Translate

  • Latest News

    22, నవంబర్ 2019, శుక్రవారం

    ముసుగులు తొలగిపోతున్నాయ్


    అవును ముసుగులు తొలగిపోతున్నాయి... అభ్యుదయం...  విప్లవం...అరసం...విరసం... సి.పీ.ఐ... సి.పీ.ఎం.. ఎం.ఎల్... ఇంకా  తెలుగు భాషోద్యమం అంటూ ఇలా.... రకరకాల ముసుగులు తొడుక్కున్నవారంతా... ఇప్పుడు జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అనగానే ఒక్కొక్కరు...తమ తమ ముసుగులు తీసేసి నిజరూప దర్శనం గావిస్తున్నారు... ఈ విషయంలో నిజంగా బహుజనులంతా జగన్ కు థాంక్స్ చెప్పుకోవాలిసిందే... ఎందుకంటే... ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం టాపిక్ రాకపోతే... ఇంకా మనమంతా ఆ సోకాల్డ్ అభ్యుదయ వాదులు...విప్లవకారులంటూ... వారిని నెత్తిన పెట్టుకుని ఊరేగే వాళ్ళమే... మన మనస్సులో వారికి గొప్ప స్థానం ఇచ్చి గౌరవించే వాళ్ళమే...
    హమ్మమ్మా... ఒక్కొక్కరిలో ఎంత కుళ్ళు...కుతంత్రాలు...ఓరి బాబోయ్... వారి నిజ రూప దర్శనం చూసి తట్టుకోలేక పోతున్నాం.. జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టటం క్రైస్తవ మత  వ్యాప్తి కోసమేనట... శ్రీశ్రీశ్రీ వేమూరి రాధాకృష్ణ స్వామిజీ గారి భాష్యం... మరి ఇన్నాళ్లు... చైతన్య, నారాయణలు ఏ మతాన్ని  వ్యాప్తి చేశారో.వారే చెప్పాలి...

    ఏదయినా వారు చేస్తే ఒప్పు...వీరు చేస్తే తప్పు... ఇప్పటిదాకా నేను కూడా ఈ సిద్ధాంతం ఒక్క చంద్రబాబు అండ్ ఎల్లో మీడియా కే వర్తిస్తుందనుకున్నా.... ఇప్పుడు ఈ  సిద్ధాంతాన్ని వామపక్షాలు... ఇతర ఎం.ఎల్ గ్రూప్ లు, అరసం..విరసం లకు కూడా వర్తిస్తుందని నాకు జ్ఞానోదయమైంది... వన్స్ అగైన్ థాంక్స్ టు జగన్...
    ఎల్లో మీడియా గురించి  కొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు. కానీ ఈ సోకాల్డ్ విప్లవ వాదుల వింత వాదన చూడండి...
    ఇవి విరసం పాణి గారి పలుకులు 
    మీ పిల్లలు ఏ మీడియం లో చదువుతున్నారు అని జగన్ ప్రశ్నించడంలో దురహంకారం... అధికార మదం మాత్రమే ఉంది... మాతృ భాషా మాధ్యమాన్ని కూడా ఉంచండని కోరుతున్న వాళ్ళతో రాష్ట్ర అధినేతగా ఆయన హేతుబద్ధ వాదనకు దిగాలి కానీ... ఆయనకు మొరటు ముఠా రాజకీయాలు మాత్రమే తెలుసు... అలాంటి వాడికి భాషా సామాజిక సాంస్కృతిక చర్చ చేయగల వివేకం ఎక్కడ నుంచి వస్తుంది... అంత  సున్నితత్వం ఎక్కడ అరువు తెచ్చుకుంటాడు... జగన్మోహన్ రెడ్డి కి ఇవి ఎలాగూ లేవు..రావు... కానీ మీ పిల్లలు ఏ మాధ్యమంలో చదువుతున్నారని ఎదురు ప్రశ్న నైతికసంబంధమైనదనే జ్ఞానం కుడా ఉన్నట్టు లేదు... ఇలా ఎదుటి వాళ్ళ నోరు మూయించే నైతికత ఏ విషయంలోనూ తనకు లేదని ఆయనకు ఎవరు చెప్పాలి... కాస్త పాలిష్డ్ వీధి రౌడీ అయిన తనకు ఈ మాట చెప్పగలిగే సమ ఉజ్జిలు బహుశా తెలుగుదేశం పార్టీ, ఆంధ్రజ్యోతి మాత్రమే కావచ్చు... 


