Translate

  • Latest News

    21, అక్టోబర్ 2019, సోమవారం

    పచ్చ పత్రికల్లో అక్షరాల వాంతులు


    అవును నిజమే...ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ చెప్పినట్టు మన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజా ధనాన్ని  పప్పు బెల్లాల్లా పంచేస్తున్నారు... కానీ పంచేదెవరికి... ఆ ప్రజలకే కదా.... తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాజధాని పేరు చెప్పి అక్కడ ఎకరా...రెండు ఎకరాలు సాగు చేసుకునే పేద రైతుల భూముల్ని నయానా, భయానా బెదిరించి లాగేసుకుని...  వేల కోట్ల రూపాయల విలువైన ఆ భూములన్నీ కొద్దిమంది పెద్దలకు కట్టబెట్టి   కోట్ల రూపాయల  కమీషన్లు బొక్కలేదుగా... ప్రజల సొమ్ము... నిజమైన పేదలకే వివిధ పధకాల రూపంలో ఇస్తున్నారు... అదేగా మీ ఏడుపు.... మీ లెక్కల ప్రకారం... సమాజంలో ఏదో మీ లాంటి అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన కొద్దిమంది బాగుపడాలి...;పేదోళ్లు...ఎప్పుడూ పేదలుగానే వుంటూ మీ కాళ్ళ కింద బతుకుతూ... మీకు సేవలు చేసే వర్గం గానే బతకాలి... అంతే కానీ... ఈ జగన్ ఏంటీ... అన్నిటిలోనూ బి.సి., ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు అంటాడు... పదవుల్లో ఇచ్చాడు... సరే.... కాంట్రాక్టుల్లో కూడా అంటాడేమిటీ... వాళ్లు  కూడా సంపాదించేసి ఎదిగిపోతే ఎట్లా... రేపు వైట్ కాలర్ తో వచ్చి మా పక్కన కూర్చుంటే ఎట్లా... అది సహించలేకే కదా.. మేము కారంచేడులో... చుండూరులో చంపి పడేశాం... ఈ జగన్ కు ఏమైనా పిచ్చా...
    అవును పిచ్చే... జగన్ కు పిచ్చి... పేదోళ్లకు ఎదో చేసేయాలనే పిచ్చి... తన తండ్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి కంటే ప్రజలకు ఎక్కువ మేళ్లు చేసేయాలని పిచ్చి. ప్రజల  గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోవాలనే పిచ్చి... అందుకే... మీలాగా ఎన్నికల్లో గెలవడం కోసం ఎన్నికలకు ఆరు నెలల  ముందు పధకాలు పెట్టి జనాలను ఏమార్చి... మభ్యపెట్టి... మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తేనే ఈ పథకాలన్నీ ఉంటాయని భయపెట్టి ఎన్నికల్లో గెలవాలనుకునే రకం కాదు... తాను చెప్పినవన్నీ గెలిచి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న క్షణం నుంచే అమలు చేయడం మొదలుపెట్టాడు... నాలుగు నెలల్లోనే నాలుగేళ్లకు సరిపడా చట్టాలు చేశాడు. కాకపొతే... అవన్నీ వన్ బై వన్ ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం నెలకు ఒకటి, రెండు చొప్పున అమల్లోకి తెస్తున్నాడు. ఇవన్నీ అమలు చేసేసి పేదోళ్ల గుండెల్లో ఎక్కడ జగన్ శాశ్వతంగా నిలిచి పోతారో అనే కదా మీ భయం... అందుకేగా... ఈ పిచ్చి పలుకులు... మీరిలాగే వారం....వారం.. మీ సంధి ప్రేలాపనలు పేలుకుంటూ ఉండండి... జగన్ చేసేది చేసుకుంటూ పోతారు... ఏదీ ఆగదు.. అన్నీ సక్రమంగా జరుగుతూనే ఉంటాయి... మీరు మింగలేక...కక్కలేక... మీ పచ్చ పత్రికల్లో ఇలా అక్షరాల వాంతులు చేసుకోవడం తప్ప మీరు చేసేదేమీ లేదు...
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పచ్చ పత్రికల్లో అక్షరాల వాంతులు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top