Translate

  • Latest News

    10, సెప్టెంబర్ 2019, మంగళవారం

    ఆంధ్రా ఐ.టి. హబ్ వైజాగ్


    కర్ణాటక కు ఓ బెంగళూర్... తెలంగాణ కు ఓ హైదరాబాద్... మరి...మన ఆంధ్రప్రదేశ్ కు అటువంటి రాజధాని...కాదు...అంతకంటే గొప్పగా... ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. జగన్ అండ్ కో అది అమరావతి కాదు... భ్రమరావతి అన్నారు... చంద్రబాబు కన్న బిడ్డ అమరావతి ఐదేళ్లయినా కనీసం ఇంకా లేచి నిలబడి నాలుగు అడుగులు కూడా వేయలేకపోయింది... దాంతో ప్రజలు జగన్ చెప్పింది నిజమే...అది భ్రమరావతే అని నమ్మి...జగన్ ను గెలిపించారు... ఇప్పుడు అమరావతి ఊసే లేదు... అయితే జగన్ వ్యూహాత్మకంగా...అడుగులు వేస్తున్నారు... అమరావతి అనే ఒక అజాగళ స్థనం ముఖచిత్రాన్ని  ప్రజల మెదళ్ల నుంచి పూర్తిగా తుడిచి వేసి.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను ఒక ప్రణాళిక ప్రకారం సమగ్ర అభివృద్ధి చేయడానికి జగన్ మెదడులో ఒక ప్లాన్ రెడీ గా ఉంది... దానిని ఒక పధకం ప్రకారం వన్ బై వన్ అమల్లో పెడుతున్నారు. జగన్  ఆలోచనల్లో భాగంగా రాష్ట్రంలో వైజాగ్ ను ఐ.టి. హబ్ గా  డెవలప్ చేయనున్నారు... ఈ విషయం మొన్న ఆయన శ్రీకాకుళం ట్రిపుల్ ఐ.టి. విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు అన్యాపదేశంగా బయట పెట్టేశారు. మన రాష్ట్రంలో ఐ.టి హబ్ గా డెవలప్ చేయడానికి అవకాశం  ఉన్న ప్రాంతం ఒక్క విశాఖపట్నం ఒక్కటే అని జగన్ తేల్చి చెప్పేశారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు... దాని ద్వారా చంద్రబాబు, లోకేష్ బాబు చెప్పిన మంగళగిరి లేదా గన్నవరం లను ఐ.టి హబ్ గా చేస్తామన్న మాటలకు ఇక ప్రాసంగికత లేకుండా చేశారు. తద్వారా చంద్రబాబు సామాజిక వర్గం బలంగా ఉన్న అమరావతి ప్రాంతం పేరుకే రాజధాని తప్ప... చంద్రబాబు కలలు కన్న నవ నగరాలు అక్కడ ఇక ఏమీ ఉండవన్న విషయాన్ని కూడా అన్యాపదేశంగా చెప్పేశారు. అమరావతి పై జగన్ గత నాలుగు నెలలుగా పాటిస్తున్న మౌనంతో ఇప్పటికే అమరావతి ఒక జీవచ్ఛవం గా మారింది. దీనిపై జగన్ ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు... అయితే అయన మెదడులో వేరే ఆలోచన ఉంది.. ఎవరేమనుకున్నా... ఆయన మనసులో ఉన్నదే చేస్తారు... అది జగన్ మొండితనం అందరూ అనుకుంటారు... కానీ... ఆయనకు ప్రతి విషయం మీద ఒక పక్కా ప్రణాళిక ఉంది. పక్కా విజన్ ఉంది... దాన్ని ఒక పధకం ప్రకారం అమల్లో పెడతారు... 
    నాలుగు ప్రణాళికా మండలులతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి... 
    జగన్ తన ఆలోచనలకు సంబంధించి మనకు ఒక క్లూ ఇచ్చారు. అదే ప్రణాళిక మండలులు.... రాష్ట్రాన్ని నాలుగు ప్రణాళికా మండలులుగా విభజించారు. విజయనగరం కేంద్రంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం లతో ఒక ప్రణాళిక మండలి... కాకినాడ కేంద్రంగా ఈస్ట్, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలతో ఒక ప్రణాళిక మండలి, గుంటూరు కేంద్రంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో  మరో మండలి, ఇక కడప కేంద్రంగా రాయలసీమ నాలుగు జిల్లాలతో మరో మండలి ఏర్పాటు చేశారు. ఒక్కో మండలికి ఒక చైర్మన్ తో పాటు, అగ్రికల్చర్, ఇరిగేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్స్ రంగాల్లో ప్రముఖులను మెంబర్లు గా