన వివక్ష... క్రీడాకారుల విషయంలో కూడా కొనసాగుతుందనడానికి హిమ దాస్ ఉదంతమే ఉదాహరణ.
    ఒకటి కాదు..రెండు కాదు... మూడు కాదు.. నాలుగు కాదు...ఏకంగా ఐదు... అదీ ఐదేళ్ల వ్యవధి లోనో... పదేళ్ల వ్యవధి లోనో కాదు... అన్నీ కేవలం 20 రోజుల్లోనే...
    మొదటి బంగారు పతకం :
    2 జూలై 2019 : poznan అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్, పోలండ్
    200 మీటర్లను 23.65 సెకన్లలో...
    రెండవ బంగారు పతకం :
    7 జూలై 2019 : kulno అథ్లెటిక్స్ మీట్, పోలండ్
    200 మీటర్లను 23.97 సెకన్లలో...
    మూడో బంగారు పతకం :
    13 జూలై 2019 : kladno అథ్లెటిక్స్ మీట్, czech  రిపబ్లిక్
    200 మీటర్లను 23.43 సెకన్లలో...
    నాలుగో బంగారు పతకం :
    17 జూలై 2019 : tabor అథ్లెటిక్స్ మీట్, czech  రిపబ్లిక్
    200 మీటర్లను 23.25 సెకన్లలో...
    ఐదో  బంగారు పతకం :
    20 జూలై 2019 : kladno అథ్లెటిక్స్ మీట్, czech  రిపబ్లిక్
    400 మీటర్లను 52.09 సెకన్లలో...

    ఇలాంటి రికార్డు ప్రపంచంలో మరే క్రీడాకారుడికి గాని, క్రీడాకారిణికి గాని లేదేమో... కానీ ఇంతటి ఘనత సాధించినా... మన పత్రికల్లో ఎక్కడో స్పోర్ట్స్ పేజీలో అడుగున పడేస్తారు తప్ప... పతాక శీర్షికల్లో చోటివ్వడానికి మనసొప్పదు... ఈనాడు స్పోర్ట్స్ పేజీలో టైటిల్ పోరుకు సింధు అని టాప్ లో పెట్టి... హిమ పాంచ్ పటాకా ఒకే నెలలో ఐదో స్వర్ణం అని అడుగున వేశారు. అయితే కాస్త బాక్స్ లో వేశారు. సంతోషం. (తీరా టాప్ లో పెట్టిన సింధు రజతంతో సరిపెట్టింది.)  హిమదాస్... వేల ఏళ్లుగా మనువాద సిద్ధాంత పునాదుల మీద ఎదిగిన ఈ కుత్సిత సమాజం అంత త్వరగా మారదు... దీని గురించి నువ్వు పట్టించుకోవద్దు... నీ దారిన నువ్వు ముందుకు సాగిపో.... నీకు ఎదురే లేదు..తిరుగే లేదు... పద... ముందుకు పద... మున్ముందుకు పద... నదీ నదాలు , అడవులు, కొండలు, ఎడారులా... నీ కడ్డంకి.. పద... తోసుకు పో...ముందుకు సాగిపో... మేమంతా నీ వెనుక ఉంటాం...

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: హిమోన్నత శిఖరం హిమదాస్ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top