Translate

  • Latest News

    30, నవంబర్ 2019, శనివారం

    బతుకుతెరువు చదువులు కాదు...బతకడం నేర్పించాలి



    ప్రస్తుత విద్యా విధానంలో చదువులు ఉద్యోగాలను ఇస్తున్నాయి... ఆ ఉద్యోగాలతో మంచి..మంచి. జీతాలను ఇస్తున్నాయి.... అవి లక్సరీగా బతకడానికి పనికొస్తున్నాయి. కానీ మనిషిగా ఈ సమాజంలో ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా ఎదుర్కొనే మానసిక స్తయిర్యాన్ని ఇవ్వలేకపోతున్నాయి. హైదరాబాద్ లో మూడు రోజుల కిందట జరిగిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ గ్యాంగ్ రేపే, హత్య దేశ వ్యాప్తంగా సంచలనమ్ సృష్టించింది. 

    క‌ష్టాలు వ‌చ్చిన‌ప్పుడే ఆ క‌ష్టాల్లో నుంచి బ‌య‌ట‌ప‌డే  నేర్పు అవ‌స‌రమౌతుంది. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనే విజ్ఞ‌తగా వ్య‌వ‌హ‌రించ‌టం, ఆ ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట‌ప‌డే అవ‌గాహన కొంత‌మందికే ఉంటుంది. ఇందుకు చ‌దువు ఒక్క‌టే ప్రామాణికం కాదు కాని , విద్య‌తో పాటు వివేకం పెర‌గాలి. ఈ దిశ‌గా విద్యా  వ్య‌వ‌స్థ ఉండాలి. బ‌ట్టిల చ‌దువుల‌తో, పోటీ ప‌రీక్ష‌ల పోటీత‌త్వం నుంచి ఆలోచించే త‌ల్లిదండ్రులు పిల్ల‌ల మాన‌సిక ప్ర‌వ‌ర్త‌న ఎలా ఉంటోందన్న ప్రాధ‌మిక విష‌యాల‌ను గుర్తించ‌క‌లేక‌పోతున్నారు. సైన్సు చ‌దివే విద్యార్దికి బ‌య‌ట ప్ర‌పంచంలో ఏం జ‌రుగుతోందో తెలియ‌దు. ఆర్ట్స్ చ‌దువుకున్న వారికి సైస్సు గురించి  ప్రాధమిక అవ‌గాహ‌న ఉండ‌దు. అందుకే గ‌తంలోనే కొంత‌మంది  ప‌రీక్ష‌ల్లో విజ‌యం కాదు బ‌త‌కడం ఎలాగో నేర్పించండి అంటూ నేటి విద్యావ్య‌వ‌స్థ‌పై ప్ర‌శ్నించారు. ఇప్పుడు ప్రియాంక రెడ్డి విష‌యానికే వ‌ద్దాం. అన్నీ ప‌రీక్ష‌లు దాటుకొని విజ‌యం సాధించింది. కంఫర్ట్ లైఫ్  అనుభ‌వించ‌టానికి అవ‌స‌రమైన ఉద్యోగం కూడా ఉంది. కాని విప‌త్క‌ర‌ ప‌రిస్థితులు ఎదుర్కొనే నైపుణ్యం క‌రువైంది. ఇది తెలియ‌క‌పోవ‌టం వ‌ల‌న త‌న జీవితాన్నే ప‌ణంగా పెట్టింది. 

    ప్రియాంక రెడ్డి డ్రైవ‌ర్లు అనుస‌రిస్తున్నార‌ని ఫోనోలో చెల్లికి  ఫోన్ చేసి చెప్పిన‌ప్పుడు అప్ప‌టికే ప్ర‌మాదంలో చిక్క‌కుంది. ఇటువంటి స‌మ‌యంలోనూ  ఫోన్ చేసే అవ‌కాశం వ‌చ్చింది.కాని ఫోన్ చెల్లికి కాకుండా  అదే ఫోన్ పోలీసుల‌కు చేసి ఉంటే ఇటువంటి ఘోర‌క‌లి జ‌రిగి ఉండేది కాదు. మ‌రొక్క విష‌యం చెల్లి  చెప్పిన‌ట్లు వివేకంతో ఆలోచించి టోల్‌ప్లాజా వ‌ద్ద‌కు చేరుకున్నా అక్క‌డ ర‌క్ష‌ణ ల‌భించి ఉండేది. ఈ అవ‌కాశాలు ప్రియాంక మిస్ అయ్యింది. 
     గ‌తంలో చిన్న‌పిల్ల‌ల‌కు అనేక క‌థ‌లు చెప్పే బామ్మ‌లు ఉండేవారు. ఈ క‌ధ‌ల‌లో విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు క‌థ‌ల‌లోనే క‌దానాయ‌కులు ప్ర‌వ‌ర్తించే తీరు గురించి ఉండేవి. చిన్న‌త‌నంలోనే ఈ క‌థ‌లు విన్న పిల్ల‌ల మ‌న‌స్సులో తెలియ‌కుండానే స‌మ‌స్య‌లు ఎదురైన‌ప్పుడు ఎలా ఎదుర్కోవాలో ఒక్క అవ‌గాహ‌న ఉండేది. కాని ఇప్పుడా ప‌రిస్థితి లేదు. పాఠ‌శాల‌ల స్థాయిలోనే వ్య‌క్తిత్వ వికాసం పెంపోందించుకోవ‌టానికి అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ ఇప్పిస్తే ఇటువంటి స‌మ‌స్య‌లను వారు అవ‌లీల‌గా ఛేదించగలరు. ఆక‌లిగా ఉన్న వారికి చేప‌లు ఇవ్వ‌వ‌ద్దు. చేప‌లు ప‌ట్ట‌డం నేర్పు అన్న చైనా సామేత‌కు అర్ధం  ఇదే.  

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బతుకుతెరువు చదువులు కాదు...బతకడం నేర్పించాలి Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top