Translate

  • Latest News

    19, సెప్టెంబర్ 2019, గురువారం

    మీడియా మేనేజ్మెంట్ లో బాబు సక్సెస్...జగన్ ఫెయిల్


    గత కొన్ని రోజులుగా రాజకీయ పరిణామాలను దగ్గర నుంచి చూసేవారికి టీడీపీ తెంపరితనం, వైసీపీ అవగాహన రాహిత్యం అర్థమౌతుంటాయి. రాజకీయం అంటే రాజకీయంలానే ఉండాలి. అందుకే సంవత్సరాల నాడే కౌటిల్యుడు రాజకీయాల్లో రాజు  ఎలా ఉండాలో, ఎవరిని ఎలా ఉంచాలో, ప్రత్యర్థులను ఎలా దెబ్బతీయాలో చెప్పారు. ఈ విద్య రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలిసినంతగా ఎవరికి తెలియకపోవచ్చు. 
     కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కొన్ని రోజుల పాటు అవకాశం ఇద్దాం ఆ తదుపరి ఆ ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపుదాం అంటూ కొత్త ప్రభుత్వం గద్దె ఎక్కిన సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సెలవిచ్చారు. అప్పుడే చాలామందికి చంద్రబాబు తన సహజరీతికి వ్యతిరేకంగా ఇలా మారిపోయారేమిటి అనే డౌట్ కూడా వచ్చి ఉండవచ్చు. అయితే ఆ తదుపరి బాబు తన విశ్వరూపాన్ని చూపించారు. ప్రతి చిన్న విషయాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మలచటానికి తీవ్ర కృషి చేశారు. ప్రతి వివాదాన్ని పార్టీలకు ఆపాదించి టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఎలా ఇబ్బంది పెడుతున్నారో అంటూ కొత్త ఎపిసోడ్ కు తెరతీశారు. ఇందు కోసం ఏ పార్టీ ఇప్పటివరకు నిర్వహించని విధంగా బాధితులకు శిభిరాలు అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారు. చలో ఆత్మకూరు ఆంటూ హడావిడి చేశారు. ఈ ఎపిసోడ్లో చంద్రబాబు అనుకున్నది సాధించారు. జాతీయ మీడియాను ఆకర్షించి ఏదో జరుగుతుందన్న ప్రచారం పొందారు. స్వతహాగా స్థానిక పరిస్థితులను ఆకళింపు చేసుకోలేని కొన్ని జాతీయ మీడియా చంద్రబాబు స్కిప్షను యధావిడిగా ప్రచురించి చంద్రబాబుకు మేలు చేకూర్చాయి. కొన్ని జాతీయ ఛానల్స్లు, ప్రింటిమీడియాలలో అయితే జగన్ను ఒక ఫ్యాక్షనిస్టుగా చిత్రీకరించాయి. ఇది ముగిసిన వెంటనే పడవ ప్రమాదం, వెను వెంటనే డాక్టర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య విషయం ఇలా బాబుకు జగన్పై ఒరద చల్లటానికి ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా వినియోగించుకున్నారు. ఇక్కడే ఒక్క విషయం గమనించాలి. శవరాజకీయాలు చేయటంలో బాబు దిట్ట అని చెబుతారు. బావమరిది హరికృష్ణ బతికి ఉన్నప్పుడు కనీస విలువ ఇవ్వని చంద్రబాబు , చనిపోయిన తరువాత అక్కడే ఉండి తెలంగాణ  ఎన్నికల పొత్తుల గురించి మంతనాలు చేశారు. ప్రస్తుతం పార్టీలో సీనియర్ నేత డాక్టర్ కోడెల విషయంలోనూ చంద్రబాబు వ్యవహరించిన తీరు విస్మయం కలిగిస్తుంది. బతికి ఉన్నన్నాళ్లు కనీసం అపాయింటిమెంట్ కూడా ఇవ్వకుండా, ఆయనపై విమర్శలు చేయాలని ప్రోత్సహించిన చంద్రబాబు, కోడెల ఆత్మహత్య చేసుకొని మరణించిన తరువాత ప్రవర్తించిన తీరు రాజకీయాల్లో అవసరానికి తగ్గట్టుగా ఇప్పటికప్పుడు ఎలా ప్లేట్ ఫిరాయించాలో... కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికి  ఒక పాఠ్య గ్రంధం...  గంటల సమయం కోడెల భౌతిక కాయం వద్ద గడుపుతూ, మీడియాని సమర్ధవంతంగా వినియోగించుకున్నారు. వీటితో చంద్రబాబుకు వచ్చే మేలు ఏమిటి... ఐదు సంవత్సరాల పాటు ఎన్నికలు కూడా లేవు అనుకోవచ్చు. కాని విష ప్రచారం వల్ల కలిగే ప్రభావం ఎలా ఉంటుందో బాబుకు బాగాతెలుసు. నాడు మామ ఎన్టీఆరేను పదవి నుంచి దింపటానికి ఇలాంటి మీడియా మేనేజ్ మెంట్, విష ప్రచారాలను సమర్ధవంతంగా వినియోగించుకున్న విషయం తెలిసిందే. 
