Translate

  • Latest News

    20, సెప్టెంబర్ 2019, శుక్రవారం

    నిస్తేజంగా వైసీపీ సోషల్ మీడియా



    సుదీర్ఘ పోరాటం, అప్పటి అధికార పార్టీ దాడులు, కేసులు, జైళ్లు అన్నీ ఓర్చుకొని ప్రజల మద్దతుతో జగన్ అనే నేను అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. చరిత్రలో ఎన్నడు లేని విధంగా టీడీపీ తుడిచి పెట్టుకుపోయింది. రాష్ట్ర శాసన సభలో అత్యధిక సీట్లు సాధించి వైసీపీ అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారం చేపట్టింది. అధికారం చేపట్టిన తర్వాత జగన్ కళ్లు ఏమీ  నెత్తికి ఎక్కలేదు. అదే పిలుపు... సీఎంగా ఉన్నా అదే విధమైన బాడీ లాంగ్వేజ్. ప్రజలకు సేవ చేసి మంచి సీఎంగా ప్రజలను పొందాలన్న ఆకాంక్ష. ఇందుకోసం అనుక్షణం పాటు పడుతున్న విధానం. అంతా బాగుంది. కాని అనుకున్నంతగా  ప్రజలకు  చేరువ కాలేకపోతున్నారు. కేవలం మూడు పదుల సీట్లు సాధించిన ప్రతిపక్షం టీడీపీ రెచ్చిపోతొంది. ఏదో జరిగిపోతోందన్న అనుమానాలు  ప్రజల్లో కల్పిస్తున్నారు. గోబెల్ ప్రచారాన్ని  నమ్ముకొన్న చంద్రబాబు చెప్పిన మాటలే చెబుతూ అబద్ధాలను నిజం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ మీడియా, సోషల్ మీడియాలో 100 రోజుల జగన్  పాలనపై విమర్శలు మొదలయ్యాయి.
     ఎవరు అవునన్నా కాదన్నా...  జగన్ అధికారంలోకి రావటానికి వైసీపీ సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. ఎవరితో ప్రమేయం లేకుండానే చదువుకొని, జగన్ అంటే అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియా కార్యకర్తగా మారిపోయాడు. చంద్రబాబు పాలనపై, పథకాలపై , టీడీపీ నాయకులు, కార్యకర్తలపై సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు. మరో విధంగా చెప్పాలంటే జగన్ మీడియా సాక్షిని ను కూడా దాటుకొని సోషల్ మీడియాలో బాబును, టీడీపీ అవినీతిని చీల్చిచెండాడారు. పాటలు, చిన్న కథలు, వ్యంగ కథనాలు, డిజిటల్ మీడియాలో వెబ్ సైట్లు ప్రతి అవకాశాన్ని వైసీపీ సోషల్ మీడియా సద్వినియోగం చేసుకొని, నాడు చంద్రబాబు సర్కారును ముప్పతిప్పలు పెట్టింది. ఇక్కడే ఒక విషయం చెప్పుకోవాలి.టీడీపీ మొదటి నుంచి సోషల్ మీడియా విషయంలో సుస్పష్టమైన వ్యవస్థ కలిగి ఉంది. చినబాబు లోకేష్ ద్వారా ప్రతి ఏటా టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు శిక్షణ ఇప్పించటం, నియోజకవర్గ స్థాయి కార్యకర్తలకు ప్రతి నెలా గౌరవ వేతనం అందజేయటం, ఇతర ప్రోత్సాహకాలు  అందజేస్తూ వచ్చారు. కాని గత ఎన్నికల విషయంలో టీడీపీ సోషల్ మీడియా చచ్చుపడిపోయింది. కోట్లాది రూపాయలు వెచ్చించి నడిపిస్తున్న టీడీపీ సోషల్ మీడియా, ఎటువంటి ప్రయోజనం లేకుండా, కనీసం శిక్షణ కూడా లేకుండా కొనసాగిన వైసీపీ సోషల్ మీడియా దెబ్బకు నిలబడలేకపోయింది. దీంతో అప్పట్లో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై దాడులు, పోలీసు కేసులు, వేధింపులు ఎక్కువయ్యాయి. అయినా తట్టుకొని తాము నమ్ముకొన్న నాయకుడి కోసం తెగించి ప్రాణాలు ఒడ్డి  పోరాడారు. అనుకున్నది సాధించారు.
     ఇంతటి సమర్థవంతమైన వ్యవస్థ ఉన్న వైసీపీ సోషల్ మీడియా ప్రస్తుతం నిరాశనిస్పృహలతో కొట్టుమిట్టాడుతోంది.  అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం తమను పట్టించుకోలేదన్న భావన వారిలో ఉంది. ఇటీవల టీడీపీ స్థాయిలో అధికార పార్టీకి ప్రభుత్వానికి అనుగుణంగా సోషల్ మీడియాను పునవ్యవస్థీకరించాలని కొంతమంది తలంచారు. కానీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో 100 రోజుల పాలన కాలంలో జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు గత ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు కూడా చేపట్టి ఉండకపోవచ్చు. ఎన్నికల ముందు ప్రజల ఓట్ల కోసం ప్రవేశ పెట్టిన పథకాలు అతని ఓటమి నుంచి కాపాడలేకపోయాయి. జగన్ ప్రభుత్వం కేవలం వంద రోజుల్లోనే ఎన్నో మంచి పనులు చేసినా... అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా, రోజుకో పథకం ప్రజల కోసం ప్రవేశపెడుతున్నా అధికార పార్టీ వాటిని ప్రజల వద్దకు చేర్చటంలో విఫలమవుతోంది. వైసీపీ అధికార మీడియా ఈ విషయంలో విఫలం కావటంతో టీడీపీ సోషల్ మీడియా రెచ్చిపోతోంది. దీనికి తోడు అన్ని మీడియా సంస్థలను చంద్రబాబు మేనేజ్ చేసి  ఉండటంతో బాబు అండ్ కో చేస్తున్న తప్పుడు ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళుతోంది. ఈ క్రమంలో సమర్ధవంతులైన వైసీపీ సోషల్ మీడియా ను ప్రభుత్వం వినియోగించుకోవాలని వారు కోరుతున్నారు.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నిస్తేజంగా వైసీపీ సోషల్ మీడియా Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top