Translate

  • Latest News

    30, మార్చి 2020, సోమవారం

    చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ట్రంప్


    చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అని పెద్దలు అంటుంటారు... ఇప్పుడు ట్రంప్ పరిస్థితి చూస్తే ఆ సామెతే గుర్తు వస్తోంది. ఒక సిసలైన రాజకీయ వేత్తను కాకుండా... ఒక వ్యాపారవేత్తను దేశ అధ్యక్షుడిగా గెలిపించుకున్నందుకు ఇప్పుడు ఆ దేశస్తులు ఫలితాన్ని అనుభవిస్తున్నారు. సహజంగా వ్యాపారి అయిన ట్రంప్ కరోనా వలన ఎక్కడ దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుందేమో అని లాక్ డౌన్ ప్రకటించకుండా వదిలేశాడు. డబ్బుకు ప్రాముఖ్యం ఇచ్చాడే కానీ... మనుషుల ప్రాణాల గురించి పట్టించుకోలేదు... అందుకు ఫలితం...ఇప్పటికి (మార్చి 30) ఆ దేశంలో కరోనా కేసులు లక్షా యాభయ్ వేలకు చేరుతుంటే... మరణించిన వారి సంఖ్య   సుమారు 2,650 కు  చేరుతోంది. నిన్నటి దాకా ప్రపంచానికి నేనే కింగ్ అన్నట్టుగా అహంకారంతో కన్నూ మిన్నూ కానక వ్యవహరించిన అమెరికా ఇప్పుడు కంటికి కనిపించని కరోనా వైరస్ ధాటికి చిగురుటాకులా వణికిపోతోంది... మరో పక్క కమ్యూనిస్టు దేశాలు కరోనాను చాలావరకు  నియంత్రణ చేయడం గమనార్హం. అమెరికాలో జనవరి 21 న మొదటి కేసు నమోదు అయినప్పటి నుంచి   మార్చి 17 వరకు కేవలం 6344 కేసులు  ఉంటే ఆ  తర్వాత కేవలం 13 రోజుల్లో రోజుకు 10 వేల నుంచి 17 వేల దాకా పెరుగుతూ వస్తూ వచ్చింది. దీంతో ట్రంప్ కి ఇప్పుడు తెలిసొచ్చింది కరోనా తీవ్రత... ఇప్పుడు కళ్ళు తెరిచాడు... అయినా ఇప్పటికి ఆయన గారు ఇంకా పూర్తిగా లాక్ డౌన్ ప్రకటించలేదు... లాక్ డౌన్ ప్రకటిస్తే వాళ్ళ ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తింటుందనే ఇప్పటికీ ఆయన గారి నిశ్చితాభిప్రాయం. 
    మన వాళ్ళ గురించి మనకు ఆందోళన తప్పదా ... 
    అమెరికా ఏమయితే మనకేమిటి అని మనం అనుకోలేము కదా... ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఉన్నత, మధ్య తరగతి కుటుంబానికి కొడుకో, కూతురో.. దగ్గర చుట్టాలో... దూరపు చుట్టాలో ఎవరో ఒకరు అమెరికాలో ఉన్నారు. వారు ప్రస్తుతానికి సేఫ్ గానే ఉన్నా... భవిష్యత్తులో ఎటువంటి ముప్పు సంభవిస్తుందోనన్న ఆందోళన తప్పడం లేదు. ప్రస్తుతం మన వాళ్ళు అంతా  దాదాపుగా ఎక్కువ శాతం మంది సాఫ్ట్ వేర్ కాబట్టి... వర్క్ ఫ్రొం  హోమ్ చేస్తున్నారు... కాబట్టి సేఫ్ గానే ఉన్నారు. అయితే అమెరికన్లలో నిరుద్యోగ శాతం పెరుగుతోంది...ఇటీవల అక్కడ కొన్ని నగరాల్లో మాల్స్ లో లూటీలు కూడా జరిగినట్టు మనం వార్తల్లో చూశాం. ఆఫ్రికా లాంటి దేశాల్లో ఆకలి చావులు... కరువు దాడులు...లూటీలు జరగడం మామూలే కానీ...అగ్ర రాజ్యమైన అమెరికాలో లూటీలు జరగడం ఆశ్చర్యం... ఇప్పుడే ఇలా ఉంటే...   ముందు ముందు అక్కడ పరిస్థితి ఇంకా శృతిమించిపోయే అవకాశం ఉంది.  ఆర్ధిక మాంద్యం ప్రబలితే అక్కడ పనిచేస్తున్న మన వాళ్ళ మనుగడ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సో...  అమెరికాలో ఉన్న మన వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి సుమా... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ట్రంప్ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top