నియమిస్తారు. ఈ మండలుల ఏర్పాటు తోనే జగన్ తన ప్లాన్ దిగ్విజయంగా అమలు చేశారు. కమ్మ సామాజిక వర్గాన్ని చావుదెబ్బ కొట్టడానికే అమరావతి లో భాగమైన కృష్ణ, గుంటూరు జిల్లాలను విడదీశారు... అంతటితో ఆగకుండా కృష్ణా జిల్లాను ఈస్ట్, వెస్ట్ లతో కలిపేసి కాకినాడ కేంద్రంగా పెట్టడం ద్వారా కమ్మ సామాజికవర్గం ఆటలు సాగకుండా చేశారు... అంతే  కాదు... కాపు సామాజిక వర్గం జనసేన వైపు వెళ్లకుండా ఉండేలా వారికి పట్టు ఉన్న కాకినాడ ను ప్రణాళిక మండలి కేంద్రంగా పెట్టడం మరో అద్భుతమైన ప్లాన్... ప్రధానంగా వ్యవసాయక జిల్లాలైన ఈ ఎం మూడు జిల్లాలలో అగ్రి, ఆక్వా పరిశ్రమలు డెవలప్ చేయనున్నారు... విజయనగరం జోన్ కు వైజాగ్ ను కేంద్రంగా పెట్టకుండా విజయనగరం పెట్టడం కూడా ఆ ప్లాన్ లో భాగమే.. ఎందుకంటే... వైజాగ్ సిటీ లో కొద్దిగా కమ్మ సామాజికవర్గం హవా ఉంది కాబట్టి... వారికి ఛాన్స్ ఇవ్వకుండా విజయనగరం ను కేంద్రంగా పెట్టారు. ఇక గుంటూరు కేంద్రంగా ఏర్పాటు చేసిన మండలిలో ప్రకాశం జిల్లా  దొనకొండ లో ఐదు వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ జోన్ గా డెవలప్ చేయనున్నారు...
    రాయలసీమలో కడప కేంద్రంగా నాలుగు జిల్లాలను ఎలా డెవలప్ చేయాలో అన్నది జగన్ మైండ్ లో క్లియర్ గా ఉంది. రాయలసీమ ప్రాంతీయ ప్రణాళిక బోర్డును కడప కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలు దీని పరిధిలోకి రానున్నాయి. కడపజిల్లా మామిడి, బొప్పాయి, చీనీ, అరటి పంటలకు ప్రసిద్ధి. పులివెందుల అరటికి విదేశాల్లో డిమాండ్‌ ఉంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దిగుబడి వచ్చినా నిల్వ ఉంచుకునేందుకు కోల్డ్‌ స్టోరేజీ లేదు. అనంతపురం జిల్లా చీనీ తోటలకు ప్రసిద్ధి. కర్నూలు కేపీ ఉల్లి, ప్రొద్దుతిరుగుడు, కంది, జొన్న పంటలకు.. చిత్తూరు మామిడి, మల్బరీ, వేరుశెనగ, టమోటా సాగుకు ప్రసిద్ధి. మదనపల్లె ప్రాంతంలో సాగయ్యే టమోటా సీమ జిల్లాల అవసరాలు తీర్చడంతో పాటు పొరుగు రాష్ర్టాలకూ ఎగుమతి అవుతోంది. ధర ఉంటే కిలో రూ.70 నుంచి రూ.80 పలుకుతుంది. లేదంటే కిలోకు రూపాయి కూడా రాని పరిస్థితి ఉంది. అయితే ప్రాంతీయ బోర్డు ఏర్పాటైతే  నీటి సంరక్షణ, నీటి నిర్వహణకు ప్రణాళిక బోర్డుతో ప్రణాళికలు తయారు చేసి కరువు నివారణకు ప్రణాళికలు రూపొందిస్తారు.సీమ జిల్లాలు ఖనిజ నిక్షేపాలకు కాణాచిలాంటివి. ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అపారమైన సున్నపురాయి, ఇనుపఖనిజం, బెరైటీస్‌ తదితర నిక్షేపాలున్నాయి. కడపలో  ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన వనరులున్నాయి. పరిశ్రమలు లేకపోవడంతో యువత ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళుతోంది. ప్రాంతీయ బోర్డులతో సమగ్రమైన పారిశ్రామిక విధానాన్ని ఏర్పాటు చేయడంతోపాటు చిన్న మధ్య  తరహా పరిశ్రమలను ప్రోత్సహించవచ్చు. దీని వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇవన్నీ  అమలులోకి వస్తే రాష్ట్ర స్వరూపమే మారిపోయి అన్ని ప్రాంతాలు  ఒక ప్రణాళిక ప్రకారం సమగ్ర అభివృద్ధి చెందే అవకాశం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. 



    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఆంధ్రా ఐ.టి. హబ్ వైజాగ్ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top