Translate

  • Latest News

    16, సెప్టెంబర్ 2019, సోమవారం

    బోటు ప్రమాదంలో తిలా పాపం...తలా పిడికెడు...


    పాపికొండలు చూడడానికి వెళ్లిన పర్యాటకుల బోటు ప్రమాదానికి గురై ఇప్పటికి 12 మృతదేహాలు లభ్యం కాగా ఇంకా  32 మందికి పైగా గల్లంతు అయిన వారి ఆచూకీ తెలియాల్సి ఉంది.  ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఇంత  పెద్ద  విషాద ఘటన ఇదే... ఇది నిస్సందేహంగా అధికారంలో ఉన్నవై.ఎస్.ఆర్.సీపీ  ప్రభుత్వానికి పెద్ద రిమార్క్....  రెవిన్యూ, పోలీస్, టూరిజం అధికారుల మధ్య సమన్వయ లోపం... ఓ పక్క వరద పోటెత్తుతున్న పరిస్థితుల్లో బోటు విహారానికి అనుమతులు ఇచ్చిన టూరిజం అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం...  ప్రతిపక్షాలకు అధికార పార్టీని విమర్శించడానికి ఒక బలమైన ఆయుధం దొరికింది... అయితే.. ఇదంతా ఈ మూడు నెలల్లో కొత్తగా జరిగిన విషయాలేమి కావు... ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన నిర్లక్ష్యం.... ఇప్ప్పుడు ఇలా... ఇన్ని ప్రాణాలను బలి తీసుకుంది... వ్యవస్థలో వేళ్లూనుకున్న నిర్లక్ష్య వృక్షాన్ని కూకటి వేళ్ళతో పెకలించాల్సి ఉంది... ఇది ఒక్క మూడు నెలలు...ఆరు నెలల్లో అయ్యే పని కాదు... ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ రాష్ట్రంలో అవినీతిని కూకటి వేళ్ళతో పెకలించడానికి ఇప్పటికే తన ప్రయత్నం మొదలు పెట్టారు... ఆ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నారు... ఈ లోగా ఈ విషాదకర  ఉదంతం... జగన్ తప్పనిసరిగా దీనిపై దృష్టి సారిస్తారు... భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తారు...
    అయితే నిన్న జరిగిన బోటు ప్రమాదంలో తిలా పాపం...తలా పిడికెడు... అనే చెప్పాలి... ముందుగా వరద ఉధృతి ఉన్నా అనుమతించిన టూరిజం అధికారులే ప్రధమ ముద్దాయిలు... ఆ తర్వాత ప్రమాదం జరిగిన రోజు అంటే నిన్న ఒక పత్రికలో ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందని, బోటులు నడపకూడదని వార్త ప్రచురితమైనా  సకాలంలో స్పందించని జిల్లా అధికార యంత్రాగం రెండో ముద్దాయి.. పోలీసులను తప్పు పెట్టాల్సిన ఆవసరం లేదు... ఎందుకంటే వారు ప్రమాదం వెళ్లవద్దని హెచ్చరించినా... ఎవరూ వినలేదు... ప్రమాదకర పరిస్థితుల్లో బోట్ నడిపిన (పైగా అంతగా అనుభవం లేని కొత్త డ్రైవర్లతో) బోట్ ఓనర్ మూడో ముద్దాయి... ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించినా  వినకుండా మేము ముందే టిక్కెట్లు కొనుక్కున్నాం... మమ్మల్ని ఆపితే కుదరదు... మేము వెళ్లాల్సిందే... అంటూ పోలీసులతో తగువేసుకున్న పర్యాటకులు నాల్గో ముద్దాయిలు... బోటు ప్రారంభమయ్యేటప్పుడు అందరికి లైఫ్ జాకెట్లు ఇచ్చారు... ముందు పోలీస్ స్టేషన్ ఉంటుంది... పోలీసులు చెక్ చేస్తారు... అందరూ లైఫ్ జాకెట్లు వేసుకోండి... అని చెబితే అందరూ వేసుకున్నారు...కానీ పోలీస్ చెక్ అవగానే అందరూ జాకెట్ తీసి పక్కన పెట్టేశారు. ఊపిరాడడం లేదని కొందరు... డాన్స్ లు... చిందులు వెయ్యాలని కొందరు... జాకెట్లు తీసి పక్కన పడేశారు... ఇంకొందరు ఫ్యాషన్ గా ఒళ్ళో పెట్టుకున్నారు... ఇది పర్యాటకుల నిర్లక్ష్యం... అయితే పర్యాటకులకు దీనిపై అవగాహన కల్పించక పోవడం బోట్ నిర్వాహకుల నిర్లక్ష్యం... భవిష్యత్తులో అయినా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే... ప్రతి బోట్ లోనూ తప్పనిసరిగా ఒక టూరిజం ఉద్యోగి ఉండి పర్యవేక్షణ చేస్తూ ఉండాలి.... బోట్ ప్రారంభమయ్యేముందు టూరిజం ఉద్యోగి పర్యాటకులకు బోట్ ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి పూర్తి అవగాహన కలిగించాలి. ఆ తర్వాతే బోట్ స్టార్ట్ చేయాలి. బోట్ లో టూరిజం ఉద్యోగితో పాటు ఒక పోలీస్ ఉద్యోగిని కూడా ఉంచాలి.. ఆయన అందరూ లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా ధరించి ఉండేటట్లు పర్యవేక్షించాలి. బోట్ అనుమతి ఇచ్చేటప్పుడు.... వాతావరణ శాఖ, ఇరిగేషన్ శాఖ ఆ రోజు పరిస్థితులను అంచనా వేసి, వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే బోట్ కదలాలి. ఏ మాత్రం పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా తక్షణం ప్రయాణాన్ని రద్దు చేయాలి... (నిన్న ప్రమాద సమయంలో గోదావరిలో 5 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది)  పర్యాటకులకు టిక్కెట్ డబ్బులు వెనక్కు ఇప్పించాలి. ఈ క్రమంలో ఎక్కడ తేడా వచ్చినా సంబంధిత అధికారులు లేదా వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి... చివరిగా... ప్రమాదం జరగ్గానే... ఆ పక్కగా రెండు బోటులలో వెళుతూ వెంటనే  స్పందించి 16 మందిని కాపాడిన మత్స్యకారులకు హాట్సాఫ్.... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బోటు ప్రమాదంలో తిలా పాపం...తలా పిడికెడు... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top