     పై మాటలు వింటుంటే చంద్రబాబు నోటి నుంచో... వేమూరి రాధాకృష్ణ నోటి నుంచో ఊడిపడ్డట్టున్నాయి కానీ... అవి పాణి పలుకుల్లా లేవు...పైగా జగన్ పాలిష్డ్ వీధి రౌడీ అట... అందుకని ఆయనతో వాదించేందుకు చంద్రబాబుకు...వేమూరి రాధాకృష్ణకు వకాల్తా ఇచ్చేశారు మన పాణి గారు. ఏ పార్టీలో ఉన్నా మనువాదులందరూ ఒకటే అని తేలిపోయింది... నాడు శ్రీరాముడిని ప్రశ్నించిన శంబూకుడి తల  నరికినట్టు.... ఇప్పుడు మేం ఇంగ్లిష్ చదువులు ఎందుకు చదవకూడదు అని ప్రశ్నిస్తుంటే... అన్ని విప్లవ పార్టీల నాయకులు సైతం విరుచుకుపడుతున్నారు.. ఎర్ర ముసుగు వేసుకున్నా కాషాయం నీడలు కనపడుతూనే ఉన్నాయి.. 

    ఇక మరో విరసం రచయిత్రి గారు అంటారు... ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం కరెక్ట్ కాదంట.. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పెడితే తప్పేంటి.. వాళ్ళు కూడా పెద్ద చదువులు చదువుకుంటారు కదా అని అంటే... ఆవిడ వాదన ఏమిటంటే... సర్కార్ బడుల్లో టీచర్లకు ఇంగ్లీష్ మీడియం లో చెప్పగల స్టాండర్డ్స్ లేవట... మరి నారాయణ, చైతన్య లో చిన్న క్లాస్ పిల్లలకు చెప్పేవాళ్ల  స్టాండర్డ్స్ ఏమిటో... వాళ్లంతా ఇంటర్ బేస్ గాళ్ళ్లేగా... ఇంకా సర్కార్ బడుల్లోనే టి.టి.సి, లేదా బి.ఎడ్ వాళ్ళుంటారు... పైగా జగన్ క్లియర్ గా చెబుతున్నారు... ఇఫ్లూ ప్రొఫెసర్లతో మన టీచర్లకు కోచింగ్ ఇప్పిస్తానని... ఇంగ్లీష్ లాబ్ లు పెడతానని... ఇంటర్ వరకు తెలుగు కంపల్సరీ సబ్జెక్టు చేస్తానని... అయినా ఈ రంధ్రాన్వేషణ గాళ్ళు  మేం పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టు వితండ వాదన... వీరికి తెలుగు మీద ప్రేమ కారిపోతుంటే ముందు కార్పొరేట్ కాలేజీల్లో మార్కుల కోసం  సంస్కృతం సబ్జెక్టు కాకుండా...కంపల్సరీ తెలుగు పెట్టమనండి చూద్దాం...
    యూ ప్రొసీడ్ జగన్...
    ఏదిఏమైనా ఇప్పుడు మనకే కాదు... జగన్ కు కూడా పిక్చర్ క్లియర్ గా అర్ధమైపోయింది... అందుకే  మత్యకారుల భరోసా పధకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముమ్ముడివరంలో ఆయన ఇలా వ్యాఖ్యానించారు...  శత్రువులెవరో తెలిసిపోయింది... ఎంతమంది శత్రువులెదురైనా ఒక్కడినే ఎదుర్కొంటా... అని అనడం గమనార్హం... జగన్ యూ ప్రొసీడ్... నీ వెనుక మేమున్నాం... అడుగు ముందుకు వేయి..


    • -మానవేంద్ర బసు 




      • Blogger Comments
      • Facebook Comments

      0 comments:

      కామెంట్‌ను పోస్ట్ చేయండి

      Item Reviewed: ముసుగులు తొలగిపోతున్నాయ్ Rating: 5 Reviewed By: Bhinna Swaram
      Scroll to Top