    ఇక వైసీసీ ప్రభుత్వం, జగన్ గురించి చెప్పుకోవాలంటే గత చంద్రబాబు ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో చేపట్టలేని పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు 100 రోజుల పాలనలో చేసి చూపుతున్నారు. తాను చేసిన హామీలను ఎంత త్వరగా అమలు చేసి ఇంతవీలైనంత త్వరగా ప్రజల మన్ననలు పొందాలని ఆలోచిస్తున్నారు. చంద్రబాబు రాజకీయాలను పట్టించుకోకుండా కామ్ గా తన పని తాను చేసుకువెళ్లిపోతున్నాడు...అయితే రాజకీయాల్లో ఇది పనికి రాదు... కేవలం నేను ప్రజలకు మంచి చేస్తున్నాను... ప్రజలే నన్ను అక్కున చేర్చుకుంటారు అనే సూత్రాన్నే జగన్ నమ్ముకున్నారు... కానీ రాజకీయాల్లో పనితో పాటు... ప్రతిపక్షం ఎత్తుగడలను సమర్ధవంతంగా ఎదుర్కోవడం కూడా చాలా అవసరం.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన స్వంత మీడియా కాని, సోషల్ మీడియా కాని, పక్కనే ఉన్న నాయకులు గాని చంద్రబాబును సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నాయి. టీడీపీ నాయకుల విమర్శలకు కౌంటర్ ఇవ్వటానికి సమయం గడిచిపోతుంది. స్వంత మీడియా కూడా జగన్ కు సమర్ధవంతంగా ఉపయోగపడటం లేదన్న విమర్శలు ఉన్నాయి. జాతీయ మీడియా అనుసంధాన కర్త గా జగన్ నియమించుకున్న దేవులపల్లి అమర్ మొన్న ఆత్మకూరు విషయంలో కానీ, నిన్న కోడెల విషయంలో కానీ జగన్ కు ఏ మాత్రం ఉపయోగపడలేదు... ఈ విషయమై జగన్ అమర్ ను పిలిచి మందలించినట్టు కూడా తెలుస్తోంది... స్థానిక, జాతీయ మీడియాలో ప్రధానమైన జర్నలిస్టులకు ఒక్కొక్కరికి అమరావతిలో 75 లక్షల విలువైన ప్లాట్ లు ఇచ్చి చంద్రబాబు కొనుగోలు చేశాడని సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అదే నిజమైతే...  మరి వారు చంద్రబాబు కు అనుకూలంగా రాయక...జగన్ కు అనుకూలంగా ఎలా రాస్తారు... అందుకే  మీడియా ఎక్కువ భాగం ఇప్పటికీ చంద్రబాబును  మోస్తున్న విషయం గమనించాలి. దానికితోడు... టీడీపీ నాయకుల విమర్శలను సమర్థవంతంగా తిప్పి కొట్లగల వైసీపీ నాయకులు ఎందుకో అనుకున్న విధంగా స్పందించటం లేదు. ప్రభుత్వం  చేస్తున్న సంక్షేమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లటం, ప్రతిపక్ష విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొడుతూ , వారిని గుక్కతిప్పుకోకుండా చేసే మేనేజ్మెంట్ అధికార పార్టీలో కరువైంది. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రతి ఆవకాశాన్ని సమర్ధవంతంగా వినియోగించుకొని ప్రజల మన్ననలు పొందటంలోనే నాయకుడి గొప్పతనం బయట పడుతుంది. ఇప్పడే ప్రభుత్వ పగ్గాలు చేపట్టి ఆడుగులు వేస్తున్న సీఎం జగన్మోహాన్ రెడ్డి రానున్న రోజులో ఈ దిశగా పరిపాలనను పరుగులు పెట్టించి, ప్రతి పక్షాన్ని సమర్ధవంతంగా ఎలా ఎదుర్కొంటారో వేచి చూద్దాం.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మీడియా మేనేజ్మెంట్ లో బాబు సక్సెస్...జగన్ ఫెయిల్ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top