Translate

  • Latest News

    13, సెప్టెంబర్ 2019, శుక్రవారం

    మనసు కవి... మన సుకవి...


    మనసు అనే మూడక్షరాల పదం  లోంచి  పుట్టుకొచ్చిన   ప్రేమ అనే రెండక్షరాలు వేల ఏళ్లుగా ఈ ధరణిపై ఎన్నో సంచలనాలకు ప్రేరణ అయింది. . మహా సామ్రాజ్యాలనే కుప్పకూల్చింది. ప్రణయం ప్రళయాలకు  కారణభూతమైనది. సఫలమైతే...  అది మధురం... అతి మధురం... ప్రణయ సుధా రస సాగరం... విఫలమైతే... గొంతులో కాలకూట విషం... నిలువునా దహించి వేసే బడబాగ్ని... ఇక ఆ తరువాత ఎక్కడ ఉన్నా ఏమైనా... నీ సుఖమే నే కోరుకున్నా... అంటూ మనల్ని మనం సముదాయించుకోవాల్సిందే... శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే.... అని విషాద గీతాలు పాడుకుంటూ... శేష జీవితాన్ని కాలక్షేపం చేయడమే.... ఆలా శోకంలో కూడా మనకు సుఖాన్ని చూపించి ఆ మహానుభావుడు ఆచార్య ఆత్రేయ ఎంతో మంచి పని చేశాడు... ఆయన మన మధ్య నుంచి అదృశ్యమై నేటికి సరిగ్గా 30 సంవత్సరాలైనది... అయినా... 30 కాదు... 300... కాదూ... 3000 సంవత్సరాలైనా ఆ మహానుభావుడు మనకిచ్చి వెళ్లిపోయిన ఆణిముత్యాలను మనం ఎలా మరిచిపోగలం... నిత్యం ఆయన పదాలు మన నాలుకలపై కదలాడుతుంటానే ఉంటాయి కదా.... మనసు అనే పదం విన్నప్పుడల్లా ఆయనే మనకు గుర్తొస్తారు.. మనసు కవిగా మన మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారు కదా... ఆయన జీవితంలో ఏ విషాద ప్రణయ కావ్యం దాగుందో మనకు తెలియదు  కానీ... మనకు మాత్రం అద్భుతమైన ప్రణయ కావ్యాల్ని అందించి వెళ్ళిపోయాడు... మనసు...ప్రేమ... వైఫల్యం...  విషాదం... జీవితంలో ఈ అనుభవాలను రుచి చూసినవారెవరికయినా ఆత్రేయే శరణ్యం... అందుకే ఈ రోజు ఆయన పాటలు పాడుకుంటూ గడిపేద్దాం మరి... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మనసు కవి... మన సుకవి... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top